సంగీతం::M.S.విశ్వనాథ్
రచన::ఆత్రేయ
గానం::P.సుశీల
తారాగణం::కమల్ హసన్,జయప్రద, సరిత, ఫటా ఫట్ జయలక్ష్మీ, రజనీకాంత్ ( తొలి పరిచయం)
పల్లవి::
ఊగుతుంది నీ ఇంట ఉయ్యాల
ఇకమూడో నెల పాడుతావు జో జోల
ఊగుతుంది నీ ఇంట ఉయ్యాల
ఇకమూడో నెల పాడుతావు జో జోల
అందాల బొమ్మవు కాబోతావమ్మవు
అందాల బొమ్మవు కాబోతావమ్మవు
ఇక ఆరు నెలలు మొగుడి ముఖం చూడవూ నువ్వు
ఊగుతుంది..ఊగుతుంది నీ ఇంట ఉయ్యాల
ఇక మూడో నెల పాడుతావు జో జోల
చరణం::1
నే కన్నాను కలలెన్నో ఆనాడు
అవి నీ కళ్ళల్లో పండాయి ఈనాడు
నే కన్నాను కలలెన్నో ఆనాడు
అవి నీ కళ్ళల్లో పండాయి ఈనాడు
వేశాను ఒక వలపు మొలకను
అది నీ కడుపులో కాస్తుంది తొలి కాయను
ఊగుతుంది..ఊగుతుంది నీ ఇంట ఉయ్యాల
ఇక మూడో నెల పాడుతావు జో జోల
చరణం::2
అబ్బాయి పుట్టితే తండ్రి పేరు
నీలా అమ్మాయి పుట్టితే నా పేరు
అబ్బాయి పుట్టితే తండ్రి పేరు
నీలా అమ్మాయి పుట్టితే నా పేరు
ఎవరైనా తల్లికే మంచిపేరు వాళ్ళు
ఎదిగి తెచ్చుకునేదే అసలు పేరు
ఊగుతుంది..ఊగుతుంది నీ ఇంట ఉయ్యాల
ఇకమూడో నెల పాడుతావు జో జోల
చరణం::3
కొండ మీద దేవునితో తన చెల్లెలు
చేరి కొలువుంటే చూసినది అలుమేలు
అనురాగం చాలునని అనుకున్నది
తాను అల్లంత దూరాన ఆగినది
ఆ దేవి దీవనె నీకున్నది
ఆ ప్రభువు చలువ నీకు కాపున్నది
ఊగుతుంది..ఊగుతుంది నీ ఇంట ఉయ్యాల
ఇకమూడో నెల పాడుతావు జో జోల