Friday, December 16, 2011

దొరబాబు--1974















సంగీత::J.V.రాఘవులు
రచన::మైలవరపు గోపి
గానం::V.రామకృష్ణ , P.సుశీల
తారాగణం: అక్కినేని,మంజుల,సత్యనారాయణ,జయంతి,గిరిబాబు.

పల్లవి::

ఒంటరిగా వున్నాను..ఇస్సిరిస్సు రంటున్నాను
ఒంటరిగా వున్నాను..ఇస్సిరిస్సు రంటున్నాను
ఇంతకన్న ఏం చెప్పుకోనురో..బావయ్యో
యిడమరిచి చెప్పుకుంటే..సిగ్గయ్యో
నే యిడమరిచి చెప్పుకుంటే..సిగ్గయ్యో
పక్కన నేనున్నానూ..ఆవురావురంటున్నానూ
పక్కన నేనున్నానూ..ఆవురావురంటున్నానూ
దారిలేక ఆగానమ్మో..చిట్టమ్మో
కంటికేమో కునుకు రాదు..ఒట్టమ్మో
నా కంటికేమో కునుకు రాదు..ఒట్టమ్మో

చరణం::1

నా మనసుకు బుద్దిలేదు..పదారెళ్ళుగా
బుద్దొచ్చి మరుగుతోంది..నాలుగేళ్ళుగా
నా మనసుకు బుద్దిలేదు..పదారెళ్ళుగా
బుద్దొచ్చి మరుగుతోంది..నాలుగేళ్ళుగా
నామోజుకు రంజులేదు..నువ్వు చేరకా
నామోజుకు రంజులేదు..నువ్వు చేరకా
రంజులోన లబ్జులేదు...కోర్కెతీరకా   
ఒంటరిగా వున్నాను..ఇస్సిరిస్సు రంటున్నాను
ఒంటరిగా వున్నాను..ఇస్సిరిస్సు రంటున్నాను
దారిలేక ఆగానమ్మో..చిట్టమ్మో
కంటికేమో కునుకు రాదు..ఒట్టమ్మో
నా కంటికేమో కునుకు రాదు..ఒట్టమ్మో

చరణం::2

పొద్దు పొడుపు యెందుకనో..చురుక్కుమంటది
పొద్దు గుంకితే నాలో..కలుక్కుమంటదీ
పొద్దు పొడుపు..యెందుకనో చురుక్కుమంటది
పొద్దు గుంకితే నాలో..కలుక్కుమంటదీ 
పొద్దుకైన వొకరైతే..చులకనే మరీ
పొద్దుకైన వొకరైతే..చులకనే మరీ
ఇద్దరమూ వొకటైతే..వోడిపోతదీ          
ఒంటరిగా....వున్నాను
ఇస్సిరిస్సు...రంటున్నాను
ఒంటరిగా....వున్నాను
ఇస్సిరిస్సు...రంటున్నాను

పక్కన నేనున్నానూ..ఆవురావురంటున్నానూ
పక్కన నేనున్నానూ..ఆవురావురంటున్నానూ
దారిలేక ఆగానమ్మో చిట్టమ్మో
కంటికేమో కునుకు రాదు ఒట్టమ్మో
నా కంటికేమో కునుకు రాదు ఒట్టమ్మో
ఒంటరిగా వున్నాను..ఇస్సిరిస్సు రంటున్నాను
ఒంటరిగా వున్నాను..ఇస్సిరిస్సు రంటున్నాను
ఇంతకన్న ఏం చెప్పుకోనురో బావయ్యో
యిడమరిచి చెప్పుకుంటే సిగ్గయ్యో
నే యిడమరిచి చెప్పుకుంటే సిగ్గయ్యో

దొరబాబు--1974




సంగీత::J.V.రాఘవులు
రచన::ఆంజనేయశాస్త్రి
గానం::V.రామకృష్ణ , P.సుశీల
తారాగణం: అక్కినేని,మంజుల,సత్యనారాయణ,జయంతి,గిరిబాబు.

పల్లవి::

నీకూ నాకూ పెళ్ళంటె..నింగి నేలా మురిశాయీ
వయసూ సొగసూ కలిబోసి రంగవల్లి వేశాయీ
నీకూ నాకూ పెళ్ళంటె..నింగి నేలా మురిశాయీ
వయసూ సొగసూ కలిబోసి రంగవల్లి వేశాయీ
నీకూ నాకూ పెళ్ళంటె..నింగి నేలా మురిశాయీ 

చరణం::1

కొత్త కొత్త కోరికలేవో నాలో చెలరేగాయీ
కౌగిలిలో బంధిస్తేనే కలత నిదురపోతాయీ
కొత్త కొత్త కోరికలేవో నాలో చెలరేగాయీ
కౌగిలిలో బంధిస్తేనే కలత నిదురపోతాయీ
తెలిసింది నీ ఎత్తూ..ఆ ఎత్తే గమ్మత్తూ
అహా..తెలిసింది నీ ఎత్తూ..ఆ ఎత్తే గమ్మత్తూ
సందెలో విందులా..విందులో..పొందులా
పొందులా..అలా అలా అలా అలా అలా
నీకూ నాకూ పెళ్ళంటె..నింగి నేలా మురిశాయీ
వయసూ సొగసూ..కలిబోసి రంగవల్లి వేశాయీ
నీకూ నాకూ పెళ్ళంటె..నింగి నేలా మురిశాయీ 

చరణం::2

ఏడడుగులు నడిచావంటే..ఎండమొహం చూడనీయను
వలపు జల్లు తడిసిన..ఒళ్ళూ ఎక్కడ ఆరేసుకోను
ఏడడుగులు నడిచావంటే..ఎండమొహం చూడనీయను
వలపు జల్లు తడిసిన..ఒళ్ళూ ఎక్కడ ఆరేసుకోను 
నాలోనే వేడుందీ..నీ ధోరణి బావుంది
నాలోనే వేడుందీ..నీ ధోరణి బావుంది
ఎండలో వానలా వానలో..హాయిలా  
అలా..అలా..అలా..అలా..అలా        
నీకూ నాకూ పెళ్ళంటె..నింగి నేలా మురిశాయీ
వయసూ సొగసూ కలిబోసి..రంగవల్లి వేశాయీ
నీకూ నాకూ పెళ్ళంటె..నింగి నేలా మురిశాయీ 

చరణం::3

మూడు ముళ్ళూ వేయకముందే..నన్నల్లరి చెయ్యొద్దూ
ఇల్లాలివి కావాలంటే...యివ్వాలి తొలిముద్దూ
ఏమిటి యీ చిలిపితనం..అంతేలే కుర్రతనం 
పూవులో..తేటిలా..తేటిలో.. పాటలా  
అలా..అలా..అలా..అలా..అలా            
నీకూ నాకూ పెళ్ళంటె..నింగి నేలా మురిశాయీ
వయసూ సొగసూ కలిబోసి..రంగవల్లి వేశాయీ
నీకూ నాకూ పెళ్ళంటె..నింగి నేలా మురిశాయీ