Thursday, September 30, 2010

వింత దంపతులు--1972




















సంగీతం::S.P.కోదండపాణి
రచన::దాశరథి
గానం::S.P. బాలు,P.సుశీల

పల్లవి::

కలలన్నీ నిజమైన..కమ్మని వేళా
కలకాలం నిలవాలి..వలపుల వేళా
పూవులో తావిలా..పూవులో తావిలా
నాలోని అణువణువూ..నీదే కాదా
కలలన్నీ నిజమైన..కమ్మని వేళా
కలకాలం నిలవాలి..వలపుల వేళా

చరణం::1

ఎదురుగ నీ వుంటే..చాలు
వేరే స్వర్గాలే..లేవు
ఎంతగా చూసినా..తనివి తీరదూ
మమతలో తేలినా..మనసు నిండదూ
ఆ..యుగాలు నీతోనే..గడపాలీ
జగాలు నీ ఒడిలో..మరవాలీ   
     
కలలన్నీ నిజమైన..కమ్మని వేళా
కలకాలం నిలవాలి..వలపుల వేళా

చరణం::2

మల్లెలు చల్లే..నీ చిరునవ్వే
కాళ్ళకు బంధం..వేసేనూ
ఆఆఆఆ 
ఆ..మల్లెలు చల్లే..నీ చిరునవ్వే
కాళ్ళకు బంధం..వేసేనూ
గడియయే యుగముగా..వేచియుందునూ
మనసులో మమతతో..ఎదురు చూతునూ
ఇరువురి హృదయాలు..ఒకటేలే
తరగని ప్రణయాలు..మనవేలే 
         
కలలన్నీ నిజమైన..కమ్మని వేళా
కలకాలం నిలవాలి.వలపుల వేళా

Vinta Dampatulu--1971
Music::S.P.Kodanda Pani
Lyrics::Dasarathi
Singer's::S.P.Balu,P.Suseela

::::

kalalanni nijamaina kammani velaa 
kalakaalam nilavaali valapula velaa
poovulo taavilaa..poovulo taavilaa 
naaloni anuvanuvu neede kaadaa
kalalanni nijamaina kammani velaa  
kalakaalam nilavaali valapula velaa

::::1

eduruga nee vuntechaalu
vere swargaale levu
entagaa choosinaa tanivi teeradu
mamatalo telinaa manasu nindadu
aa..yugaalu neetone gadapaalee
jagaalu nee odilo maravaalee 
       
kalalanni nijamaina kammani velaa
kalakaalam nilavaali valapula velaa

::::2

mallelu challe nee chirunavve
kaallaku bandham vesenoo
aaaaaaaaaaaa 
aa..mallelu challe nee chirunavve
kaallaku bandham vesenoo
gadiyaye yugamugaa vechiyundunu
manasulo mamatato eduru chootunu
iruvuri hrudayaalu okatele
taragani pranayaalu manavele 
         
kalalanni nijamaina kammani velaa
kalakaalam nilavaali valapula velaa

డాక్టర్‌ బాబు--1973























సంగీతం::T. చలపతిరావు
రచన::మోదుకూరి జాన్సన్
గానం::మాధవపెద్ది సత్యం

పల్లవి::

ఎవడురా దొంగ ఎవడురా
ఎవడురా దొంగ ఎవడురా 
దొరలకూ ద్రోహులకూ దొరకని నేనా
తుఛ్ఛులకూ లుఛ్ఛాలకు లొంగని నేనా   
ఎవడురా దొంగ ఎవడురా
ఎవడురా దొంగ ఎవడురా 

చరణం::1

చట్టాన్నొక కోటుగా
సంఘాన్నొక బూటుగా
న్యాయాన్నీ థర్మాన్నీ
లాల్చీ బనియన్లుగా
వేషాలే వేస్తారే
మోసాలే చేస్తారే
వాళ్ళంతా దొరలా..ఆయ్నే
ను నేనా దొంగను           
ఎవడురా దొంగ ఎవడురా
ఎవడురా దొంగ ఎవడురా 

చరణం::2

వడ్డీ పేరుతో ప్రాణం
పిండుకునే పుండాకోర్లు
దేముని పేరుతో డబ్బును
దండుకునే దగాకోర్లు
అబలల శీలాల్నీ అణాపైసలకు అమ్మే 
అధమాధములు
వాళ్ళంతా దొరలా..ఆయ్నే
నేను నేనా దొంగను     
ఎవడురా దొంగ ఎవడురా
ఎవడురా దొంగ ఎవడురా 

చరణం::3

దొంగెవరో దొర ఎవరో
తేలక పోతుందా
ఈ చీకటి తొలగిపోయి
వెలుగు రాకపోతుందా
కన్నబిడ్డ దగ్గరై
కన్నీరే దూరమై
కలకాలం పండగలా
గడవక పోతుందా
ఆ రోజు రాకపోతుందా     
ఎవడురా దొంగ ఎవడురా
ఎవడురా దొంగ ఎవడురా 
ఎవడురా దొంగ ఎవడురా
ఎవడురా దొంగ ఎవడురా