Saturday, September 04, 2010

ప్రేమపక్షులు--1973::పీలు::రాగం





సంగీతం::అశ్వత్థామ
రచన::ఉషఃశ్రీ
గానం::K.J.ఏసుదాస్


రాగం:::పీలు

తెల్లారేదాకా నువ్వు తలుపు మూసి తొంగుంటే
తెల్లారేదాకా నువ్వు తలుపు మూసి తొంగుంటే
తగువెట్టా తీరేదీ తలుపు తీయవే భామా
తెల్లారేదాకా నువ్వు...

రేయంతా సల్లో ఒణికి రెప్పేయకుండా గడిపి
రేయంతా సల్లో ఒణికి రెప్పేయకుండా గడిపి
ఒళ్లంతా బరువైనాది కళ్లేమో ఎరుపైనాయి
ఒళ్లంతా బరువైనాది కళ్లేమో ఎరుపైనాయి
తెల్లారేదాకా నువ్వు తలుపు మూసి తొంగుంటే
తగువెట్టా తీరేదీ తలుపు తీయవే భామా
తెల్లారేదాకా నువ్వు...

సంగతంతా తెలిసిందంటే
సుట్టుపక్కలా నవ్వుతారు
సంగతంతా తెలిసిందంటే
సుట్టుపక్కలా నవ్వుతారు
సంకురేతిరి సల్లో కూడ బింకమేటని అంటారు
బింకమేటని అంటారు
తెల్లారేదాకా నువ్వు తలుపు మూసి తొంగుంటే
తగువెట్టా తీరేదీ తలుపు తీయవే భామా
తెల్లారేదాకా నువ్వు...

ఒద్దికగా నా ఒళ్లో ఒదిగి
ముద్దుముద్దుగా నను మురిపిస్తే
నీతోటే ఉంటాను నీ మాటే ఇంటాను
నీతోటే ఉంటాను నీ మాటే ఇంటాను
తెల్లారేదాకా నువ్వు తలుపు మూసి తొంగుంటే
తగువెట్టా తీరేదీ తలుపు తీయవే భామా
తెల్లారేదాకా నువ్వు...

అడవి సింహాలు--1983





















సంగీతం::చక్రవర్తి
రచన::వేటూరి 
గానం::S.P.బాలు, S.జానకి
Film Directed By::K.Rghavendra Rao పల్లవి::
తారాగణం::కృష్ణ,కృష్ణంరాజు,జయప్రద,శ్రీదేవి,గిరిబాబు,కైకాల.సత్యనారాయణ,
రావు గోపాలరావు ,అల్లు రామలింగయ్య,సిల్క్‌స్మిత. 

పల్లవి::

హా..అగ్గిపుల్ల భగ్గుమంటది..ఓ..ఓ..ఓ..ఓ
ఆడపిల్ల సిగ్గులంటది..ఓ..ఓ..ఓ..ఓ
హ..హ..హ..హ..అగ్గిపుల్ల చీకటింటికే
హ..హ..హ..హ..ఆడపిల్ల కౌగిలింతకే
చీకటింటిలో..కౌగిలింతలో..నీ చింత తీర్చేసుకో

అహా..అగ్గిపుల్ల భగ్గుమంటది..ఓ..ఓ..ఓ..ఓ
ఆడపిల్ల సిగ్గులంటది..ఓ..ఓ..ఓ..ఓ
హ..హ..హ..హ..అగ్గిపుల్ల అంటుకుంటదీ 
హ..హ..హ..హ..ఆడపిల్ల జంటగుంటదీ
అందమిప్పుడే అంటగట్టుకో..నీ ముద్దు తీర్చేసుకో

అహా..అగ్గిపుల్ల భగ్గుమంటది..ఓ..ఓ..ఓ..ఓ
ఆడపిల్ల సిగ్గులంటది..ఓ..ఓ..ఓ..ఓ

చరణం::1 

చూపు తాకిడి సుఖమేముందీ..చేయి అలజడి నీ ఇష్టం
నిలువు దోపిడి సగమైపోయే..చూసుకో మరి నా ఇష్టం
చూపు తాకిడి సుఖమేముందీ..చేయి అలజడి నీ ఇష్టం
నిలువు దోపిడి సగమైపోయే..చూసుకో మరి నా ఇష్టం

దొంగ చేతిలో తాళం ఉందీ..తాళం ఎప్పుడూ కప్పుకు ఉందీ
అంగుళానికో అందం ఉందీ..బేరమప్పుడే పెంచుతు ఉంది
చౌక బేరమే..సోకు లాభమే..ఘరానాదొంగకి

అగ్గిపుల్ల భగ్గుమంటది..ఓ..ఓ..ఓ..ఓ
ఆడపిల్ల సిగ్గులంటది..ఓ..ఓ..ఓ..ఓ
హ..హ..హ..అగ్గిపుల్ల చీకటింటికే
హ..హా..ఆడపిల్ల కౌగిలింతకే
చీకటింటిలో..కౌగిలింతలో..నీ చింత తీర్చేసుకో

అగ్గిపుల్ల భగ్గుమంటది..ఓ..ఓ..ఓ..ఓ
ఆడపిల్ల సిగ్గులంటది..ఓ..ఓ..ఓ..ఓ

చరణం::2

దోరసరుకులు దొరుకుతు ఉన్నా..దొంగ సరుకే నాకిష్టం
అలక ముద్దులు అడిగే కన్నా..దోచుకుంటే నా కిష్టం
దోరసరుకులు దొరుకుతు ఉన్నా..దొంగ సరుకే నాకిష్టం
అలక ముద్దులు అడిగే కన్నా..దోచుకుంటే నా కిష్టం

