Tuesday, May 06, 2014

నీరాజనం--198




సంగీతం::O.P. నయ్యర్
రచన::రాజశ్రీ
గానం::S.జానకి
తారాగణం::శరణ్య,విశ్వాస్.

 పల్లవి::

ఘల్లు ఘల్లునా..గుండె ఝల్లునా 
పిల్ల ఈడు..తుళ్ళి పడ్డదీ 
మనసు తీరగా..మాటలాడకా 
మౌనం..ఎందుకన్నదీ 

ఘల్లు ఘల్లునా గుండె ఝల్లనా 
పిల్ల ఈడు తుళ్ళి పడ్డదీ
మనసు తీరగా మాటలాడకా 
మౌనం ఎందుకన్నదీ 

చరణం::1 

క్షణమాగక తనువూగెను ఈ సంధ్యా సమీరాలలో 
అనురాగమే తల ఊపెను నీలాకాశ తీరాలలో 

క్షణమాగక తనువూగెను ఈ సంధ్యా సమీరాలలో 
అనురాగమే తల ఊపెను నీలాకాశ తీరాలలో 

ఘల్లు ఘల్లునా గుండె ఝల్లనా 
పిల్ల ఈడు తుళ్ళి పడ్డదీ...హో 
మనసు తీరగా మాటలాడకా 
మౌనం ఎందుకన్నదీ

ఘల్లు ఘల్లునా గుండె ఝల్లనా 
పిల్ల ఈడు తుళ్ళి పడ్డదీ...హో 
మనసు తీరగా మాటలాడకా 
మౌనం ఎందుకన్నదీ

చరణం::2 

కలగీతమై పులకించెను నవకళ్యాణ నాదస్వరం 
కథ కానిదీ తుది లేనిది మన హృదయాల నీరాజనం 

కలగీతమై పులకించెను నవకళ్యాణ నాదస్వరం 
కథ కానిదీ తుది లేనిది మన హృదయాల నీరాజనం 

ఘల్లు ఘల్లునా గుండె ఝల్లనా 
పిల్ల ఈడు తుళ్ళి పడ్డదీ 
మనసు తీరగా మాటలాడకా 
మౌనం ఎందుకన్నదీ 

ఘల్లు ఘల్లునా గుండె ఝల్లనా 
పిల్ల ఈడు తుళ్ళి పడ్డదీ 
మనసు తీరగా మాటలాడకా 
మౌనం ఎందుకన్నదీ

ఈ కాలపు పిల్లలు--1976


సంగీతం::సత్యం 
రచన::దాశరథి  
గానం::P.సుశీల,రమోల 
తారాగణం::రామకృష్ణ,ప్రభ,శ్రీదేవి కపూర్,కంతారావు,ప్రభాకర్‌రెడ్డి,జ్యోతిలక్ష్మీ,జయమాలిని,జి.వరలక్ష్మీ,సారథి.

పల్లవి::

యేమన్నాడే..అతడు ఔనన్నాడా 
యేం చేశాడే..అక్కా చక్కనిచుక్కా..ఛీ పోవే

చరణం::1

పక్కనచేరి చెక్కిలి మీటి చక్కలిగింతలు చేశాడా..ఏయ్‌
ఊసులు చెప్పీ బాసలు చేసీ ఆశలు ఎన్నో రేపాడా..ఊరుకోవే
సిగ్గెందుకే బిగువెందుకే నీ బుగ్గలు చెబుతున్నాయిలే
ఏయ్‌ తంతాను...జాగ్రత్త
ఏయ్‌ ఏయ్‌..తడిచి పోతావే..ఛీ పో  
పక్కనచేరి చెక్కిలి మీటి చక్కలిగింతలు చేశాడా..ఏయ్‌
ఊసులు చెప్పీ బాసలు చేసీ ఆశలు ఎన్నో రేపాడా 
యేమన్నాడే..అతడు ఔనన్నాడా 
యేం చేశాడే..అక్కా చక్కనిచుక్కా..ఛీ పోవే

చరణం::2

జల జల కురిసే జడివానలో తడవాలని నీకు లేదా..ఊహు
అల్లరిచేసే చల్లగాలిలో ఆడాలని నీకు లేదా
ఈ వయసులో ఈ వేళలో 
నీ కోరిక దాచేవు ఎందుకే..అబ్బబ్బ ఊరుకోవే    
పక్కనచేరి చెక్కిలి మీటి చక్కలిగింతలు చేశాడా..ఏయ్‌
ఊసులు చెప్పీ బాసలు చేసీ ఆశలు ఎన్నో రేపాడా
యేమన్నాడే..అతడు ఔనన్నాడా 
యేం చేశాడే..అక్కా చక్కనిచుక్కా..ఛీ పోవే

చెల్లెలి కాపురం--1971


సంగీతం::K.V.మహాదేవన్ 
రచన::దేవులపల్లి కృష్ణశాస్ర్తి 
గానం::S.జానకి,P.B.శ్రీనివాస్ 

