Monday, February 16, 2015

మూగమనసులు--1964



సంగీతం::K.V. మహదేవన్
రచన::ఆచార్య ఆత్రేయ
గానం::ఘంటసాల,P.సుశీల
తారాగణం::అక్కినేని,సావిత్రి,గుమ్మడి,నాగభూషణం,జమున,పద్మనాభం,అల్లు రామలింగయ్య.

పల్లవి::

ఈ నాటి ఈ బంధమేనాటిదో
ఏనాడు పెనవేసి ముడివేసెనో..ఓ..ఓ..ఓ
ఈ నాటి ఈ బంధమేనాటిదో..ఓ..ఓ..ఓ
ఏనాడు పెనవేసి ముడివేసెనో..ఓ..ఓ..ఓ
ఈ నాటి ఈ బంధమేనాటిదో..ఓ..ఓ..ఓ

చరణం::1 

చుక్కలు పొదిగిన ఆకాశం
మక్కువలొలికే మనకోసం..మ్మ్
చుక్కలు పొదిగిన ఆకాశం
మక్కువలొలికే మనకోసం..మ్మ్

మంచు తెరలలో..మల్లెలతో
పందిరి మంచం వేసిందీ..ఈ
మంచు తెరలలో..మల్లెలతో
పందిరి మంచం వేసిందీ..ఈ
ఈ నాటి ఈబంధమేనాటిదో..ఓ

చరణం::2 

నీ కనుపాపల ఊయలలో
నే పసిపాపలా పవళిస్తా..ఆ
నీ కనుపాపల ఊయలలో
నే పసిపాపలా పవళిస్తా

నురాగము అనురాగమునే..ఏ
ఆలపించి నిను లాలిస్తా..ఆ
నురాగము అనురాగమునే..ఏ
ఆలపించి నిను లాలిస్తా

నీలో నాలో నేనేలే..ఏఏఏ
నీలో నాలో నేనేలే..ఏఏఏ 
మనలో మమతే చిరంజీవిలే
ప్రేమకు రూపం మనమేలే
ఈ నాటి ఈ బంధ మేనాటిదో..ఓఓఓ

చరణం::3

నీ సిగ విరజాజినై
నీ ఎద నెల రాజునై

నీ నగవుల రాసినై..ఈ
నీ మగసిరి దాసినై..ఈ

నీవూ నేనూ నిజమై రుజువై
నీవూ నేనూ నిజమై రుజువై
ఎన్ని యుగాలుగ ఉన్నామూ
ఎన్ని జన్మలు కన్నామో..ఓఓఓ

ఈ నాటి ఈ బంధమేనాటిదో
ఏనాడు పెనవేసి ముడివేసెనో..ఓ..ఓ..ఓ
ఈ నాటి ఈ బంధమేనాటిదో..ఓ..ఓ..ఓ
ఏనాడు పెనవేసి ముడివేసెనో..ఓ..ఓ..ఓ
ఈ నాటి ఈ బంధమేనాటిదో..ఓ..ఓ..ఓ

Moogamanasulu--1964
Music::K.V.Mahadevan
Lyrics::Achaarya-Atreya
Singer's::Ghantasala,P.Suseela
Cast::Akkineni,Savitri,Gummadi,Nagabhushanam.Jamuna,Padmanabham,Alluramalingayya.

::::::

ii naaTi ii bandhamEnaaTidO
EnaaDu penavEsi muDivEsenO..O..O..O
ii naaTi ii bandhamEnaaTidO..O..O..O
EnaaDu penavEsi muDivEsenO..O..O..O
ii naaTi ii bandhamEnaaTidO..O..O..O

:::::1 

chukkalu podigina AkaaSam
makkuvalolikE manakOsam..mm
chukkalu podigina AkaaSam
makkuvalolikE manakOsam..mm

manchu teralalO..mallelatO
pandiri mancham vEsindii..ii
manchu teralalO..mallelatO
pandiri mancham vEsindii..ii
ii naaTi iibandhamEnaaTidO..O

::::2 

nee kanupaapala UyalalO
nE pasipaapalaa pavaListaa..aa
nee kanupaapala UyalalO
nE pasipaapalaa pavaListaa

nuraagamu anuraagamunE..E
Alapinchi ninu laalistaa..aa
nuraagamu anuraagamunE..E
Alapinchi ninu laalistaa

neelO naalO nEnElE..EEE
neelO naalO nEnElE..EEE 
manalO mamatE chiranjeevilE
prEmaku roopam manamElE
ii naaTi ii bandha mEnaaTidO..OOO

::::3

nee siga virajaajinai
nee eda nela raajunai

nee nagavula raasinai..ii
nee magasiri daasinai..ii

neevuu nEnuu nijamai rujuvai
neevuu nEnuu nijamai rujuvai
enni yugaaluga unnaamuu
enni janmalu kannaamO..OOO

ii naaTi ii bandhamEnaaTidO
EnaaDu penavEsi muDivEsenO..O..O..O
ii naaTi ii bandhamEnaaTidO..O..O..O
EnaaDu penavEsi muDivEsenO..O..O..O
ii naaTi ii bandhamEnaaTidO..O..O..O

మాయాబజార్--1957



















సంగీతం::ఘంటసాల
రచన::పింగళి నాగేంద్రరావు 
గానం::ఘంటసాల,P.లీల 
తారాగణం::N.T.రామారావు,అక్కినేని,S.V..రంగారావు,రేలంగి,R.నాగేశ్వరరావు, 
C.S.R.ఆంజనేయులు,గుమ్మడి,సావిత్రి,ఛాయాదేవి,ఋష్యేంద్రమణి 

