Saturday, September 03, 2011

ఆలాపన--1986





















సంగీతం::ఇళయరాజ
రచన::వేటూరి
గానం::S.జానకి

పల్లవి::

తతతతరతరత్త తతరరతరతరత్త
ప్రియతమా తమా సంగీతం
విరిసె సుమములై వసంతం
అడుగుల సడే మయూరం
అడుగుకో వయ్యారం
పలికిన పదం సరాగం..జరిగెలే పరాగం
ప్రియతమా తమా సంగీతం
విరిసె సుమములై వసంతం
తతతతరతరత్త తతరరతరతరత్త

చరణం::1

రేగే రాగాలన్ని నాలో ఉయ్యాలూగెలే..హాయ్
ఆహా..మళ్ళి మళ్ళి నన్ను మత్తెక్కిస్తున్నాయిలే..హాయ్
హోయ్..రేగే రాగాలన్ని నాలో ఉయ్యాలూగెలే..హాయ్
ఆ..మళ్ళి మళ్ళి నన్ను మత్తెక్కిస్తున్నాయిలే..హాయ్

నాలోన లీలగా..నాద స్వరాలుగా
పూసింది లాలస..పున్నాగలా
రేయంత ఎండాయె నా గుండెలో..రేరాణి వెన్నెల్లలో
ఈ మోహమెందాక..పోతున్నదో
ఈ దేహమింకేమి..కానున్నదో
వలపులే పిలువగా

ప్రియతమా తమా సంగీతం
విరిసె సుమములై వసంతం
తరతరత్తర తరరరర తరతరత్తర

చరణం::2

పూలే తేనైపోయి నాలో వాగై పొంగెలే.. హోయ్
నిన్నే నిన్నే కోరి నాట్యాలనే చేసెనే..హోయ్
హోఓఓ..పూలే తేనైపోయి నాలో వాగై పొంగెలే..హోయ్
నిన్నే నిన్నే కోరి నాట్యాలనే చేసెనే..హోయ్

నా పాన్పు పంచుకో..ఈ బాధ తీర్చిపో
శివ రాతిరవ్వనీ..ఈ రాతిరి
తేనెల్లు పొంగాలి..చీకట్లలో..కమ్మన్ని కౌగిళ్ళలో
నీ తోడు కావాలి..ఈ జన్మకి
నే నీడనవుతాను..నీ దివ్వెకి
పెదవులో..మధువులా

ప్రియతమా తమా సంగీతం
విరిసె సుమములై వసంతం
తరతరత్తర తతతతర తరరరర తరతరత్తర

అడుగుల సడే మయూరం
అడుగుకో వయ్యారం
పలికిన పదం సరాగం
జరిగెలే పరాగం
ప్రియతమా తమా సంగీతం
విరిసె సుమములై వసంతం
తరతరత్తర తతతతర తరరరర తరతరత్తర

గోకులంలో సీత--1987




సంగీతం::కోటి
రచన::భువన చంద్ర 
గానం::K.S.చిత్ర

పల్లవి::

పొద్దే రాని లోకం నీది
నిద్రేలేని మైకం నీది
పొద్దే రాని లోకం నీది
నిద్రేలేని మైకం నీది
పాపం ఏలాలి పాడాలి జాబిలీ
అయినా ఏ గోల వింటుంది నీ మది
వేకువ నైనా..వెన్నెల నైనా చూడని కళ్లే తెరిచేలా
ఇలా..ఆఆ..నిను లాలించే దా లే లెమ్మని
మిత్రమా మిత్రమా మైకమే లోకమా
మెల్లగా చల్లగా మేలుకో నేస్తామా

చరణం::1

ఎన్నొ రుచులు గల బ్రతుకుందీ 
ఎన్నొ ఋతువులతో పిలిచిందీ
చేడొక్కటే నీకు తెలుసున్నది
రేయోక్కటే నువ్వు చూస్తున్నది
ఉదయాలనే వెలివేస్తానంటావా?
కలకాలము కలలోనే ఉంటావా
నిత్యమూ నిప్పునే తాగినా తీరని
నీ దాహం తీర్చే కన్నీరీది

మిత్రమా మిత్రమా మైకమే లోకమా
మిత్రమా మిత్రమా శూన్యమె స్వర్గమా

చరణం::2

నీలో చూడు మంచి మనసున్ది
ఏదో నాడు మంచు విదుతున్ధి
వాల్మీకీఓలూ ఋషి ఉదయించినా
వేమన్నలో భోగి నిదురించినా
మదిలో ఇలా రగలాలి ఓ జ్వాలా
మలినాలనె మశిచేస్తూ మండేలా
అగ్నిలో కాలినా స్వర్ణమై తేలగా
నిను తాకిందేమో ఈ వేదనా

మిత్రమా మిత్రమా మట్టి లో రత్నమా
మిత్రమా మిత్రమా మబ్బులో చంద్రమా

పల్లవి అనుపల్లవి--1983
















సంగీతం::ఇళయరాజా
రచన::రాజశ్రీ 
గానం::S.P.శైలజ

పల్లవి::

కలలలో తేలి..కలవరించేను
కలలలో తేలి..కలవరించేను 
వేదనే వేడుకై..మిగిలేను నేను 
కలలలో తేలి..కలవరించేను 
వేదనే వేడుకై..మిగిలేను నేను
కలలలో తేలి..ఈ..ఆఆఆ

చరణం::1

గతము వెతలేనేమో..చెలిమి కరిగేనేమో
తొలివలపు శ్రుతులలో అపస్వరం పలికెను 
తొలివలపు శ్రుతులలో అపస్వరం పలికెను 
పసిడి బాసలే మనసున ముగిసెను 
కలలో తేలి కలవరించేను..వేదనే వేడుకై మిగిలేను నేను
కలలో తేలి..ఆఆఆఆ..

చరణం::2

చేతకాని లోకం..రగిలె నాలో సోఖం 
ఆ చిగురిటాశలు ఆ నాటి ధ్యాసలూ 
ఆ చిగురిటాశలు ఆ నాటి ధ్యాసలూ 
చెరిగినుోయెను నీటిపెై రాతలా..ఆఆఆఆ 
కలలో తేలి కలవరించేను
కలలో తేలి కలవరించేను
వేదనే వేడుకై మిగిలేను నేను
కలలో తేలి..ఆఆఆఆఆ