Friday, December 04, 2009

దేవుడమ్మ--1973

Producer::చలం
సంగీత::సత్యం
రచన:: రాజశ్రీ
గానం::S.P.బాలు,P.సుశీల
తారాగణం::చలం,జయలలిత,లక్ష్మి,రాజసులోచన,గీతాంజలి,రామకృష్ణ,
రాజబాబు,రమణారెడ్డి

పల్లవి::

పాపలు మంచికి రూపాలు..దేవుడి గుడిలో దీపాలు
పాపలు మంచికి రూపాలు..దేవుడి గుడిలో దీపాలు 
దీపాలు...దీపాలు
మచ్చలేని మాణిక్యాలు..ముచ్చటైన అరవిందాలు
మచ్చలేని మాణిక్యాలు..ముచ్చటైన అరవిందాలు 
కరుణకు ప్రతిబింబాలు..కనిపించే దేవతలు
పాపలు మంచికి రూపాలు..దేవుడి గుడిలో దీపాలు 
దీపాలు...దీపాలు
తాంతతై తైత తాతై దిగిత.తాంతతై తైత తాతై దిగిత

చరణం::1

అభం శుభం తెలియని వారు..కల్లకపటం ఎరుగని వారు 
అభం శుభం తెలియనివారు..కల్లకపటం ఎరుగని వారు
అసత్యాలు ఆడనివారు..అరమరికలు లేనివారు 
చిలకలవలె పలికేవారు..చిరునవ్వుల పసివారు
పాపలు మంచికి రూపాలు..దేవుడి గుడిలో దీపాలు
పాపలు మంచికి రూపాలు..దేవుడి గుడిలో దీపాలు దీపాలు దీపాలు
తాంతతై తైత తాతై దిగిత..తాంతతై తైత తాతై దిగిత

చరణం::2

చిన్ని చిన్ని పాపలు నేడు..రేపు దేశ పౌరులు మీరు 
చిన్ని చిన్ని పాపలు నేడు..రేపు దేశ పౌరులు మీరు
కాని పనులు చేయరాదు..నీతిబాట వీడరాదుమన 
దేశం గర్వించేలా....మంచి పేరు సాదించాలి
పాపలు మంచికి రూపాలు..దేవుడి గుడిలో దీపాలు
దీపాలు...దీపాలు