Wednesday, February 08, 2012

ఆడదాని అదృష్టం--1975


http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=4670
సంగీతం::S.హనుమంతరావ్
రచన::D.C.నారాయణరెడ్డి 
గానం::S.జానకి    
తారాగణం::చలం,రామకృష్ణ,సుమ,మమత,మిక్కిలినేని,గిరిజ,నిర్మల,జయమాలిని 

పల్లవి::

మొన్ననే వయసొచ్చిందీ..నిన్ననే నీ పిలుపొచ్చిందీ
ఈనాడే ఈనాడే..కొత్త విసురొచ్చిందీ
ఇంకేముందీ చేరుకోరా..ఏమేమి కావాలో కోరుకోరా        
ఇంకేముందీ చేరుకోరా..ఏమేమి కావాలో కోరుకోరా        
మొన్ననే వయసొచ్చిందీ..ఆహాయ్ 

చరణం::1

చెక్కిలే తమలపాకు..పెదవియే చిగురాకు
చెక్కిలే తమలపాకు..పెదవియే చిగురాకు
ఒళ్ళంత నాజూకు..ఊఊ హోయ్..ఒళ్ళంత నాజూకు
కళ్ళలో ఉందిరోయ్..కావలసిన షోకు
లేలేత అందాలు..వీలైన సరదాలు
లేలేత అందాలు..వీలైన సరదాలు
మోజైన మురిపాలు..తాజాగ అందిస్తాను 
ఆహా ఆహా ఆహా ఆహా ఆహా..ఆఆ             
ఇంకేముందీ చేరుకోరా..ఏమేమి కావాలో కోరుకోరా        
ఇంకేముందీ చేరుకోరా..ఏమేమి కావాలో కోరుకోరా        
మొన్ననే వయసొచ్చిందీ..నిన్ననే నీ పిలుపొచ్చిందీ..హోయ్

చరణం::2

చూపుతో మంటలు రగిలించీ..నవ్వుతో మల్లెలు కురిపించీ
అంతలో తొలి గిలిగింతలతో..వింతగా నిను కవ్విస్తాను
రేయైన పగలైనా ఏవేళ ఏమైనా..రేయైన పగలైనా ఏవేళ ఏమైనా
నీ వేడి ఒడిలోన నేనొదిగి..వుంటాను నేనొదిగి వుంటాను        
మొన్ననే వయసొచ్చిందీ..నిన్ననే నీ పిలుపొచ్చిందీ
ఈనాడే ఈనాడే..కొత్త విసురొచ్చిందీఈఈఇ
ఇంకేముందీ చేరుకోరా..ఏమేమి కావాలో కోరుకోరా        
ఇంకేముందీ చేరుకోరా..ఏమేమి కావాలో కోరుకోరా        

పవిత్ర బంధం--1971













సంగీతం::S.రాజేశ్వరరావ్
రచన::ఆరుద్ర
గానం::P.సుశీల
తారాగణం::అక్కినేని,వాణిశ్రీ,కాంచన, కృష్ణంరాజు, పద్మనాభం,నాగయ్య.

పల్లవి::

చిన్నారి నవ్వులే..సిరిమల్లె పువ్వులు 
అల్లారుముద్దులే..కోటి వరాలు..ఊ
చిన్నారి నవ్వులే..సిరిమల్లె పువ్వులు 
అల్లారుముద్దులే..కోటి వరాలు..ఊ

చరణం::1

చిగురించి విరబూసే..చెట్టే చెట్టు 
చిట్టిపాప నడయాడే..ఇల్లే ఇల్లు
చిగురించి విరబూసే..చెట్టే చెట్టు 
చిట్టిపాప నడయాడే..ఇల్లే ఇల్లు
ఆడినదే ఆట తను..పాడినదే పాట 
ఆడినదే ఆట తను..పాడినదే పాట
అది చూచి మైమరచే తల్లే కద తల్లీ 
చిన్నారి నవ్వులే..సిరిమల్లె పువ్వులు 
అల్లారుముద్దులే..కోటి వరాలు..ఊ

చరణం::2

బాలపాప పలుకులే..పంచదార చిలకలు 
బాలపాప పలుకులే..పంచదార చిలకలు
చందమామ కన్నా..మా చంటిబాబు మిన్న 
చందమామ కన్నా..మా చంటిబాబు మిన్న
చల్లనివి చక్కనివి..పసిపిల్లల కళ్ళు 
చల్లనివి చక్కనివి..పసిపిల్లల కళ్ళు 
ఆ కళ్ళే కమలాలు..అవి దేవుని గుళ్ళు  
చిన్నారి నవ్వులే..సిరిమల్లె పువ్వులు 
అల్లారుముద్దులే..కోటి వరాలు..ఊ

చరణం::3

ఎనలేని స్వప్నాలు..నోచెను తల్లి 
కనులారా కనగానే..మురియును తండ్రి
ఎనలేని స్వప్నాలు..నోచెను తల్లి 
కనులారా కనగానే..మురియును తండ్రి
కన్నవారి ఫలము..కనులున్న వారి ధనము 
కన్నవారి ఫలము..కనులున్న వారి ధనము 
వెలగాలి మా బాబు..వెయ్యేళ్ళ దీపం..మ్మ్
చిన్నారి నవ్వులే..సిరిమల్లె పువ్వులు
అల్లారుముద్దులే..కోటి వరాలు..ఊ
లల్లాలలాలలా ల్లల్లాలలాలల 
మ్మ్ హూ..మ్మ్ హూ