Friday, January 03, 2014

కథానాయిక మొల్ల --1970::చక్రవాకం::రాగం




సంగీతం::S.P.కోదండపాణి
రచన::సినారె 
గానం::P.సుశీల 

చక్రవాకం::రాగం

పల్లవి::

రఘుకుల తిలకా
నీ ఆనతి..రచియించితి..రామాయణ సత్కృతి
ఆకృతి వరియించిన..పతివి నీవే
అతులిత కైవల్య..గతివి నీవే..ఆ ఆ ఆ ఆ ఆ 

జగమే రామమయం..మనసే
అగణిత తారక నామ..మయం
జగమే రామమయం..మనసే
అగణిత తారక నామ..మయం
జగమే రామమయం..

చరణం::1

నీల జలద రమణీయ..రూపం
నిగమాంచల మందిర..మణిదీపం
నీల జలద రమణీయ..రూపం
నిగమాంచల మందిర..మణిదీపం
సుందర జానకీ వందిత..చరణం
సుందర జానకీ వందిత..చరణం
సురముని శరణం..భవతాప హరణం

జగమే రామమయం..మనసే
అగణిత తారక నామ..మయం
జగమే రామమయం..మనసే

చరణం::2

ఆ చిరునవ్వే అమృతపు జల్లు
ఆ చిరునవ్వే అమృతపు జల్లు
అఖిల జగములేలు ఆచేతి విల్లు
అఖిల జగములేలు ఆచేతి విల్లు
అతని గానమున అలరారుకావ్యం
అన్ని యుగాలకు నవ్య్యాతి నవ్యం

జగమే రామమయం..

చరణం::3

ఎవని కమల కమనీయ పదము 
చూపించె అహల్యకు ముక్తి పదము
రాం రాం రాం రాం..
ఎవని చంద్రిక మృదుల కరము! అం
దించెను శబరికి దివ్యవరము
రాం రాం రాం రాం.. 
ఎవని ఏలుబడి ఇంటికొక్క గుడి నిలిపెనో
ఎవని రాజ్యమే రామరాజ్యమై వెలసెనో
ఆ రాముడు నా అంతరంగమున నిండగా
అహము మరచి, ఈ యిహము మరచి
జన్మాంతర బంధములెల్ల విడిచి
ఆ మహర్జ్యోతిలో లీనము కానా
ఆ మహా ప్రభునిలో లీనము కానా
ఓ రామా! రఘురామా! కైవల్య రామా!

యుగంధర్--1979





















Jayamalini -Na Paruvam Nee Kosam by MarshaMellow


సంగీతం::ఇళయరాజా
రచన::సినారె 
గానం::S.జానకి 

పల్లవి::

నా పరువం నీకోసం..నా పరువం నీకోసం
పానుపువేసి ఉన్నదీ..వాకిలి తీసి ఉన్నదీ
కోరిక పండగా నిండుగా

నా పరువం నీకోసం..నా పరువం నీకోసం

చరణం::1

రాకరాక వచ్చానోయి..మీ ఇంటికి..ఈ పొదరింటికీ
లేకలేక నచ్చావోయి..నా కంటికి..నా చిగురొంటికీ
రాకరాక వచ్చానోయి..మీ ఇంటికి..ఈ పొదరింటికీ
లేకలేక నచ్చావోయి..నా కంటికి..నా చిగురొంటికీ
ఈ సమయం నా హృదయం..ఈ సమయం నా హృదయం 
నిన్ను చూసి నాగులాగ ఊగుతున్నదీ చెలరేగుతున్నదీ

నా పరువం నీకోసం..నా పరువం నీకోసం

చరణం::2

ఒక్కమాటు ఇక్కడే నువ్వుండిపోరా రుచులందుకోరా
తియ్యగా నేనిప్పించేది తీసుకోరా ఆపై చూసుకోరా
ఒక్కమాటు ఇక్కడే నువ్వుండిపోరా రుచులందుకోరా
తియ్యగా నేనిప్పించేది తీసుకోరా ఆపై చూసుకోరా
ఈ రోజూ ఇక రాదూ..ఈ రోజూ ఇక రాదూ 
ఈ కన్నెవయసు అందుకేలే కాగుతున్నది సెగ కాచుకున్నది

నా పరువం నీకోసం..నా పరువం నీకోసం
పానుపువేసి ఉన్నదీ..వాకిలి తీసి ఉన్నదీ
కోరిక పండగా నిండుగా

మహాలక్ష్మి--1980



సంగీతం::సత్యం
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::S.P.బాలు,S.సుశీల
శ్రీకుమారస్వామి ఫిలింస్ వారి
 సినిమా దర్శకత్వం::రాజాచంద్ర
తారాగణం::శోభన్ బాబు,వాణిశ్రీ,సత్యనారాయణ,ప్రభాకరరెడ్డి,రాజబాబు,సుభాషిణి,రాజసులోచన
http://desitunes.desibantu.com/mahalakshmi

పల్లవి::

ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ  ఈ గీతం..సంగీతం..ఓ చెలీ నా జీవితం
నీ నీడలోనా ప్రణయం..రసమయం..హే..హే

చరణం::1

కల కల విరిసే కలువలలో..నీ కనులే చూశానూ
తొలకరి గాలుల అలికిడిలో..నీ పిలుపే విన్నానూ
నిద్దురలోనా..మెలకువలోనా నీకై వేచానూ

ఓహో..ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ 

ఈ గీతం..సంగీతం..ఓ చెలీ నా జీవితం
నీ నీడలోనా ప్రణయం..రసమయం..హే..హే

చరణం::2

పలికించే ప్రతి లలిత శృతి..నీ వలపై మ్రోగిందీ
నడయాడే ప్రతి సుందరజతి..నీ అడుగై సాగిందీ
తరుణిమ లొలికే నీ చిరునవ్వే వరమై దొరికిందీ

ఓహో..ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ

ఈ గీతం..సంగీతం..ఓ చెలీ నా జీవితం
నీ నీడలోనా ప్రణయం..రసమయం..హే..హే

Mahaalakshmi--1980
Music::Satyam
Lyrics::D.C.Narayanareddi
Singer's::S.P.Balu,P.Suseela
Film Directed By::Raajaa Chandra
Cast::Sobhan^baabu,Vaanisree,Kaikaala Satyanaaraayana.

:::::::::

aa..aa..aa..aa..aa..aa..aa..aa..aa..aa..aa 
ee geetam..sangeetam..O chelee naa jeevitam
nee neeDalOnaa praNayam..rasamayam..hE..hE

::::1

kala kala virisE kaluvalalO..nee kanulE chooSaanoo
tolakari gaalula alikiDilO..nee pilupE vinnaanoo
nidduralOnaa..melakuvalOnaa neekai vEchaanoo

OhO..O O O O O O O O O O 
ee geetam..sangeetam..O chelee naa jeevitam
nee neeDalOnaa praNayam..rasamayam..hE..hE

::::2

palikinchE prati lalita SRti..nee valapai mrOgindee
naDayaaDE prati sundarajati..nee aDugai saagindee
taruNima lolikE nee chirunavvE varamai dorikindee

OhO..O O O O O O O O O O

ee geetam..sangeetam..O chelee naa jeevitam

nee neeDalOnaa praNayam..rasamayam..hE..hE