Monday, August 17, 2009

విచిత్ర వివాహం--1973

ఈ పాట వినాలని ఉంటే ఇక్కడ క్లిక్ చేయండి

సంగీతం::సత్యం
రచన::వేటూరి
గానం::భానుమతి

నాగరికత పేరుతో..నవ్వులపాలయ్యేరు
దోరవయసు జోరులో..దారితప్పిపోయేరు
నా మాటలో నిజం వింటారా మీరు?

అమ్మాయిలూ అబ్భాయిలూ నామాటలో నిజం వింటార మీరు
అమ్మాయిలూ అబ్భాయిలూ నామాటలో నిజం వింటార మీరు
అమ్మాయిలూ..అబ్బాయిలూ

దంమ్మారో దంమ్మంటు పాడేరులే..ఆడమగా కలసి ఆడేరులే
దంమ్మారో దంమ్మంటు పాడేరులే..ఆడామగా కలసి ఆడేరులే
ఇదే గానమంటు..ఇదే నాట్యమంటు..పెడదారిలో మీరు పడిపోతున్నారు

అమ్మాయిలూ అబ్భాయిలూ నామాటలో నిజం వింటార మీరు
అమ్మాయిలూ..అబ్బాయిలూ

ప్రతివారు లవ్‌పేరు చెపుతారులే..పైమోజుకే లోంగిపోతారులే
ప్రతివారు లవ్‌పేరు చెపుతారులే..పైమోజుకే లోంగిపోతారులే
ఇదే ఫ్యాషనంటు..ఇదే కల్చరంటు..పెడదారిలో మీరు పడిపోతున్నారు

అమ్మాయిలూ అబ్భాయిలూ నామాటలో నిజం వింటార మీరు
అమ్మాయిలూ..అబ్బాయిలూ

ప్రతిజంట ఈలాగె వర్ధిల్లాలీ..ప్రతి ఇల్లు ఈలాగె విలసిల్లాలీ
ప్రతిజంట ఈలాగె వర్ధిల్లాలీ..ప్రతి ఇల్లు ఈలాగె విలసిల్లాలీ
ఈ చిరునవ్వు చిందే..పసిపాపల్లు ఉండే..సంసారమేకదా..సౌభాగ్యసీమ

అమ్మాయిలూ అబ్భాయిలూ నామాటలో నిజం వింటార మీరు
అమ్మాయిలూ..అబ్బాయిలూ