Wednesday, April 15, 2009

ఇంద్ర ధనుస్సు --1978







సంగీతం::KV.మహాదేవన్
రచన::ఆత్రేయ
గానం::SP.బాలసుబ్రమణ్యం


నేనొక ప్రేమ పిపాసిని నీవొక ఆశ్రమ వాసివి
నా దాహం తీరనిది నీ హృదయం కరగనిది
నేనొక ప్రేమ పిపాసిని....

తలుపు మూసిన తలవాకిటిలో
పగలు రేయి నిలుచున్నా
పిలిచి పిలిచి బదులేరాక
అలసి తిరిగి వెళుతున్నా
నా దాహం తీరనిది
నీ హృదయం కరగనిది
నేనొక ప్రేమ పిపాసిని...

పూట పూట నీ పూజ కోసమని
పువ్వులు తెచ్చాను
ప్రేమ భిక్షను పెట్టగలవని దోసిలి ఒగ్గాను
నీ అడుగులకు మడుగులోట్టగా
ఎడదను పరిచాను
నీవు రాకనే అడుగు పడకనే నలిగిపోయాను
నేనొక ప్రేమ పిపాసిని...

పగటికి రేయి .. రేయికి పగలు.. పలికే వీడ్కోలు
సెగ రేగిన గుండెకు చెబుతున్నా
నీ చెవిన పడితే చాలునని
నా జ్ఞాపకాల నీడలలో నన్నేపుడో చూస్తావు
నను వలచావని తెలిసేలోగా నివురైపోతాను
నేనొక ప్రేమ పిపాసిని...

అమెరికా అమ్మాయి--1976



సంగీతం::GK.వేంకటేష్
రచన::దేవులపల్లి క్రిష్ణ శాస్త్రి
గానం::P.సుశీల


:::

పాడనా తెనుగు పాటా
పాడనా తెనుగు పాటా
పరవశనై మీ ఎదుట మీ పాట
పాడనా తెనుగు పాట

కోవెల గంటల గణగణలూ
గోదావరి తరగల గలగలలు
కోవెల గంటల గణగణలూ..
గోదావరి తరగల గలగలలు

మావులా పూవులా మూకుల పైన
మసలే గాలుల గుసగుసలూ..
మంచి ముత్యాల పేట
మధురామ్రుతాల తేట

ఒక పాట
పాడనా తెనుగు పాట
పరవశనై నే పరవశనై
మీ ఎదుట మీ పాట
పాడనా తెనుగు

త్యాగయ క్షేత్రయ రామదాసులు
త్యాగయ క్షేత్రయ రామదాసులు
తనివి తీర వినిపించినది
నాడ నాడుల..ఆ..కదిలించేది
వాడ వాడలా కరిగించేది

చక్కెర మాటల మూట
చిక్కని తేనెల వూట
ఒక పాట
పాడనా తెనుగు పాట

ఒళ్ళంత వయ్యారి కోకా
కళ్ళకు కాటుక రేఖా
ఒళ్ళంత వయ్యారి కోక..
కళ్ళకు కాటుక రేఖ..

మెళ్ళో తాళి..కాళ్ళకు పారాణి
మెరిసే కుంకుమ బొట్టు...
ఘల్లు ఘల్లునా కడియాలందెల
అల్లనల్లనా నడయాడె..
తెనుగు తల్లి పెట్టని కోట
తెనుగుణాట ప్రతి చోటా

ఒక పాట
పాడనా తెనుగు పాట
పరవశనై నే పరవశనై
మీ ఎదుట మీ పాట
పాడనా తెనుగు పాట


America Ammaayi--1976
Music Director::G.K.Venkatesh
Lyricist::Devulapalli Krishna Sastry
Directed by::Singeetam Srinivasa Rao
Produced by::Navata' Krishnam Raju
Singer::P.Susheela
Cast::Sreedhar,Ranganaath,Deepa,Anne Chaymotty,pandaribaay,

