Thursday, May 24, 2012

గూడుపుఠాని--1972

సంగీతం::S.P.కోదండపాణి
రచన::దాశరధి కృష్ణమాచార్య
గానం::S.P.బాలు,P.సుశీల
నటీనటులు:: కృష్ణ , శుభ

తనివి తీరలేదే నా మనసు నిండలేదే
ఏనాటి బంధమి అనురాగం
తనివి తీరలేదే నా మనసు నిండలేదే
ఏనాటి బంధమి అనురాగం
చెలియా ఓ..ఓ చెలియా...ఆఆఆ

చరణం::1

ఎన్నోవసంత వేళలో
వలపుల ఊయల లూగమె
ఎన్నోవసంత వేళలో
వలపుల ఊయల లూగమె
ఎన్నో పున్నమి రాత్రులలో వెన్నల జలకాలాడామే
అందని అందాల అంచుకే చేరినను
అందని అందాల అంచుకే చేరినను
విరిసిన పరువాల లోతులే చూసినను
తనివి తీరలేదే నా మనసు నిండలేదే
ఆ............. ఆ......................
ఏనాటి బంధమి అనురాగం
తనివి తీరలేదే నా మనసు నిండలేదే
ఏనాటి బంధమి అనురాగం
ప్రియతమా.........ఓ......ప్రియతమా..ఆఆఆ

చరణం::2

ఎప్పుడు నీవే నాతో వుంటే
ఎన్ని వసంతలైతే నేమి
ఎప్పుడు నీవే నాతో వుంటే
ఎన్ని వసంతలైతే నేమి
కన్నులనీవే కనబడుతుంటే
ఎన్ని పున్నములు వస్తే ఏమి
వెచ్చని కౌగిలిలో హాయిగా కరిగించినను
వెచ్చని కౌగిలిలో హాయిగా కరిగించినను
తీయని హృదయంలో తేనెలే కురిపించినను

తనివి తీరలేదే నా మనసు నిండలేదే
ఏనాటి బంధమి అనురాగం
మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్