Friday, April 02, 2010

జీవనతరంగాలు--1973




సంగీతం::J.V. రాఘవులు
రచన::ఆచార్య ఆత్రేయ
గానం::ఘంటసాల
తారాగణం::శోభన్‌బాబు,వాణిశ్రీ, గుమ్మడి, కృష్ణంరాజు, లక్ష్మి, చంద్రమోహన్

పల్లవి::

పది మాసాలు..మోశావు పిల్లలను
బ్రతుకంతా మోశావు..బాధలను 
ఇన్ని మోసిన..నిన్ను 
మోసే వాళ్ళు..లేక వెళుతున్నావు

ఈ జీవన తరంగాలలో..ఆ దేవుని చదరంగంలో
ఎవరికి ఎవరు సొంతము..ఎంతవరకీ బంధము

చరణం::1

కడుపుచించుకు..పుట్టిందొకరు
కాటికి నిన్ను..మోసేదొకరు
తలకు కొరివి..పెట్టేదొకరు
ఆపై నీతో వచ్చేదెవరు..ఆపై నీతో వచ్చేదెవరు

ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగంలో
ఎవరికి ఎవరు సొంతము ఎంతవరకీ బంధము

చరణం::2

మమతే మనిషికి..బందిఖానా
భయపడి తెంచుకు పారిపొ్యినా
తెలియని పాశం..వెంటపడి
రుణం తీర్చుకో..మంటుందీ
తెలియని పాశం..వెంటపడి
రుణం తీర్చుకో..మంటుందీ
నీ భుజం మార్చుకో..మంటుంది

ఈ జీవన తరంగాలలో..ఆ దేవుని చదరంగంలో
ఎవరికి ఎవరు సొంతము..ఎంతవరకీ బంధము

చరణం::3

తాళి కట్టిన మగడు..లేడని
తరలించుకుపోయే..మృత్యువాగదు
ఈకట్టెను కట్టెలు..కాల్చక మానవు
ఆ కన్నీళ్ళకు..చితి మంటలారవు
ఈ మంటలు ఆ గుండెను..అంటక మానవు

ఈ జీవన తరంగాలలో..ఆ దేవుని చదరంగంలో
ఎవరికి ఎవరు సొంతము..ఎంతవరకీ బంధము