::: 

paadanaa telugupaaTa..aa
padanaa telugupaaTa..aa
paravaShanai mee yeduTa mee paTa
paadanaa telugu paTa

:::1

kOvela ganTala ganaganaloo
gOdaavari taragala galagalaloo
kOvela ganTala ganaganaloo
gOdaavari taragala galagalaloo

puvula topula mupula paina
masale galula gusagusaloo
manchi mutyalapeTa
madhuramrutala teTa
oka paTa..paDanaa tenugu paaTa
paDanaa tenugu paaTa
paravaShanai mee yeduTa mee paTa
paDanaa tenugu paTa

:::2

tyagayya kshetrayya ramadasulu
tyagayya kshetrayya ramadasulu
tanivi teera vinipinchindi
naDunaDulu kadilinchEdi
vaDavaDalaa kariginchEdi
chakkera maTala muuTa
chikkani tenela vuuTa 
oka paaTa..paDanaa tenugu paaTa
paDanaa tenugu paaTa
paravaShanai mee yeduTa mee paaTa
paDanaa tenugu paTa

:::3

vollanta vayyari kOkaa
kaLLaku kaTuka rEkhaa
vollanta vayyari kOkaa
kaLLaku kaTuka rEkhaa
mellO taaLi kaaLLaku paaraNi
merisE kunkuma boTTu
ghallu ghalluna kaDiyalandelu
allanallana naDayaDe
telugu talli peTTani kOTa
telugunaTa pratichOTa oka paaTa
paDanaa tenugupaTa
paDanaa tenugupaTa
paravaShanai mee yeduTa mee paaTa

paDanaa tenugu paaTa...

చిన్ననాటి స్నేహితులు--1971


సంగీతం::K.V.మహాదేవన్ 
రచన::D.C.నారాయణరెడ్డి 
గానం::P.సుశీల 

పల్లవి::

సీతమ్మ తల్లికి సీమంతమమ్మా
సీతమ్మ తల్లికి సీమంతమమ్మా
శ్రీదేవి భూదేవి దీవింతురమ్మా
శ్రీదేవి భూదేవి దీవింతురమ్మా

సీతమ్మ తల్లికి సీమంతమమ్మా
సీతమ్మ తల్లికి సీమంతమమ్మా
శ్రీదేవి భూదేవి దీవింతురమ్మా
శ్రీదేవి భూదేవి దీవింతురమ్మా
శ్రీరస్తూ శుభమస్తూ..సుపుత్ర ప్రాప్తిరస్తూ తథాస్తూ 

చరణం::1

వేదగానమే వినువీధులంటగా
మంగళ నాదాలు ముంగిట మ్రొయగా 
వేదగానమే వినువీధులంటగా
మంగళ నాదాలు ముంగిట మ్రొయగా 
శ్రీవాణి వీణియ సవరించగా
శ్రీవాణి వీణియ సవరించగా
శ్రీగౌరి సుభగీతి వినిపించగా
సీతమ్మ తల్లికి సీమంతమమ్మా
శ్రీదేవి భూదేవి దీవింతురమ్మా

చరణం::2

కరముల రతనాల గాజులు తొడిగీ
శిరమున ముత్యాల అక్షితలు చల్లి 
కరముల రతనాల గాజులు తొడిగీ
శిరమున ముత్యాల అక్షితలు చల్లి 
ముత్తైదువలే హారతులివ్వగా
ముత్తైదువలే హారతులివ్వగా
ముక్కోటి దేవతలు దీవించగా
సీతమ్మ తల్లికి సీమంతమమ్మా
సీతమ్మ తల్లికి సీమంతమమ్మా
శ్రీదేవి భూదేవి దీవింతురమ్మా
శ్రీదేవి భూదేవి దీవింతురమ్మా
శ్రీరస్తూ శుభమస్తూ..సుపుత్ర ప్రాప్తిరస్తూ తథాస్తూ