Tuesday, June 14, 2011

డాక్టర్ ఆనంద్--1966

















సంగీతం::K.V.మహదేవన్
రచన::దేవులపల్లి కృష్ణశాస్ర్తి
గానం::P.సుశీల బృందం


నీలమోహనా..రారా
నిన్ను పిలిచె నెమలి నెరజాణ
నీలమోహనా..రారా
నిన్ను పిలిచె నెమలి నెరజాణ
నీలమోహనా..రారా

జారువలపు జడివాన కురిసెరా
జాజిలత మేను తడిసెరా
జారువలపు జడివాన కురిసెరా
జాజిలత మేను తడిసెరా
లతలాగే నా మనసు తడిసెరా
నీలమోహనా..రారా....రారా....రారా..

ఏలాగె మతిమాలి? ఏడే నీ వనమాలి?
ఏలాగె మతిమాలి? ఏడే నీ వనమాలి?
అతడేనేమో అనుకున్నానే
అంత దవుల శ్రావణ మేఘములగనీ
అతడేనేమో అనుకున్నానే
అంత దవుల శ్రావణ మేఘములగనీ
ప్రతిమబ్బు ప్రభువైతే
ప్రతికొమ్మ మురళైతే ఏలాగె
ఆ...ఏలాగె మతిమాలి
ఏడే నీ వనమాలి
నిన్ను పిలిచె నెమలి నెరజాణ
నీలమోహనా..రారా....రారా....రారా..

ఆ...సారెకు దాగెదవేమి?
నీ రూపము దాచి దాచి
ఊరించుటకా స్వామీ?
సారెకు దాగెదవేమి..?
నీ కన్నుల తోడు నీ కలికి నవ్వుల తోడు
నీకోసం ఎంత వేగిపోయానో కృష్ణా
కృషా కృష్ణా కృష్ణా..ఆ..
సారెకు దాగెదవేమి..?

అటు..అటు..ఇటు..ఇటు..
ఆ పొగడకొమ్మవైపు
ఈ మొగలి గుబురువైపు
కార్తీక రాతిరిలో కఱి మబ్బుంటుందా
నీలిమేఘమాకాశము విడిచి
నేల నడుస్తుందా
కార్తీక రాతిరిలో కఱి మబ్బుంటుందా
నీలిమేఘమాకాశము విడిచి
నేల నడుస్తుందా

నడిచే మబ్బులకు నవ్వే పెదవుందా
నవ్వే పెదవులకు మువ్వల మురళుందా
పెదవి నందితే పేద వెదుళ్ళు
కదిలి పాడుతాయా?
నడిచే మబ్బులకు నవ్వే పెదవులు
నవ్వే పెదవులకు మువ్వల వేణువులు
మువ్వల వేణువులు..మువ్వల వేణువులు

డాక్టర్ చక్రవర్తి--1964::జోంపూరి::రాగం


















చిమ్మటలోని ఈ పాట మనందరి కోసం



సంగీతం::S.రాజేశ్వరరావ్
రచన::ఆత్రేయ
గానం::ఘంటసాల

రాగం:::జోంపూరి:::

ఎవరో జ్వాలను రగిలించారు వేరెవరో దానికి బలియైనారు
వేరెవరో దానికి బలియైనారు
ఎవరో జ్వాలను రగిలించారు వేరెవరో దానికి బలియైనారు

అడుగు అడుగున అపజయముతో అలసిసొలసిన నా హృదయానికి
సుధవై...సుధవై జీవనసుధవై ఉపశాంతివ్వగా ఓర్వనివారు
ఎవరో జ్వాలను రగిలించారు వేరెవరో దానికి బలియైనారు

అనురాగానికి ప్రతిరూపాలై ఆదిదంపతులవలె మీరుంటె
అనురాగానికి ప్రతిరూపాలై ఆదిదంపతులవలె మీరుంటె
ఆనందంతో మురిసానే, ఆత్మీయులుగా తలచానే
అందుకు ఫలితం అపనిందేనా
ఎవరో జ్వాలను రగిలించారు వేరెవరో దానికి బలియైనారు

మనిషికి మనిషికి మమత కూడదా
మనసు తెలుసుకొను మనసే లేదా
ఇది తీరని శాపం,ఇది మారని లోకం
మానవుడే దానవుడై మసలే చీకటి నరకం

ఎవరో జ్వాలను రగిలించారు వేరెవరో దానికి బలియైనారు
వేరెవరో దానికి బలియైనారు
ఎవరో జ్వాలను రగిలించారు వేరెవరో దానికి బలియైనారు

మంచి మనసుకు మంచి రోజులు--1958



ఈ పాట వినాలని ఉంటే ఇక్కడ క్లిక్ చేయండి

మంచి మనసుకు మంచి రోజులు (1958)
సంగీతం::ఘంటసాల
రచన::కోసరాజు
గానం::ఘంటసాల

సాకీ::
వేళగాని వేళలో ఊరు విడిచి దూరంగా...
కారెక్కి ఒంటిగా...
గాలిమేయ వచ్చిన బూచి..నంగనాచీ...

పల్లవి::

అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి
బోల్తా కొట్టిందిలే బుల్‌బుల్ పిట్ట
అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి
బోల్తా కొట్టిందిలే బుల్‌బుల్ పిట్ట
గుట్టు నిమిషంలో తెలిసిందిలే
గుండె దిగజారి నిలుచుందిలే
గుట్టు నిమిషంలో తెలిసిందిలే
గుండె దిగజారి నిలుచుందిలే
ఆయ్..అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి
బోల్తా కొట్టిందిలే బుల్‌బుల్ పిట్ట

చరణం::1

చల్లని వెన్నెల కాస్తుంటే
చల్లగా ఇంట్లో నేనుంటే
తలుపుమూసి చెప్పకనే..ఏ..
దౌడేసిన రాకాసి..ఓ రాకాసి

అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి
బోల్తా కొట్టిందిలే బుల్‌బుల్ పిట్ట
ఆయ్..అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి
బోల్తా కొట్టిందిలే బుల్‌బుల్ పిట్ట

చరణం::2

ఏ బస్తీ కిలాడీ..
నా పేరే పల్లెటూర్ వస్తాదు రౌడీ
నీ తెలివంతాజూసి నను గెలిచావా..ఆ..లేడీ
చిక్కావు చేతిలో కేడీ షోకైన లేడీ అహ్హహ్హహా...

అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి
బోల్తా కొట్టిందిలే బుల్‌బుల్ పిట్ట
ఆయ్..అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి
బోల్తా కొట్టిందిలే బుల్‌బుల్ పిట్ట
గుట్టు నిమిషంలో తెలిసిందిలే
గుండె దిగజారి నిలుచుందిలే
ఆయ్..అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి
బోల్తా కొట్టిందిలే బుల్‌బుల్ పిట్ట