Tuesday, June 16, 2009

స్నేహం--1977సంగీతం::KVమహాదేవన్
రచన::Cనారాయణ రెడ్డి
గానం::SP.బాలు


నీవుంటే వేరే కనులెందుకూ
నీ కంటే వేరే బ్రతుకెందుకూ
నీ బాటలోనే అడుగులు నావి
నా పాటలోనే..మాటలు నీవి

నీవుంటే వేరే కనులెందుకూ
నీ కంటే వేరే బ్రతుకెందుకూ
నీ బాటలోనే అడుగులు నావి
నా పాటలోనే..మాటలు నీవి
నీవుంటే వేరే కనులెందుకూ....

నా ముందుగ నీవుంటే తొలిపొద్దు
నివు చెంతగలేకుంటే చీకటీ
నా ముందుగ నీవుంటే తొలిపొద్దు
నివు చెంతగలేకుంటే చీకటీ
నీ చేయి తాకితే..తీయని వెన్నెల
చేయి తాకితే..తీయని వెన్నెల
అలికిడి వింటేనే తొలకరి జల్లు

నీవుంటే వేరే కనులెందుకూ
నీ కంటే వేరే బ్రతుకెందుకూ
నీ బాటలోనే అడుగులు నావి
నా పాటలోనే..మాటలు నీవి
నీవుంటే వేరే కనులెందుకూ....

నిన్న రాతిరి ఓ..కలవచ్చిందీ
ఆ కలలో ఒక దేవత దిగివచిందీ
నిన్న రాతిరి ఓ..కలవచ్చిందీ
ఆ కలలో ఒక దేవత దిగివచిందీ
చందమా కావాలా ఇంద్రధనవు కావాలా
అమ్మ నవ్వు చూడాలా..అక్క ఎదురు రావాలా
చందమా కావాలా ఇంద్రధనవు కావాలా
అమ్మ నవ్వు చూడాలా..అక్క ఎదురు రావాలా
అంటు అడిగిందీ..దేవత అడిగిందీ...
అప్పుడు నేనేమన్నానో తెలుసా...


వేరే కనులెందుకనీ..నీకంటే..వేరే బ్రతుకెందుకనీ
లాలలలాలా లలలలలాల
లాలలలాలాలాలలలాలా..
మ్మ్ హుహు మ్మ్..హూ..లాలలలాలా

స్నేహం--1977సంగీతం::K.V.మహాదేవన్
రచన::ఆరుద్ర
గానం::S.P.బాలు
Film Directed By::Baapu
తారాగణం::రావుగోపాల్‌రావు,మాధవి,రాజెంద్రప్రసాద్,సైకుమార్. 

పల్లవి::

పోనీరా పోనీరా పోనీరా..ఆ..పోతే పోనీరా
పోయింది పొల్లు..మిగిలిందే చాలు
పోయింది పొల్లు..మిగిలిందే చాలు 
పోనీరా పోనీరా పోనీరా..ఆ..పోతే పోనీరా
పోనీరా పోనీరా పోనీరా..ఆ..పోతే పోనీరా

చరణం::1

ఎంత మబ్బుమూసినా..ఎంతగాలి వీచినా
నీలినీలి ఆకాశం..అల్లాగే ఉంటుంది 
ఎంత మబ్బుమూసినా..ఎంతగాలి వీచినా
నీలినీలి ఆకాశం..అల్లాగే ఉంటుంది
ఎంత ఏడుపోచినా..ఎంత గుండెనొచ్చినా
ఎంత ఏడుపోచినా..ఎంత గుండెనొచ్చినా
నీలోపల ఉద్దేశం..ఒకలాగే ఉండాలి 
నీలోపల ఉద్దేశం..ఒకలాగే ఉండాలి

పోనీరా పోనీరా పోనీరా..ఆ..పోతే పోనీరా
పోయింది పొల్లు..మిగిలిందే చాలు
పోయింది పొల్లు..మిగిలిందే చాలు 
పోనీరా పోనీరా పోనీరా..ఆ..పోతే పోనీరా

చరణం::2

కష్టాలే కలకాలం..కాపురముంటాయి
సౌఖ్యాలు చుట్టాలై..వస్తూ పోతుంటాయి
కష్టాలే కలకాలం..కాపురముంటాయి
సౌఖ్యాలు చుట్టాలై..వస్తూ పోతుంటాయి
వెళ్ళాలి బహుదూరం..మోయాలీ పెనుభారం 
వెళ్ళాలి బహుదూరం..మోయాలీ పెనుభారం
ఏమైనా కానీరా..మనయాత్ర మానం 
ఏమైనా కానీరా..మనయాత్ర మానం

పోనీరా పోనీరా పోనీరా..ఆ..పోతే పోనీరా
పోయింది పొల్లు..మిగిలిందే చాలు
పోయింది పొల్లు..మిగిలిందే చాలు 
పోనీరా పోనీరా పోనీరా..ఆ..పోతే పోనీరా