Thursday, November 25, 2010

మోసగాళ్లకు మోసగాడు--1971




















సంగీతం::P.ఆదినారాయణరావు
రచన::ఆరుద్ర
గానం::P.సుశీల,S.P.బాలు
తారాగణం::కృష్ణ,నాగభూషణం,సత్యనారాయణ,ప్రభాకర రెడ్డి,విజయనిర్మల,జ్యోతిలక్ష్మి,త్యాగరాజుక్ష్మి

పల్లవి::

కోరినది నెరవేరినది.. ఒహో..కలలు నిజమాయే 
కోరినది దరిచేరినది..ఆహా..ఎదలు ఒకటాయే
కోరినది నెరవేరినది..ఒహో..కలలు నిజమాయే 
కోరినది దరిచేరినది..ఆహా..ఎదలు ఒకటాయే
తొలివలపే మధురసము..మనబతుకే పరవశము 
కోరినది నెరవేరినది..ఒహో..కలలు నిజమాయే
కోరినది దరిచేరినది..ఆహా..ఎదలు ఒకటాయే

చరణం::1
       
పూలతోటలై నా అందాలు పూచేనులే 
తనివితీరగా మకరందాలు గ్రోలేనులే
పూలతోటలై నా అందాలు పూచేనులే 
తనివితీరగా మకరందాలు గ్రోలేనులే
దోచుకున్న వలపు దాచుకున్ననాడే 
సుఖం సుఖం సుఖం తోడుగా నీడగా సాగిపో
కోరినది నెరవేరినది ఒహో కలలు నిజమాయే 
కోరినది దరిచేరినది ఆహా ఎదలు ఒకటాయే

చరణం::2

రాగబంధమై పెనవేసుకున్నానులే 
మూగకోరిక నే తెలుసుకున్నానులే
రాగబంధమై పెనవేసుకున్నానులే 
మూగకోరిక నే తెలుసుకున్నానులే
ఊసులాడు వేళ బాసచేయు వేళ 
ఇదే ఇదే ఇదే ఆడుకో ఆశలే తీర్చుకో
కోరినది నెరవేరినది ఒహో కలలు నిజమాయే 
కోరినది దరిచేరినది..ఆహా..ఎదలు ఒకటాయే
తొలివలపే మధురసము..మన బతుకే పరవశము 
ఆహా..హా..హా..ఓహో..హో..హో..  

No comments: