Monday, December 06, 2010

తాతా మనవడు--1973




సంగీతం::రమేష్ నాయుడు
రచన::సుంకర సత్యనారాయణ
గానం::L.R.ఈశ్వరి,S.P.బాలు
దర్శకత్వం::దాసరి నారాయణరావు
తారాగణం::S.V.రంగారావు,రాజబాబు,అంజలీదేవి, విజయనిర్మల,సత్యనారాయణ,రమాప్రభ రాజసులోచన.

పల్లవి::
'
సోమ-మంగళ-బుధ-గురు-శుక్ర-శని-ఆది
సోమ-మంగళ-బుధ-గురు-శుక్ర-శని-ఆది
వీడికి పేరేది...పుట్టే వాడికి చోటేది
వీడికి పేరేది...పుట్టే వాడికి చోటేది    
సోమ-మంగళ-బుధ-గురు-శుక్ర-శని-ఆది
వీడికి పేరేది...పుట్టే వాడికి చోటేది
వీడికి పేరేది...పుట్టే వాడికి చోటేది    
పెంచేదెట్లా...గంపెడుమంద
పెట్టలేక మనపని...గోవింద
పెట్టలేక మనపని...గోవింద
కలిగిన చాలును..వొకరూ ఇద్దరూ
కాకుంటె ఇంకొక్కరు..కాకుంటె ఇంకొక్కరూ
సోమ-మంగళ-బుధ-గురు-శుక్ర-శని-ఆది 
వీడికి పేరేది...పుట్టే వాడికి చోటేది
వీడికి పేరేది...పుట్టే వాడికి చోటేది    

చరణం::1

కాదు..కాదు..వొకరూ..ఇద్దరూ..ముగ్గురు
కనవలసిందే...ఎందరైనా
బుద్దుడో..జవహరో..గాంధీజీ..కాకూడదా ఇందెవడైనా
ఔతారౌతారౌతారు..బొచ్చెలిచ్చి బజారుకుతరిమితె
ఔతారౌతారౌతారు..బిచ్చగాళ్ళ సంఘానికి నాయకు
లౌతారౌతారౌతారు..తిండికి గుడ్డకు కరువై
కడుపు మండి..విషం తిని చస్తారూ
సోమ-మంగళ-బుధ-గురు-శుక్ర-శని-ఆది
వీడికి పేరేది..పుట్టే వాడికి చోటేది
వీడికి పేరేది..పుట్టే వాడికి చోటేది    

చరణం::2

ఎగిరే పక్షికి ఎవడాధారం..పెరిగేమొక్కకు ఎవడిచ్చును సారం
ఎగిరే పక్షికి ఎవడాధారం..పెరిగేమొక్కకు ఎవడిచ్చును సారం
దారి చూపు నందరికీ వాడే..దారి చూపు నందరికీ వాడే 
నారుపోసినవాడూ...నీరివ్వకపోడూ
ఎవరికివారే ఇట్లనుకుంటే..ఏమైపోవును మనదేశం
ఎప్పుడు తీరును దారిద్ర్యం..ఇంకెప్పుడుకల్గును సౌభాగ్యం
కనాలందుకే మితసంతానం..కావాలిది అందరికి ఆదర్శం

చరణం::3

అయ్యా..అయ్యా..ఎందుకు గొయ్య
నాకొక...పీడర మీతాతయ్య
చావగొట్టి పాతెయ్యడానికి..యీ గొయ్య
బాబూ..బాబూ..నీకెందుకురా ఆ గొయ్య 
నీ అయ్యకు చేసే యీ మర్యాద
రేపు నీకు...చెయ్యాలి కదయ్యా
తాతకు వారసుడు...మనవడేగా
ఎప్పటికైనా తాత మనవడు..ఒకటేగా..ఒకటేగా

పెద్దలనే సరిదిద్దేవాళ్ళు..ఇలాంటి వొకరిద్దరుచాలు
కనిపెంచినవాళ్ళు తరిస్తారు..దేశానికే పేరుతెస్తారు
వారే...పేరు...తెస్తారు
సోమ-మంగళ-బుధ-గురు-శుక్ర-శని-ఆది
వీడికి పేరేది...పుట్టే వాడికి చోటేది 
సోమ-మంగళ-బుధ-గురు-శుక్ర-శని-ఆది
వీడికి పేరేది...పుట్టే వాడికి చోటేది
వీడికి పేరేది...పుట్టే వాడికి చోటేది

తాతా మనవడు--1973




సంగీతం::రమేష్ నాయుడు
రచన::కొసరాజు రాఘవయ్య
గానం::L.R. ఈశ్వరి,S.P.బాలు
దర్శకత్వం::దాసరి నారాయణరావు
తారాగణం::S.V.రంగారావు,రాజబాబు,అంజలీదేవి, విజయనిర్మల,సత్యనారాయణ,రమాప్రభ రాజసులోచన.

పల్లవి::
'
నూకాలమ్మను నేనే..మీ పీకలునొక్కేత్తానే
నూకాలమ్మను నేనే..మీ పీకలునొక్కేత్తానే
చీపురుకట్టతో సింగారించి..చీపురుకట్టతో సింగారించి 
దుమ్ముదులుపుతా..దుంపతెంచుతా
దుమ్ముదులుపుతానే..మీ దుంపతెంచుతానే..ఏఏఏఏ 
నూకాలమ్మను నేనే..మీ పీకలునొక్కేత్తానే
నూకాలమ్మను నేనే..మీ పీకలునొక్కేత్తానే

చరణం::1

హేయ్ వొంటిదాన్నిగా సూత్తారా..ఒళ్ళు హూనముగా సేత్తారా
నా నుండేది మడిశారా..ఇంకా ముంగట నిలిశారా
డొక్కసించుతా..ఏయ్..డోలుకట్టుతా..నిలుసోబెట్టి తోలువొలుత్తా  
ఓయ్..డొక్కసించుతా డోలుకట్టుతా..నిలుసోబెట్టి తోలువొలుత్తా  
నూకాలమ్మను నేనే..మీ పీకలునొక్కేత్తానే
నూకాలమ్మను నేనే..మీ పీకలునొక్కేత్తానే

చరణం::2

వరసబెట్టి తింతన్నావే..వోలమ్మ తెగబలిశావె
వరసబెట్టి తింతన్నావే..వోలమ్మ తెగబలిశావె
యీ కొంపకి కోడల్ని..కలకత్తా మాంకాళిని
యీ కొంపకి కోడల్ని..కలకత్తా మాంకాళిని 
వీపు కాసుకోండి..నా దెబ్బ సూసుకోండి
మీ వీపు కాసుకోండి..నా దెబ్బ సూసుకోండి          
నూకాలమ్మను నేనే..మీ పీకలునొక్కేత్తానే
నూకాలమ్మను నేనే..మీ పీకలునొక్కేత్తానే

చరణం::3

ఎవరుచేసిన ఖర్మ వారనుభవింపక..ఎవరికైనా తప్పదమ్మా
అలనాడు శూర్పణఖ..ముక్కు చెవులు పోయి 
అడవిలో పడి...ఏడ్చినమ్మా..ఆఆ    
యీనాడు అటువంటి బ్రహ్మ రాక్షసులకు 
ఎక్కడా చోటులేదమ్మా..ఎక్కడా చోటులేదమ్మా        
ఏయ్..నూకాలమ్మను నేనే..మీ పీకలునొక్కేత్తానే
నూకాలమ్మను నేనే..మీ పీకలునొక్కేత్తానే
చీపురుకట్టతో సింగారించి..చీపురుకట్టతో సింగారించి 
దుమ్ముదులుపుతా..దుంపతెంచుతా
దుమ్ముదులుపుతానే..మీ దుంపతెంచుతానే 
నూకాలమ్మను నేనే..మీ పీకలునొక్కేత్తానే
నూకాలమ్మను నేనే..మీ పీకలునొక్కేత్తానే

తాతా మనవడు--1973




సంగీత::రమేష్ నాయుడు
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::P.సుశీల
తారాగణం::S.V. రంగారావు, రాజబాబు,అంజలీదేవి, విజయనిర్మల,సత్యనారాయణ,రమాప్రభ,రాజసులోచన .

పల్లవి::

యీనాడే బాబూ...నీ పుట్టినరోజూ
యీ..ఈ..యింటికే..యీ..ఈ..యింటికే 
కొత్త వెలుగు...వచ్చినరోజూ  
యీనాడే బాబూ..నీ పుట్టినరోజూ 

చరణం::1

చిన్నబాబు ఎదిగితె..కన్నావరి కానందం
నెలవంక పెరిగితె..నింగికే ఒక అందం
చుక్కలు వేయెందుకు..ఒక్క చంద్రుడే చాలు
చుక్కలు వేయెందుకు..ఒక్క చంద్రుడే చాలు
తనవంశం వెలిగించె..తనయుడొకడె పదివేలు 
యీనాడే బాబూ...నీ పుట్టినరోజూ
యీ..ఈ..యింటికే యీ..ఈ..యింటికే 
కొత్త వెలుగు...వచ్చినరోజూ  
యీనాడే బాబూ...నీ పుట్టినరోజూ 

చరణం::2

కన్నవారి కలలు..తెలుసుకోవాలీ
ఆ కలలు కంటనీరు..పెడితె తుడవాలీ
కన్నవారి కలలు..తెలుసుకోవాలీ
ఆ కలలు కంటనీరు..పెడితె తుడవాలీ
తనకుతాను సుఖపడితే..తప్పుగాకున్నా
తనవారిని సుఖపెడితే..ధన్యత ఓ నాన్నా   
యీనాడే బాబూ...నీ పుట్టినరోజూ 

చరణం::3

తండ్రిమాటకై కానకు..తరలిపోయె రాఘవుడూ
అందుకే ఆ మానవుడు..ఐనాడు దేవుడూ 
తల్లి చెరను విడిపించగ..తలపడె ఆ గరుడుడూ
అందుకె ఆ పక్షీంద్రుడు..అంతటి మహానీయుడూ
ఓ బాబూ నువ్వూ...ఆ బాటనడవాలి
ఓ బాబూ నువ్వూ...ఆ బాటనడవాలి
భువిలోన నీ పేరు..ధృవతారగా వెలగాలీ
ధృవతారగా...వెలగాలీ   
యీనాడే బాబూ...నీ పుట్టినరోజూ
యీ..ఈ..యింటికే యీ..ఈ..యింటికే 
కొత్త వెలుగు...వచ్చినరోజూ  
యీనాడే బాబూ...నీ పుట్టినరోజూ 

తల్లీ కొడుకులు--1973












సంగీత::G.K.వెంకటేష్
రచన::ఆరుద్ర
గానం::P.సుశీల 

Directed By::P.Chandrasekhara Reddy
తారాగణం::కృష్ణ, కృష్ణం రాజు,చంద్రమోహన్,కాంచన,రమాప్రభ,రావికొండల రావు,ముక్కామల 

పల్లవి::::: 

శ్రీగౌరి శంకరుల కృపావల్లనే
శ్రీగౌరి శంకరుల కృపావల్లనే
సిరులెన్నో మాఇంట..విలసిల్లనే..ఏఏ
శ్రీగౌరి శంకరుల కృపావల్లనే

చరణం::1

అలికిన వాకిట..అమరినా ముగ్గులూ..ఊఉ
అలికిన వాకిట..అమరిన ముగ్గులూ
ఆనంద శోభాల..అలరారు నిక్కులు
గోమాత కరుణించి..కురిపించు పాలు
గోమాత కరుణించి..కురిపించు పాలు
ఇంటిల్లిపాదికి..గోమూమురిపాలూ

శ్రీగౌరి శంకరుల కృపావల్లనే
సిరులెన్నో మాఇంట..విలసిల్లనే..ఏఏ
శ్రీగౌరి శంకరుల కృపావల్లనే

చరణం::2

చదువు సంధ్యలు ఇంట సందడి చేయా..ఆఆ 
చదువు సంధ్యలు ఇంట సందడి చేయా..
సహపంతి విందుల్లో..సౌఖ్యాలు పెరుగా
ఆలూమగల కనుల..అనురాగము లొలకా
హాయిగ సాగెను..సంసార నౌకా..ఆ

శ్రీగౌరి శంకరుల కృపావల్లనే
సిరులెన్నో మాఇంట..విలసిల్లనే..ఏఏ
శ్రీగౌరి శంకరుల కృపావల్లనే 


tallikoDukulu--1973
sangeetam::`G.K.`venkaTEsh
rachana::Arudra
gaanam::suSeela 

:::::::::: ::::::::::::::::::::::

Sreegouri Sankarula kRpaavallanE
Sreegouri Sankarula kRpaavallanE
sirulennO maainTa..vilasillanE..EE
Sreegouri Sankarula kRpaavallanE

:::::::1

alikina vaakiTa..amarinaa mugguluu..uuu
alikina vaakiTa..amarina mugguluu
Ananda SObhaala..alaraaru nikkulu
gOmaata karuNinchi..kuripinchu paalu
gOmaata karuNinchi..kuripinchu paalu
inTillipaadiki..gOmoomuripaaluu

Sreegouri Sankarula kRpaavallanE
sirulennO maainTa..vilasillanE..EE
Sreegouri Sankarula kRpaavallanE

:::::::2

chaduvu sandhyalu inTa sandaDi chEyaa..aaaaa 
chaduvu sandhyalu inTa sandaDi chEyaa..
sahapanti vindullO..soukhyaalu perugaa
aaluumagala kanula..anuraagamu lolakaa
haayiga saagenu..samsaara noukaa..aa

Sreegouri Sankarula kRpaavallanE
sirulennO maainTa..vilasillanE..EE
Sreegouri Sankarula kRpaavallanE 

తల్లీ కొడుకులు--1973





















సంగీత::G.K.వెంకటేష్
రచన::ఆత్రేయ
గానం::P.సుశీల
తారాగణం::కృష్ణ, కృష్ణం రాజు,చంద్రమోహన్,కాంచన,రమాప్రభ,రావికొండల రావు,ముక్కామల 

పల్లవి::

నిన్ను మెచ్చాను...నీలో నిజాన్ని మెచ్చానూ
నిన్ను మెచ్చాను...నీలో నిజాన్ని మెచ్చానూ
నన్నిచ్చుకున్నానూ..నీలో సగాన్ని పుచ్చుకున్నానూ 
నన్నిచ్చుకున్నానూ..నీలో సగాన్ని పుచ్చుకున్నానూ
నిన్ను మెచ్చాను...నీలోనిజాన్ని మెచ్చానూ

చరణం::1

చెలిమిగల కళ్ళకన్నా..యిల్లు వేరేమున్నదీ
మమతగల మనసును..మించి కోవెలేమున్నదీ
చెలిమిగల కళ్ళకన్నా..యిల్లు వేరేమున్నదీ
మమతగల మనసును..మించి కోవెలేమున్నదీ
మగసిరిని మించిన...సిరిసంపద
మగసిరిని మించిన..సిరిసంపద మగవారికేముందీ
కన్నెపిల్లకు అంతకన్నా...కానుకేముందీ      
నిన్ను మెచ్చాను..నీలో నిజాన్ని మెచ్చానూ
నన్నిచ్చుకున్నానూ..నీలో సగాన్ని పుచ్చుకున్నానూ 
నిన్ను మెచ్చాను..నీలోనిజాన్ని మెచ్చానూ