కంటి చూపులో గారం ఉందీ..వంటి నిండ బంగారం ఉందీ
కన్నె చూడనీ నేరం ఉందీ..కమ్ముకుంటే శృంగారం ఉందీ
సొంత లాభము కొంత మానుకో..చలానా వేళకి

అగ్గిపుల్ల భగ్గుమంటది..ఓ..ఓ..ఓ..ఓ
ఆడపిల్ల సిగ్గులంటది..ఓ..ఓ..ఓ..ఓ
హ..హ..హ..హ..అగ్గిపుల్ల చీకటింటికే
హ..హ..హ..హ..ఆడపిల్ల కౌగిలింతకే
చీకటింటిలో..కౌగిలింతలో..నీ చింత తీర్చేసుకో

అగ్గిపుల్ల భగ్గుమంటది..ఓ..ఓ..ఓ..ఓ
ఆడపిల్ల సిగ్గులంటది..ఓ..ఓ.ఓ..ఓ

అడవి సింహాలు--1983



























సంగీతం::చక్రవర్తి
రచన::వేటూరి 
గానం::S.P.బాలు, P.సుశీల
Film Directed By::K.Ragavendra Rao
తారాగణం::కృష్ణ,కృష్ణంరాజు,జయప్రద,శ్రీదేవి,గిరిబాబు,కైకాల.సత్యనారాయణ,
రావు గోపాలరావు ,అల్లు రామలింగయ్య,సిల్క్‌స్మిత. 

పల్లవి::

ఏహే హే  ఏహే  హే లాలలాలలా
ఆహా ఆహా లాలలాలలా

క్షేమమా..ప్రియతమా
సౌఖ్యమా..నా ప్రాణమా

కుసుమించే అందాలు..కుశలమా
వికసించే పరువాలు..పదిలమా

మరల మరల వచ్చిపో వసంతమా
చూసిపోవే నన్ను సుప్రభాతమా
మరల మరల వచ్చిపో వసంతమా
చూసిపోవే నన్ను సుప్రభాతమా

క్షేమమా..ప్రియతమా 
సౌఖ్యమా..నా ప్రాణమా

కుసుమించే అందాలు..కుశలమా
వికసించే పరువాలు..పదిలమా

మరల మరల వచ్చిపో వసంతమా
చూసిపోవే నన్ను సుప్రభాతమా
మరల మరల వచ్చిపో వసంతమా
చూసిపోవే నన్ను సుప్రభాతమా

క్షేమమా..ప్రియతమా  
సౌఖ్యమా..నా ప్రాణమా

చరణం::1 

నీలి కురుల వాలు జడల చాటు 
నడుము కదలిక..కుశలమా
అడగలేక అడుగుతున్న తీపి 
వలపు కానుక..పదిలమా
నీ లోని దాహాలు అవి రేపే విరహాలు 
చెలరేగే మోహాలు..క్షేమమా
నీలి కురుల వాలు జడల 
చాటు నడుము కదలిక..కుశలమా
అడగలేక అడుగుతున్న తీపి 
వలపు కానుక..పదిలమా

నీ లోని దాహాలు అవి రేపే విరహాలు 
చెలరేగే మోహాలు..క్షేమమా

చలి గాలి గిలిగింత సౌఖ్యమా
చెలి మీద వలపంతా సౌఖ్యమా
నీ క్షేమమే..నా లాభము 
నీ లాభమే..నా మోక్షము

క్షేమమా..ప్రియతమా 
సౌఖ్యమా..నా ప్రాణమా

కుసుమించే అందాలు..కుశలమా 
వికసించే పరువాలు..పదిలమా

మరల మరల వచ్చిపో వసంతమా
చూసిపోవే నన్ను సుప్రభాతమా
మరల మరల వచ్చిపో వసంతమా
చూసిపోవే నన్ను సుప్రభాతమా

చరణం::2

కాలమల్లె కరిగిపోని గాఢమైన కౌగిలి..కుశలమా
నన్ను తప్ప ఎవరినింక తాకలేని చూపులు..పదిలమా
నీ నీలి కడకొంగు ఆలోని ఎద పొంగు అవి దాచే నీ సిగ్గు క్షేమమా

కాలమల్లె కరిగిపోని గాఢమైన కౌగిలి..కుశలమా
నన్ను తప్ప ఎవరినింక తాకలేని చూపులు..పదిలమా
నీ నీలి కడకొంగు ఆలోని ఎద పొంగు అవి దాచే నీ సిగ్గు క్షేమమా

తహతహలు తాపాలు..సౌఖ్యమా
బిడియాలు బింకాలు..సౌఖ్యమా
నీ సౌఖ్యమే..నా సర్వమూ 
ఆ సర్వమూ..నా సొంతమూ

క్షేమమా..ప్రియతమా 
సౌఖ్యమా..నా ప్రాణమా
కుసుమించే అందాలు కుశలమా
వికసించే పరువాలు పదిలమా
మరల మరల వచ్చిపో వసంతమా
చూసిపోవే నన్ను సుప్రభాతమా

క్షేమమా..ప్రియతమా 
సౌఖ్యమా..నా ప్రాణమా
కుసుమించే అందాలు కుశలమా
వికసించే పరువాలు పదిలమా
మరల మరల వచ్చిపో వసంతమా
చూసిపోవే నన్ను సుప్రభాతమా