పల్లవి::

లాహిరి..లాహిరి..లాహిరిలో
ఒహో జగమే వూగేనుగా వూగేనుగా తూగెనుగా

లాహిరి..లాహిరి..లాహిరిలో
ఒహో జగమే వూగేనుగా వూగేనుగా తూగెనుగా
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ

చరణం::1

తారాచంద్రుల విలాసములతో 
విరిసే వెన్నెల పరవడిలో ఉరవడిలో
తారాచంద్రుల విలాసములతో 
విరిసే వెన్నెల పరవడిలో
పూల వలపుతో ఘుమఘుమలాడే 
పిల్ల వాయువుల లాలనలో
లాహిరి..లాహిరి..లాహిరిలో
ఒహో జగమే వూగేనుగా వూగేనుగా తూగెనుగా
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ

చరణం::2

అలల ఊపులో తీయని తలపులు
చెలరేగే ఈ కలకలలో..మిలమిలలో
అలల ఊపులో తీయని తలపులు చెలరేగే ఈ కలకలలో
మైమరపించే ప్రేమానౌకలో హాయిగ చేసే విహారణలో

లాహిరి..లాహిరి..లాహిరిలో
ఒహో జగమే వూగేనుగా వూగేనుగా తూగెనుగా
లాహిరి..లాహిరి..లాహిరిలో
ఒహో జగమే వూగేనుగా వూగేనుగా తూగెనుగా
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ

చరణం::3

రసమయ జగమును రాసక్ఱీడకు 
ఉసిగొలిపే ఈ మధురిమలో..మధురిమలో
రసమయ జగమును రాసక్ఱీడకు 
ఉసిగొలిపే ఈ మధురిమలో
ఎల్లరి మనములు ఝల్లన జేసే 
చల్లని దేవుని అల్లరిలో

లాహిరి..లాహిరి..లాహిరిలో
ఒహో జగమే వూగేనుగా వూగేనుగా తూగెనుగా
లాహిరి..లాహిరి..లాహిరిలో
ఒహో జగమే వూగేనుగా వూగేనుగా తూగెనుగా
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ

మాయాబజార్--1957


సంగీతం::ఘంటసాల
రచన::పింగళినాగేంద్రరావు 
గానం::ఘంటసాల,సావిత్రి 
తారాగణం::N.T.రామారావు,అక్కినేని,S.V.రంగారావు,రేలంగి,R.నాగేశ్వరరావు, 
C.S.R.ఆంజనేయులు,గుమ్మడి,సావిత్రి,ఛాయాదేవి,ఋష్యేంద్రమణి 

పల్లవి::

సుందరి నీ వంటి దివ్య స్వరూపము
ఎందెందు వెదకిన లేదు కదా
ఎందెందు వెదకిన లేదు కదా
నీ అందచందాలింక నావే కదా
సుందరి..ఓహో సుందరి..ఆహా సుందరి
నీ వంటి దివ్య స్వరూపము
ఎందెందు వెదకిన లేదు కదా

చరణం::1

దూరం దూరం..ఆ..
దూరమెందుకే చెలియా వరియించి
వచ్చిన ఆర్య పుత్రుడింక నేనే కదా
ఆ..ఆ..ఆ..ఆ  
దూరమెందుకే చెలియా వరియించి
వచ్చిన ఆర్య పుత్రుడింక నేనే కదా
మన పెళ్లి వేడుకలింక రేపే కదా

అయ్యో..సుందరి..
ఆహా సుందరి..ఓహో సుందరి
నీ వంటి దివ్య స్వరూపము
ఎందెందు వెదకిన..లేదు కదా
మన పెళ్లి వేడుకలింక రేపే కదా
సుందరి..ఆహా సుందరి..ఓహో సుందరి

చరణం::2

రేపటి దాకా ఆగాలి..ఆ
అగుమంటు సఖియా అరమరలెందుకే
సొగసులన్నీ నాకు నచ్చేగదా
ఊ..
అగుమంటు సఖియా అరమరలెందుకే
సొగసులన్నీ నాకు నచ్చేగదా
నీ వగల నా విరహము హెచ్చేకదా

సుందరి..ఓహో సుందరి..ఆహ సుందరి
నీ వంటి దివ్య స్వరూపము
ఎందెందు వెదకిన లేదు కదా
నీ వగల నా విరహము హెచ్చేకదా
సుందరి..ఆహా సుందరి..ఓహో సుందరి

చరణం::3

హెచ్చితే ఎలా? పెద్దలున్నారు
పెద్దలున్నారంటు హద్దులెందుకె రమణి
ఊ..ఆ..
పెద్దలున్నారంటు హద్దులెందుకె రమణి
వద్దకు చేరిన పతినే కదా..
ఆ..ఆ..ఆ ఆ..ఆ..ఆ
పెద్దలున్నారంటు హద్దులెందుకె రమణి
వద్దకు చేరిన పతినే కదా 
నీ ముద్దు ముచ్చటలింక నావే కదా

సుందరి నీవంటి దివ్య స్వరూపము
ఎందెందు వెదకిన లేదు కదా
నీ ముద్దు ముచ్చటలింక నావే కదా
ఊ..అహ..సుందరి..సుందరి ఓహో సుందరి 
ఒహొ..సుందరి..ఊ..ఒహొ..సుందరి..ఓహో సుందరి