Thursday, April 12, 2007

రాముడు భీముడు--1964


సంగీతం::పెండ్యాలనాగేశ్వరరావు
రచన::D.C.నారాయణ రెడ్డి
గానం::ఘంటసాల,P.సుశీల

తారాగణం::N.T.రామారావు,జమున,S.V.రంగారావు,  
రాజనాల,L.విజయలక్ష్మి,శాంతకుమారి,రేలంగి,గిరిజ,రమణారెడ్డి.

పల్లవి::

హోయ్ తళుకు తళుకు మని గల గల సాగే..ఏ..ఏ..
హోయ్ తళుకు తళుకు మని గల గల సాగే తరుణీ ఇటు రావేమే
హోయ్ చమకు చమకు మని చిన్నారి నడకల చేరుకోవేమే
హోయ్ తళుకు తళుకు మని గల గల సాగే తరుణీ

రంమ్మనకూ హోయ్ రం మ్మనకు ఇపుడే నను రా రంమ్మనకు
విరిమొగ్గలు చూచే వేళ చిరు సిగ్గులు పూచే వేళ
రంమ్మనకూ హొయ్ రంమ్మనకు


చరణం::1


చీకటి ముసిరే దెన్నడు నా చేతికి అందే దెన్నడు
హోయ్ సిగ్గులు తొలిగే దెన్నడు నీ బుగ్గలు పిలిచే దెన్నడు
హోయ్ కదిలే కన్నులు మూసుకో
హోయ్ కదిలే కన్నులు మూసుకో
మదిలో మగువను చూసుకో
హోయ్ రంమ్మనకూ ఇపుడే నను రా రంమ్మనకూ


చరణం::2


నిన్నటి కలలో మెత్తగా నా నిద్దుర దోచితి వెందుకు..ఆ..ఆ
మొన్నటి కలలో మత్తుగా కను సన్నలు చేసితి వెందుకు
అంతకు మొన్నటి రాతిరీ
అంతకు మొన్నటి రాతిరీ
గిలిగింతలు మొదలైనందుకు
రంమ్మనకూ హోయ్ ఇపుడే నను రా రంమ్మనకు
విరిమొగ్గలు చూచే వేళ చిరు సిగ్గులు పూచే వేళ
రంమనకూ హొయ్ రంమనకు