పల్లవి::

ఈ దారి నా స్వామి నడిచేనే
పాదాల...జాడలివిగోనే
రానే వచ్చాడు..తీరా తానే వచ్చాడూ..కృష్ణుడు 
రానే వచ్చాడు..తీరా తానే వచ్చాడూ   
లేవండీ పొదరింటా..లేవండీ 
పొదరింటా..లెండే పొగడా గోరింటా
రానే వచ్చాడు..తీరా తానే వచ్చాడూ   
ఎవరే..ఎవరే..ఎవరే  
మువ్వల మురళిని నవ్వే పెదవుల ముద్దాడే వాడే నన్నేలువాడు
కన్నుల చల్లని వెన్నెల జల్లుల విరజిమ్మే వాడే నన్నేలువాడు
ఓహొ..ఓహొ..ఓహొ
ఈ నల్లని రూపం చూచీ..ఈ పిల్ల సోయగము వలచీ 
ఈ నల్లని రూపం చూచీ..ఈ పిల్ల సోయగము వలచీ
రేపల్లె విడిచి రేయల్ల నడచి మన పల్లెకు దయచేసాడటే
లేవండీ పొదరింటా..లెండే పొగడా గోరింటా
రానే వచ్చాడు..తీరా తానే వచ్చాడూ..కృష్ణుడు 
రానే వచ్చాడు..తీరా తానే వచ్చాడూ  

అటు అడుగిడితే నా తోడూ..ఇటు చూడూ
అటు అడుగిడితే నా తోడూ..ఇటు చూడూ
ఇట నిలిచినాడు నీ కోసం లీలా ప్రియుడూ..ఇటు చూడూ
వలచి వలచి వచ్చినదెవరో..పిలిచి పిలిచి అలసిన ఈ పిల్లగ్రోవినడుగు 
వలచి వలచి వచ్చినదెవరో..పిలిచి పిలిచి అలసిన ఈ పిల్లగ్రోవినడుగు 
పిల్లగ్రోవి నడుగూ..ఇటు చూడూ

కృష్ణా..ఏల స్వామీ దయమాలీ..ఈ దీనురాలిని ఎగతాలీ 
ఏల స్వామీ దయమాలీ..నీ కళ్ళ ఎదుటా నిలువలేనీ..పాదధూళిని పొందలేనీ 
నీడకైనా నోచుకోనీ..రేయి కనులా నల్లనైన దీనురాలిని ఎగతాలీ

కనులకు తోచేది కాదు సోయగమూ..మనసులో పూచేటీ మధురిమగానీ
నీ చెలులు చూసేదీ నీ బాహ్యమూర్తీ..నేను వలచేదీ నా నీలలో దీప్తి

మాయదారి మల్లిగాడు--1973




సంగీతం::K.V.మహాదేవన్
రచన::ఆచార్య-ఆత్రేయ
గానం::V.రామకృష్ణ
Film Directed By::Adoori SubbaRao
తారాగణం::కృష్ణ,మంజుళ,జయంతి,పద్మనాభం,నాగభుషణం,అంజలిదేవి,ప్రసన్నరాణి.  

పల్లవి::

మాను మరలా చిగురిస్తుందీ..ఈఈఈఈ 
చేను మళ్ళీ..మొలకేస్తుందీ..ఈఈఈఈ 
మనిషికి మాత్రం..వసంతమన్నది 
లేదని తొలి..రాసిందెవరు ?
అది చేదని వెలివేసిందెవరు చెలీ..ఓఓఓ..చెలీ 

చరణం::1

సొగసు వంతులేసుకొని..మనసును కసిగా తరిమినవి
తోడులేని నీదోర మనసులో..వేడి ఊర్పులే ఎగసినవి
చన్నీళ్ళకు ఆరేదా..ఆ..నీలో తాపం..మ్మ్ మ్మ్ మ్మ్
ఎన్నాళ్ళమ్మా ఎన్నేల్లమ్మ నీకీ..శాపం..మ్మ్ మ్మ్ మ్మ్

మనిషికి మాత్రం..వసంతమన్నది 
లేదని తొలి..రాసిందెవరు ?
అది చేదని వెలివేసిందెవరు చెలీ..ఓఓఓ..చెలీ 

చరణం::2

అద్దంలో నీ నీడే నిన్ను హేళన చేసిందీ..ఈఈఈ 
పురుషుడు కట్టిన తాళి అతనితో..తీసేయ్యాలీ..ఈఈఈ
అతనికి ముందే పెట్టిన పూలు..ఎందుకు మానాలి ఎందుకు మానాలి

మనిషికి మాత్రం..వసంతమన్నది 
లేదని తొలి..రాసిందెవరు ?
అది చేదని వెలివేసిందెవరు చెలీ..ఓఓఓ..చెలీ 

చరణం::3

దిన దినాలుగా తీరని కోర్కెలు..నరనరాలను నులిమినవి
క్షణ క్షణానికి జారిపోవు..ఈ కాలం నిను గని నవ్వినది
ఎందుకు ఎందుకు ఎవరికొరకు..నీ ఎడారి యవ్వనము 
ఎదురు తిరిగి అనుభవించు..నవ జీవనము

