Sunday, March 08, 2009

జాకి --1985

సంగీతం::SP.బాలు
రచన::వేటూరి
గానం::S.జానకి

అలా మండి పడకే జాబిలీ..చలీ ఎండకాసే రాతిరీ
దాహమైన వెన్నెలరేయి..దాయలేను ఇంతటి హాయి
ఎలా తెలుపుకోనూ ప్రేమనీ..ఎలా పిలుచుకోనూ రమ్మనీ
అలా మండి పడకే జాబిలీ..చలీ ఎండకాసే రాతిరీ

నిన్ను చూడకున్న..నీవు చూడకున్నా
నిదురపోదు కన్ను..నిశిరాతిరీ
నీవు తోడులేక..నిలువలేని నాకూ
కొడిగట్ట నేలా కొనఊపిరీ
ఇదేనేమో బహుశా తొలినాటి ప్రేమా
ఎలా పాడుకోనూ నిట్టూర్పు జోలా
ఈ పూల బాణాలూ..ఈ గాలి గంధాలూ
సోకేను నా గుండెలో..సొదలేని సయ్యాటలో

అలా మండి పడకే జాబిలీ..చలీ ఎండకాసే రాతిరీ
దాహమైన వెన్నెలరేయి..దాయలేను ఇంతటి హాయి
ఎలా తెలుపుకోనూ ప్రేమనీ..ఎలా పిలుచుకోనూ రమ్మనీ

పూటకొక్క తాపం..పూలమీద కోపం
పులకరింతలాయే..సందె గాలికీ
చేదు తీపి ప్రాణం..చెలిమి లోని అందం
తెలుసుకుంది నేడే జన్మ జన్మకీ
సముఖాన వున్నా రాయబారమాయే
చాటు మాటు నేవో రాసలీలలాయే
ఈ ప్రేమ గండాలు..ఈ తేనె గుండాలు
గడిచేది ఎన్నాళ్ళకో..కలిసేది ఏనాటికో

అలా మండి పడకే జాబిలీ..చలీ ఎండకాసే రాతిరీ
దాహమైన వెన్నెలరేయి..దాయలేను ఇంతటి హాయి
ఎలా తెలుపుకోనూ ప్రేమనీ..ఎలా పిలుచుకోనూ రమ్మనీ