Saturday, November 27, 2010

సుఖదుఖాలు--1968






సంగీతం::S.P.కోదండపాణి
రచన::ఆరుద్ర
గానం::S.P.బాలు,P.సుశీల 

ఓ...ఓ..పదారు నా వయసూ..పండింది నా సొగసు
పడుచుగుండే తెలుసుకోలేవా..ఒహో..బావా..ఇలా రావా దోచుకోవా

ఓ...ఓ..పదారు నా వయసూ..పండింది నా సొగసు
ఓహో..ఓహో..ఓహో..ఓహో..ఓహో..ఓహో..ఓహో..

ఓహో..ఓ...ఓ...ఓహో....ఓ..ఓ...

చరణం::1

చిలిపిగా..ఆ..నవ్వకూ..వలపులే పొంగునూ..
కొంటే కొటే చూపులన్ని..గొడవచేసేనూ..హోయ్..
గులాబి బుగ్గలపై..పలాన గురుతులతో..
సరాగ మాడినచో..చల్లని మైకం..

ఓ...ఓ..పదారు నా వయసూ..పండింది నా సొగసు
ఓహో..ఓహో..ఓహో..ఓహో..ఓహో..ఓహో..ఓహో..

చరణం::2

నడకలో..హంసలూ..నవ్వులో..చిలకలూ..
గొంతులోన వంతపాడు కోయిలున్నదీ..
చలాకి నా పరువం..జిలేబి తీపిసుమా..
అందాల నా హొయలూ..ఆరగించుమా..

ఓ...పదారు నా వయసూ..ఊ..ఊ..ఊ..ఊ..
పండింది నా సొగసు..ఊ..ఊ..ఊ..ఊ..

పదారు నా వయసూ..పండింది నా సొగసు
పడుచుగుండే తెలుసుకోలేవా..ఒహో..బావా..ఇలా రావా దోచుకోవా

ఓ...పదారు నా వయసూ..పండింది నా సొగసు
ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ.. 

జగత్ కిలాడీలు--1969






సంగీతం::S.P.కోదండపాణి
రచన::దేవులపల్లి
గానం::S.P.బాలు ,P.సుశీల 
నటీ,నటులు::కృష్ణ,వాణిశ్రీ, S.V.రంగారావ్ 

పల్లవి::

వేళ చూస్తే సందె వేళా..గాలి విస్తే పైరగాలి
వేళ చూస్తే సందె వేళా..గాలి విస్తే పైరగాలి
ఏల ఒంటరి తోటకడకు ఎందుకొరకు..
ఎందుకొరకూ..ఊ..ఎందుకొరకూ..

కళ్ళు కప్పే రాత్రివేళ..ఒళ్ళునిమిరే పిల్లగాలి
మెల్ల మెల్లన తోటపిలిచే అందుకొరకే..అందుకొరకే..

చరణం::1

అచ్చంగా వసంత మాసం..వచ్చేదాకా
వెచ్చన్ని పూదేనియలు..తెచ్చేదాకా
అచ్చంగా వసంత మాసం..వచ్చేదాకా
వెచ్చన్ని పూదేనియలు..తెచ్చేదాకా
పెదవి పెదవి..ఎదురై ఎదురై..
పెదవి పెదవి..ఎదురై ఎదురై..
మధువులు వెదికే వేళా..మగువా అదియే వసంత వేళా

వేళ చూస్తే సందె వేళా..గా వీస్తే పైరగాలి
ఏల ఒంటరి తోటకడకు..ఎందుకొరకూ..ఊ..ఎందుకొరకూ

చరణం::2

రెప్పల్లో దాగిన..చూపులు చెప్పేదేమిటో
గుండెల్లో గుస గుస లాడే..కోరిక లేమిటో
రెప్పల్లో దాగిన..చూపులు చెప్పేదేమిటో
గుండెల్లో గుస గుస లాడే..కోరిక లేమిటో
రారా..వెంటనే..రారా వెంటనే పొదరింటికి
ఇక రాదురా నిదుర..నా కంటికి..

కళ్ళు కప్పే రాత్రివేళ..ఒళ్ళునిమిరే పిల్లగాలి
మెల్ల మెల్లన తోటపిలిచే అందుకొరకే..అందుకొరకే..

వేళ చూస్తే సందె వేళా..గా వీస్తే పైరగాలి
ఏల ఒంటరి తోటకడకు..ఎందుకొరకూ..ఊ..ఎందుకొరకూ

జగత్ కిలాడీలు--1969






సంగీతం::S.P.కోదండపాణి
రచన::కోసరాజు
గానం::S.P.బాలు , విజ్యలక్ష్మి కన్నారావు 

పల్లవి::

ఎక్కడన్న బావా అంటే ఒప్పుకొంటాను పిల్లా ఒప్పుకొంటాను
వంగతోటకాడన్నావంటే తప్పుకొంటాను బుల్లే తప్పుకొంటాను

హోయ్..తోట పెంచను అంతో ఇంతో తోడుగ ఉన్నాను నీకు తోడుగ ఉన్నాన్నూ
వంకచేయ్ నివు చూపావంటే కారం కొడతాను కంట్లో కారం కొడతాను

చరణం::1

కడుపు కష్టమున సంపాయించిన డబ్బులు ఊరక వస్తాయా
కడుపు కష్టమున సంపాయించిన డబ్బులు ఊరక వస్తాయా
తళుక్కుమంటూ..చమక్కుచేస్తే.. వళ్ళో ఊడిపడతాయా

ఎక్కడన్నా..ఎక్కడన్నా బావా అంటే ఒప్పుకొంటాను పిల్లా ఒప్పుకొంటాను
వంగతోటకాడన్నావంటే తప్పుకొంటాను..బుల్లే తప్పుకొంటాను

చరణం::2

దారినపోయే దానయల్ల..ప్రేమంటే సరిపోతుందా..ఓ బుల్లోడా..ఆ..
దారినపోయే దానయల్ల..ప్రేమంటే సరిపోతుందా
వట్టిమాటలకు వాలుచూపులకు..వలపు వచ్చి పై పడుతుందా
హోయ్..పిల్లోయ్..ప్రాణం ఇమ్మని అడిగావంటే..పస్తాయించక ఇస్తాను
అహా..ప్రాణం ఇమ్మని అడిగావంటే..పస్తాయించక ఇస్తాను
బైసా ఇమ్మని గొణిగావంటే..తోకముడిచి పరుగేస్తానూ..

ఎక్కడన్నా..ఎక్కడన్నా బావా అంటే ఒప్పుకొంటాను పిల్లా ఒప్పుకొంటాను
వంగతోటకాడన్నావంటే తప్పుకొంటాను..బుల్లే తప్పుకొంటాను

డబ్బువదలనిది ఎవరికి ప్రేమ డబ్బులేమికాదూ..జోగే డబ్బులేమికాదూ
హా..హ్హ..హ్హ..హ్హ..ఆహా..
...?చూస్తూ ఉంటే మోజు తీరిపోదూ..నీకు మోజు తీరిపోదూ 

అహా..ఎక్కడన్నా..ఓ..ఎక్కడన్నా బావా అంటే ఒప్పుకొంటాను పిల్లా ఒప్పుకొంటాను
వంకచేయ్ నివు చూపావంటే కారం కొడతాను..అబ్బా.. కంట్లో కారం కొడతాను