సంగీతం::రాజన్-నాగేంద్ర
రచన::వేటూరి
గానం::బాలు, P. సుశీల
తారాగణం::రంగనాథ్,ప్రభ,చంద్రమోహన్,జయసుధ,నూతన్‌ప్రసాద్,గిరిబాబు,రమాప్రభ. హిందోళ:::రాగం
::::
వీణ వేణువైన సరిగమ విన్నావా
ఓ ఓ ఓ తీగ రాగమైన మధురిమ కన్నావా
తనువు తహతహలాడాల చెలరేగాల చెలి ఊగాల ఉయ్యాలలీవేళలో
వీణ వేణువైన సరిగమ విన్నావా
ఓ ఓ ఓ తీగ రాగమైన మధురిమ కన్నావా
::::1
ఊపిరి తగిలిన వేళ నే ఒంపులు తిరిగిన వేళ
నా వీణలో నీ వేణువే పలికే రాగమాల
ఆ ఆ ఆ ఆ లలలా ఆ ఆ
చూపులు రగిలిన వేళ ఆ చుక్కలు వెలిగిన వేళ
నా తనువున అణువణువున జరిగే రాసలీల ఆ ఆ
వీణ వేణువైన సరిగమ విన్నావా
ఓ ఓ ఓ తీగ రాగమైన మధురిమ కన్నావా
::::2
ఎదలో అందం ఎదుట ఎదుటే వలచిన వనిత
నీ రాకతో నా తోటలో వెలసే వన దేవత
ఆ ఆ ఆ ఆ లలలా ఆ ఆ
కదిలే అందం కవిత అది కౌగిలికొస్తే యువత
నా పాటలో నీ పల్లవే నవత నవ్య మమత ఆ ఆ
వీణ వేణువైన సరిగమ విన్నావా
ఓ ఓ ఓ తీగ రాగమైన మధురిమ కన్నావా
తనువు తహతహలాడాల చెలరేగాల చెలి ఊగాల ఉయ్యాలలీవేళలో
వీణ వేణువైన సరిగమ విన్నావా
ఓ ఓ ఓ తీగ రాగమైన మధురిమ కన్నావా