సంగీతం::K.V.మహదేవన్
రచన::వెన్నెలకంటి
గానం::S.P.బాలసుబ్రహ్మణ్యం, K.S.చిత్ర, S.P.శైలజ
Film Directed By:::Kodi Ramakrishna
తారాగణం::బాలకృష్ణ,విజయశాంతి.
పల్లవి::
ముత్యాల పందిరిలో..మురిపాల సందడిలో
మూడు ముళ్ళ మూర్తం..ఎప్పుడమ్మా ఓ చిలకమ్మ
ముద్దులన్నీ పండే దేపుడెమ్మా..ముత్యాల పందిరిలో
మురిపాల సందడిలో..మూడు ముళ్ళ మూర్తం
ముందుంది ఓ చిన్నమ్మ..ముత్తైడు భాగ్యాలిస్తుంది
ఇది మొదలె నమ్మ..ముందు కధ ఉందో యమ్మ
తొలి రేయిలోన..దొర వయసు వాయనాలు
ఇవ్వాలమ్మ..
చరణం::1
పసుపు పారాణి బొట్టు కాటుక దిద్దిన
నా రాణి నాకే కానుక
మమతే మంత్రముగా మనసే సాక్షిగా
మాటే మనుగదగా మనమే పాటగా
సాగాలి జీవితము..చెప్పాలి స్వాగతము
నిండు నూరేళ్ళ మనువుగా
రాగాల శృంగారం..గారాల సంసారం
పండే వెయ్యేళ్లు మనవిగా
బుగ్గన చుక్కా వచ్చెనే సిగ్గుల మొగ్గ విచ్చెనే
ఈ నిగ్గే పగ్గ మేసి నెగ్గేణమ్మ లగ్నమంటూ
చరణం::2
తేనెకు తీయదనం
తెలిపే ముద్దులో వయశుకు
వేచదనం తెలిసే పొద్దులో
కలలకు కమ్మదనం కలిగే రేయిలో
వలపుల మూల ధనం పెరిగే హాయిలో
అందాల వెల్లువలో..వందేళ్ళ పల్లవులే
పాడే పరువాలే తోడుగా..వెయ్యాలి కూడికలు
వెయ్యేళ్ల వేడుకలు..వేడిగా విరహాలె వీడగా
గాజుల వీణ మీట గా..జాజుల వాన చాటగా
ఈ కొంగు కొంగు కూడే రంగ రంగ వైభవంగా
ముత్యాల పందిరిలో..మురిపాల సందడిలో
మూడు ముళ్ళ మూర్తం..ఎప్పుడమ్మా ఓ చిలకమ్మ