సంగీతం::సత్యం
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::P.సుశీల కోరస్
తారాగణం::N.T.రామారావు,జయసుధ,రాజనాల,ప్రభాకర రెడ్డి,అల్లు రామలింగయ్య
పల్లవి::
రూ రూ రూరురూరురూ
రూ రూ రూరురూరురూ
పిలిచె పిలిచె అనురాగం
పలికె పలికె నవగీతం
పిలిచె పిలిచె అనురాగం
పలికె పలికె నవగీతం
అతడు నను చేరగానే
బ్రతుకు పులికించె తానే
బ్రతుకు పులకించె తానే
పిలిచె పిలిచె అనురాగం
పలికె పలికె నవగీతం
చరణం::1
రూ రూ రూరురూరురూ
రూ రూ రూరురూరురూ
రూ రూ రురురుౠ
రూ రూ రురురుౠ..హా
రూ రూ రురురుౠ..
ఈ పడుచు గాలి నాపైన వాలి
ఏమమ్మ ఇంత సిగ్గు ఎందుకన్నది
ఏ బదులు రాక నిలువలేక
జువ్వాడె నా మనసేమో నవ్వుకున్నదీ
ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ..
పిలిచె పిలిచె అనురాగం
పలికె పలికె నవగీతం
చరణం::2
ఆ ఆ ఆఅ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
రవ్వంత బిడియం..పువ్వంత ప్రణయం
నా రాజు చూపుల్లోనే దాచుకున్నాడు
నే దాచలేక..ప్రేమలేఖ
అందాల మబ్బుల ద్వారా అందజేస్తాను
ఆఆ ఆఆ ఆఆ ఆఆ ఆఆ ఆఆ ఆఆఆ
పిలిచె పిలిచె అనురాగం
పలికె పలికె నవగీతం
పిలిచె పిలిచె అనురాగం
పలికె పలికె నవగీతం
అతడు నను చేరగానే
బ్రతుకు పులికించె తానే
బ్రతుకు పులకించె తానే
పిలిచె పిలిచె అనురాగం
పలికె పలికె నవగీతం