చరణం::2

కలిమిగల చిన్నదేమో..వలచి తానొచ్చిందీ
నిలువునా తనకున్నదంతా..దోచుకోమన్నదీ
కలిమిగల చిన్నదేమో..వలచి తానొచ్చిందీ
నిలువునా తనకున్నదంతా..దోచుకోమన్నదీ
నీ వెచ్చ వెచ్చని...కౌగిలింతలో
నీ వెచ్చ వెచ్చని..కౌగిలింతలో దాచుకోమందీ
పడుచువానికి..యింతకన్నా కట్నమేముందీ 
నిన్ను మెచ్చాను..నీలో నిజాన్ని మెచ్చానూ
నన్నిచ్చుకున్నానూ..నీలో సగాన్ని పుచ్చుకున్నానూ 
నిన్ను మెచ్చాను..నీలో నిజాన్ని మెచ్చానూ

తల్లీ కొడుకులు--1973



సంగీత::G.K.వెంకటేష్
రచన::దాశరథి
గానం::S.P.బాలు
తారాగణం::కృష్ణ, కృష్ణం రాజు,చంద్రమోహన్,కాంచన,రమాప్రభ,రావికొండల రావు,ముక్కామల 

పల్లవి::

కలలెన్నో కన్నావమ్మా..కన్నీరే మిగిలిందమ్మా
విధిరాసిన రాతలకూ..తిరుగెన్నడు లేదమ్మా 
తిరుగెన్నడు లేదమ్మా..అమ్మా..అమ్మా  

చరణం::1

నెత్తురు చెమటగ పిండావమ్మా..నీ పాపలను బెంచావమ్మా
పెద్దకొడుకుపై నీ ఆశంతా..పేక మేడలా కూలిందమ్మా
పేక మేడలా కూలిందమ్మా
కలలెన్నో కన్నావమ్మా..కన్నీరే మిగిలిందమ్మా
విధిరాసిన రాతలకూ..తిరుగెన్నడు లేదమ్మా
తిరుగెన్నడు లేదమ్మా..అమ్మా..అమ్మా 

చరణం::2

యెల్ల సుఖాలు నీ కందించి..తల్లి తమ్ముడు వెళ్ళిపాయారూ
నిన్ను వలచిన నీ యిల్లాలే..నిందలు నీపై మోపిందీ
నిందలు నీపై...మోపిందీ        
కలలెన్నో కన్నావయ్యా..కన్నీరే మిగిలిందయ్యా
విధిరాసిన రాతలకూ...తిరుగెన్నడు లేదయ్యా 

చరణం::2

అన్నా చెల్లెల అనురాగం..అయినవారికే అనుమానం
చీడపురుగులూ చేసిన పనికీ..గూడే చెదిరిపోయిందమ్మా
గూడే...చెదిరిపోయిందమ్మా      
కలలెన్నో కన్నావమ్మా..కన్నీరే మిగిలిందమ్మా
విధిరాసిన రాతలకూ..తిరుగెన్నడు లేదమ్మా
తిరుగెన్నడు లేదమ్మా..అమ్మా..అమ్మా

తల్లీ కొడుకులు--1973



సంగీత::G.K.వెంకటేష్
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::S.P.బాలు,P.సుశీల
తారాగణం::కృష్ణ, కృష్ణం రాజు,చంద్రమోహన్,కాంచన,రమాప్రభ,రావికొండల రావు,ముక్కామల 

పల్లవి::

హా హా హా....
ఇప్పుడేమంటావూ..ఎలా వుందంటావూ
ఇప్పుడే మంటావూ..ఎలా వుందంటావూ
కత్తిలాంటమ్మాయీ..ఈ..మెత్తబడిపోయావూ
ఇప్పుడే మంటావూ..ఊఊఊఊ      