మాను మరలా చిగురిస్తుందీ..ఈఈఈఈ 
చేను మళ్ళీ..మొలకేస్తుందీ..ఈఈఈఈ 
మనిషికి మాత్రం..వసంతమన్నది 
లేదని తొలి..రాసిందెవరు ?
అది చేదని వెలివేసిందెవరు చెలీ..ఓఓఓ..చెలీ 

Maayadaari Malligaadu--1973
Music::K.V.Mahadevan
Lyrics::Acharya-Atreya
Singer's::V.Ramakrishna
Film Directed By::Adoorti SubbaaRao
Cast::Krishna,Manjula,Jayanti,Padmanabham,Naagabhushanam,Anjalidevi,PrasannaRani.

::::::::::::::::::::

maanu maralaa chiguristundii..iiiiiiii 
chEnu maLLii..molakEstundii..iiiiiiii 
manishiki maatram..vasantamannadi 
lEdani toli..raasindevaru ?
adi chEdani velivEsindevaru chelii..OOO..chelii 

::::1

sogasu vantulEsukoni..manasunu kasigaa tariminavi
tODulEni needOra manasulO..vEDi UrpulE egasinavi
channeeLLaku ArEdaa..aa..neelO taapam..mm mm mm
ennaaLLammaa ennEllamma neekee..Saapam..mm mm mm

manishiki maatram..vasantamannadi 
lEdani toli..raasindevaru ?
adi chEdani velivEsindevaru chelii..OOO..chelii 

::::2

addamlO nee neeDE ninnu hELana chEsindii..iiiiii 
purushuDu kaTTina taaLi atanitO..teesEyyaalii..iiiiii
ataniki mundE peTTina poolu..enduku maanaali enduku maanaali

manishiki maatram..vasantamannadi 
lEdani toli..raasindevaru ?
adi chEdani velivEsindevaru chelii..OOO..chelii 

::::3

dina dinaalugaa teerani kOrkelu..naranaraalanu nuliminavi
kshaNa kshaNaaniki jaaripOvu..ii kaalam ninu gani navvinadi
enduku enduku evarikoraku..nee eDaari yavvanamu 
eduru tirigi anubhavinchu..nava jeevanamu

maanu maralaa chiguristundii..iiiiiiii 
chEnu maLLii..molakEstundii..iiiiiiii 
manishiki maatram..vasantamannadi 
lEdani toli..raasindevaru ?
adi chEdani velivEsindevaru chelii..OOO..chelii 

అందాల రాశి--1980


సంగీతం::రమేష్‌నాయుడు
రచన::D.C.నారాయణరెడ్డి  
గానం::S.P.బాలు , P.సుశీల
తారాగణం::రాజ్‌కుమార్,రతి అగ్నిహోత్రి    

పల్లవి::

కోయిల పిలుపే..కోనకు మెరుపు
మాయని వలపే..మనసుకు మెరుపు..ఊ
కోయిల పిలుపే..కోనకు మెరుపు
మాయని వలపే..మనసుకు మెరుపు

చరణం::1

ఆఆ..అహహా..ఆ..ఆ..అహహా..ఆ
ఆఆ..అహహా..ఆ..ఆ..అహహా..ఆ

నీలి నింగికెంత ఆశ నేలపైన వాలాలనీ
గాలి అలలకెంత ఆశ పూలపైన తేలాలనీ
నీలి నింగికెంత ఆశ నేలపైన వాలాలనీ
గాలి అలలకెంత ఆశ పూలపైన తేలాలనీ
పెదవులకెంత ఆశ..ఎంత ఆశ..ఎంత ఆశా
పెదవులకెంత ఆశ..ఎంత ఆశ..ఎంత ఆశా
పదే పదే పదే పదే..ఒదిగి ఉండాలని

కోయిల పిలుపే..కోనకు మెరుపు
మాయని వలపే..మనసుకు మెరుపు
కోయిల పిలుపే..కోనకు మెరుపు
మాయని వలపే..మనసుకు మెరుపు

చరణం::2

కడలి పొంగు కోరుతుంది కన్నె వాగు కావాలనీ
వయసు జల్లు కోరుతుంది వలపు పంట పండాలనీ
కడలి పొంగు కోరుతుంది కన్నె వాగు కావాలనీ
వయసు జల్లు కోరుతుంది వలపు పంట పండాలనీ
హృదయం కోరుతుంది..కోరుతుంది..కోరుతుంది
హృదయం కోరుతుంది..కోరుతుంది..కోరుతుంది 
ఇలా ఇలా ఇలా ఇలా కలిసి ఉండాలనీ
కోయిల పిలుపే కోనకు మెరుపు
మాయని వలపే మనసుకు మెరుపు
కోయిల పిలుపే కోనకు మెరుపు
మాయని వలపే మనసుకు మెరుపు