సంగీతం::O.P.నయ్యర్
రచన::రాజశ్రీ
గానం::S.P.బాలు,S.జానకి
తారాగణం::శరణ్య,విశ్వాస్.
పల్లవి::
ప్రేమ వెలసిందీ ప్రేమ వెలసింది
మనసులోనే మౌన దేవతలా
ప్రేమ కురిసింది కనుల ముందే నిండు దీవెనలా
ప్రేమ వెలసింది మనసులోనే మౌన దేవతలా
ప్రేమ కురిసింది కనుల ముందే నిండు దీవెనలా
ప్రేమ వెలసిందీ
చరణం::1
ప్రేమ లేకుంటే ఉదయమైనా చీకటేనంటా
ప్రేమ లేకుంటే ఉదయమైనా చీకటేనంటా
ప్రేమ తోడుంటే మరణమైనా జననమేనంటా
ప్రేమ తోడుంటే మరణమైనా జననమేనంటా
ప్రేమ వెలసిందీ..
ప్రేమ వెలసింది మనసులోనే మౌన దేవతలా
ప్రేమ కురిసింది కనుల ముందే నిండు దీవెనలా
ప్రేమ వెలసిందీ
చరణం::2
కడలి ఎదపైనా పడవలాగా కదిలె ఆ ప్రేమా
కడలి ఎదపైనా పడవలాగా కదిలె ఆ ప్రేమా
నేల ఒడి దాటి నింగి మీటి నిలిచె ఆ ప్రేమా