Friday, July 02, 2010

వయసొచ్చిన పిల్ల--1975


సంగీతం::T.చలపతిరావు  
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::P.సుశీల ,రమేష్ 
తారాగణం::లక్ష్మీ,మురళిమోహన్,గిరిబాబు,జి.వరలక్ష్మి

పల్లవి::

జీవితమే ఒక కవితగా
ఆ కవితకే అందని మమతగా
ఆ మమతే నిత్యవసంతగా
ఉందామా ఉందామా
ఉందామా ఉందామా
మనముందామా ఉందామా

చరణం::1

తారలు ప్రతీ రేయి వస్తాయి
పున్నమి మాసానికి ఒకేసారి ఒకేసారి
పువ్వులు ప్రతిరోజూ పూస్తాయి
వసంతం ఏడాదికి ఒకేసారి ఒకేసారి
ఎన్ని కోర్కెలున్నాకలలేవో కంటున్నా
ఎన్ని కోర్కెలున్నా కలలేవో కంటున్నా

చరణం::2

కన్నె మనసు వలచెది ఒకేసారి
బ్రతుకులో ఒకేసారి
జీవితమే ఒక కవితగా
ఆ కవితకే అందని మమతగా
ఆ మమతే నిత్యవసంతగా
ఉందామా ఉందామా
ఉందామా ఉందామా
మనముందామా ఉందామా

చరణం::3

నింగిని విడిపోదు నీలిమ
రంగుల మబ్బులెన్నో ముసిరినా ముసిరినా
కెరటం విడిపోదూ కడలినీ
పెను తుఫానులెన్నెన్నో విసిరినా విసిరినా
కాలం కాదన్నా ఆ దైవం ఏమన్నా
కాలం కాదన్నా ఆ దైవం ఏమన్నా
ఏనాడు విడిపోదు ఈ భంధము
అదేలే...అనుబంధం
జీవితమే ఒక కవితగా
ఆ కవితకే అందని మమతగా
ఆ మమతే నిత్యవసంతగా
ఉందామా ఉందామా
ఉందామా ఉందామా
మనముందామా ఉందామా