సంగీతం::S.P.కోదండ పాణి
రచన::ఆరుద్ర
గానం::ఘంటసాల,P.సుశీల
నీలో ఏముందో ఏమో మనసు నిన్నే వలచింది సొగసులన్నీ కోరింది
నీలో ఏముందో ఏమో మనసు నిన్నే వలచింది సొగసులన్నీ ఇమ్మంది
నీ కాటుక కన్నులలో చీకటి గుసగుసలు..ఆఅ
నీ కమ్మని నవ్వులలో వెన్నెల మిసమిసలూ..ఆఆ
నీ కాటుక కన్నులలో చీకటి గుసగుసలు
నీ కమ్మని నవ్వులలో వెన్నెల మిసమిసలూ
నీ ఎదలో పూల పొదలే పూచి మధువులు చిందాయి
నీ ఎదలో పూల పొదలే పూచి మధువులు చిందాయి
నా మమతలు పెంచాయి
నీలో ఏముందో ఏమో మనసు నిన్నే వలచింది సొగసులన్నీ ఇమ్మంది
నీ అల్లరి చూపులకే ఒళ్ళంత గిలిగింత..మ్మ్
నీ తుంటరి చేష్టలకే మదిలో పులకింత..ఉహు
నీ అల్లరి చూపులకే ఒళ్ళంత గిలిగింత
నీ తుంటరి చేష్టలకే మదిలో పులకింత
నీ వంపులలోన సొంపులలోన ఒలుకును వయ్యరం
నీ వంపులలోన సొంపులలోన ఒలుకును వయ్యరం
అది వలపుల జలపాతం
నీలో ఏముందో ఏమో మనసు నిన్నే వలచింది సొగసులన్నీ కోరింది
నీ పరువం చూడనిచో పొద్దే పోదుకదా..ఓహో
నీ పలుకులు వినకుంటే నిదురే రాదుకదా..ఆహా
నీ పరువం చూడనిచో పొద్దే పోదుకదా
నీ పలుకులు వినకుంటే నిదురే రాదుకదా
నీ సరసనలేని నిముషము కూడ ఏదో వెలితి సుమా
నీ సరసనలేని నిముషము కూడ ఏదో వెలితి సుమా
ఇక నీవే నేను సుమా..ఇక నీవే నేను సుమా
నీలో ఏముందో ఏమో మనసు నిన్నే వలచింది సొగసులన్నీ కోరింది
నీలో ఏముందో ఏమో మనసు నిన్నే వలచింది సొగసులన్నీ ఇమ్మంది