సంగీతం::సత్యం
రచన::ఆరుద్ర
గానం::P.సుశీల,బృందం
తారాగణం::కృష్ణ,సత్యనారాయణ,రాజబాబు,చంద్రమోహన్,మంజుల,లత,హలం,అంజలీదేవి,గిరిబాబు
పల్లవి::
చినదాని చెవులను..చూడు
తెలరాళ్ళ కమ్మల..జోడు
పిలిచింది దాని..ధగధగ
ఎందుకో...ఎందుకో
చినదాని చెవులను..చూడు
తెలరాళ్ళ కమ్మల..జోడు
మేరిసింది దాని..ధగధగ
ఎందుకో...ఎందుకో
చరణం::1
కట్టింది చెంగావి..చీరా
తోడిగింది సరిగంచు..రైకా
కట్టింది చెంగావి..చీరా
తోడిగింది సరిగంచు..రైకా
దాని బిగువుల..పిటపిటలన్నీ
దాని నగవుల..చిటపటలన్నీ
దాని బిగువుల..పిటపిటలన్నీ
దాని నగవుల..చిటపటలన్నీ
అలరించే మొనగాడు..ఎవడో
చినదాని చెవులను.చూడు
తెలరాళ్ళ కమ్మల..జోడు
పిలిచింది దాని..ధగధగ
ఎందుకో...ఎందుకో
చరణం::2
మెరిసింది వగలాడి..రూపూ
ఇంకా పడలేదు మగవాడి..చూపూ
మెరిసింది వగలాడి..రూపూ
ఇంకా పడలేదు మగవాడి..చూపూ
దాని కులుకుల..ఘుమ ఘుమలన్నీ
దాని తలపుల..తహతహలన్నీ
దాని కులుకుల..ఘుమ ఘుమలన్నీ
దాని తలపుల..తహతహలన్నీ
విరబూసి పండేది...ఎప్పుడో
చినదాని చెవులను.చూడు
తెలరాళ్ళ కమ్మల జోడు
పిలిచింది దాని..ధగధగ
ఎందుకో..ఎందుకో..ఎందుకో
సంగీతం::K.V.మహాదేవన్
రచన::దేవులపల్లికృష్ణశాస్త్రి
గానం::S.P.బాలు,P.సుశీల
తారాగణం::చలం,జయంతి,సత్యనారాయణ,భారతి,శుభ,K.విజయ,చలపతిరావు
పల్లవి::
శ్రీశైల భవనా మేలుకో..శ్రితచిత్త సదనా మేలుకో
తూరుపున..బంగారు రేకలు దోచే
చేరువున..పొందామరలు విరబూచే
సుప్రభాతము..శుభకరమూ సుప్రభాతము
శుభకరమూ..సుప్రభాతము శుభకరమూ
చరణం::1
చిట్టిపొట్టి పిచికలు..లేచారా
చిన్ని పూలమొలకలు..చూచారా
చిట్టిపొట్టి పిచికలు..లేచారా
చిన్ని పూలమొలకలు..చూచారా
గోడపై కోడిపుంజు..కొక్కొరొకో అంది
గూటిలో కాకిపిల్ల..కాకా అంది
సుప్రభాతము..శుభకరమూ..మ్మ్ మ్మ్ మ్మ్
సుప్రభాతము..శుభకరమూ
చరణం::2
మడుగులో..కప్ప లెవరు
బెక..బెక..బెక..బెక
చెరువులో..చేప లెవరు
టోయ్..టోయ్..టోయ్..టోయ్
మడుగులో..కప్పలైతే
చెరువులో..చేపలైతే
విప్పకాయ..పిల్లలకు
ఉడుకుడుకు..నీళ్ళు
చెప్పినట్టు వింటే..చిట్డుకు నీళ్ళు
సుప్రభాతము..శుభకరమూ
సుప్రభాతము..శుభకరమూ
చరణం::3
పాహిమాం..పాహిమాం
జగదేక బంధూ..పాహిమాం
పాహిమాం..కారున్య సింధూ
పతిత పావనా..దీనజనావన
ప్రేమనిధాన..పాహిమాం
పతిత పావనా..దీనజనావన
ప్రేమనిధాన..పాహిమాం
చరణం::4
నీ ఒడిలో..ఒదిగే పాపలం
పాహిమాం..పాహిమాం
నీ అడుగుల..వాలే పూవులం
పాహిమాం..పాహిమాం
నీ దయవుంటే..నీశెలవైతే
నీ గుడిలో..వెలిగే దివ్వెలం
నీ దయవుంటే..నీశెలవైతే
నీ గుడిలో..వెలిగే దివ్వెలం
పతితపావనా..దీనజనావన
ప్రేమనిధాన..పాహిమాం
పాహిమాం..పాహిమాం
పాహిమాం..పాహిమాం
పాహిమాం..పాహిమాం
జగదేక బంధూ..పాహిమాం
పాహిమాం..కారున్య సింధూ