సంగీతం::పెండ్యాల నాగేశ్వరరావ్ గారు
రచనD.C.నారాయణరెడ్డి గారు
గానం::ఘంటసాల గారు,S.జానకి గారు
తారాగణం::N.T.రామారావు,కాంతారావు,S.V.రంగారావు,జమున,జయలలిత,పద్మనాభం పల్లవి::
ప్రియా ప్రియా మధురం
ప్రియా ప్రియా మధురం
ప్రియా ప్రియా మధురం
పిల్లనగ్రోవి పిల్లవాయువు..పిల్లనగ్రోవి పిల్లవాయువు
భలే భలే మధురం..అంతకు మించీ
ప్రియుని కౌగిలీ..ఎంతో ఎంతో మధురం
ఇన్నీ ఉన్నా సరసిజలోచన..
సరసన ఉంటేనె మధురాం
మనసిచ్చిన ఆ..అలివేణి
అధరం..మరీ మరీ మధురం
ప్రియా ప్రియా మధురం
చరణం::1
ఏనాటినా పూజాఫలమో
ఏజన్మలో పొందిన వరమో
అందరుకోరే శ్యామసుందరుడే
అందరుకోరే శ్యామసుందరుడే
నాపొందు కోరుట మధురం
సత్యా కృష్ణుల సరసజీవనం
సత్యా కృష్ణుల సరసజీవనం
నిత్యం నిత్యం మధురం..
ప్రతి నిత్యం అతి మధురం
ప్రతి నిత్యం అతి మధురం
ప్రియా ప్రియా మధురం
చరణం::2
సవతులెందరున్నా..ఆ ఆ ఆ
సవతులెందరున్నా కృష్ణయ్యా
సత్యను వలచుట మధురం
భక్తికి రక్తికి లొంగని స్వామిని
కొంగున ముడుచుట మధురం
నా కడకొంగున ముడుచుట మధురం
ఈ భామామణి ఏమి పలికినా
ఈ భామామణి ఏమి పలికినా ఔననుటే మధురం
ఈ చెలిపలుకుల పర్యవసానం
ఇంకా ఇంకా..మధురం..
ప్రియా ప్రియా మధురం