చరణం::1

పచ్చగా..ఆ ఆ ఆ ఆ  
పచ్చగా మెరిసె పరువం పదే పదే చూశానూ
పచ్చగా మెరిసె పరువం..పదే పదే చూశానూ
కైపురేపే నీ అందం..కైపురేపే నీ అందం
కళ్ళతో...తాగేశానూ
నా చేతి చలవతో..నీ ప్రాణం నిలిచిందీ
నా చేతి చలవతో..నీ ప్రాణం నిలిచిందీ
నీ లేత నవ్వుతో..నా ప్రాణం పోతుందీ
ఇప్పుడే మంటావూ..ఎలా వుందంటావూ
ఇప్పుడేమంటాను..చిక్కుపడి పోయాను
పువ్వులా విరబూసీ..మొగ్గనై పోయానూ 
ఇప్పుడేమంటాను..ఊఊఊఊ

చరణం::2

వెచ్చగా..ఆ ఆ ఆ ఆ  
వెచ్చగా నువు..నిమురుతువుంటే
వేయి వీణలు...మ్రోగెనూ
వెచ్చగా నువు..నిమురుతువుంటే
వేయి వీణలు...మ్రోగెనూ
కొంటెగా నువు చూస్తుంటే..కొంటెగా నువు చూస్తుంటే
కోటి ఊహలు...మూగేనూ
ఈ పులకరింత ఈ పులకరింత..ఏనాడూ ఎరుగను
యీ మొదటివింత..ఏ..జన్మకూ మరువను
ఇప్పుడేమంటావూ..ఎలా వుందంటావూ
ఇప్పుడేమంటాను..చిక్కుపడి పోయాను
కత్తిలాంటమ్మాయీ..ఈ..మెత్తబడిపోయావూ
ఇప్పుడే మంటానూ..ఊఊఊఊ

తల్లీ కొడుకులు--1973



సంగీత::G.K.వెంకటేష్
రచన::దాశరథి
గానం::S.P.బాలు
తారాగణం::కృష్ణ, కృష్ణం రాజు,చంద్రమోహన్,కాంచన,రమాప్రభ,రావికొండల రావు,ముక్కామల 

పల్లవి::

చిలకలాటి చినదానికి..అలక అందమూ
ఆ అలక తీరిపోగానే...అదే బంధమూ
జోలపాట పాడనా...ఓ పసిదానా
వుయ్యాల వూపనా..ఓ చినదానా నా చినదానా
జోలపాట పాడనా...ఓ పసిదానా
వుయ్యాల వూపనా..ఓ చినదానా నా చినదానా

చరణం::1

కోరి యెత్తుకుని...గుండెకు హత్తుకుని
కోరి యెత్తుకుని...గుండెకు హత్తుకుని
అలకతీరి పోయేలా..అలకతీరి పోయేలా ఆడించనా 
నిన్ను లాలించనా..ఓ పసిదానా నా చినదానా      
జోలపాట పాడనా...ఓ పసిదానా
వుయ్యాల వూపనా..ఓ చినదానా నా చినదానా

చరణం::2

పుట్టిన యీరోజు..పంతాలు మానుకుని 
నీలోని అనురాగం...పెంచుకో
పుట్టిన యీరోజు..పంతాలు మానుకుని 
నీలోని అనురాగం...పెంచుకో
చల్లనైన యీ రేయీ..చల్లనైన యీ రేయీ 
పోనీయకే వృధాకానీయకే..ఓ పసిదానా నా చినదానా        
జోలపాట పాడనా...ఓ పసిదానా
వుయ్యాల వూపనా..ఓ చినదానా నా చినదానా

చరణం::3

చేసిన నేరానికి..చెంపలు వేసుకుని
చేసిన నేరానికి..చెంపలు వేసుకుని
వెచ్చని కౌగిలిలో..వెచ్చని కౌగిలిలో వచ్చివాలిపోనా
నీ వలపు దోచుకోనా..ఓ చినదానా ఓ పిల్లదానా  
జోలపాట పాడనా...ఓ పసిదానా 
వుయ్యాల వూపనా..ఓ చినదానా నా చినదానా
ఓ చినదానా....నా చినదానా