Friday, December 21, 2012

అడవి దొంగ--1985



సంగీతం::చక్రవర్తి
రచన::వేటూరి సుందర రామమూర్తి  
గానం::S.P.బాలు, P.సుశీల
తారాగణం::చిరంజీవి,రాధ,శారద 

పల్లవి:
లలలలల్లాలలాలలల..
లలలలలలలలాలలల..
ఆ..ఆ..ఆ..ఆ..
వీరవిక్రమ ధీరదిగ్గజ..నీకే స్వాగతాలు
వీరవిక్రమ ధీరదిగ్గజ..నీకే స్వాగతాలు
వాలుచుపుల వన్నెలాడికి..వయసే అంకితాలు
మహరాజులా మనసేలుకో..మహరాణిలా మనువాడుకో

చరణం::1

లలలలల్లాలలాలలల
లలల..లలల..లలల
వచ్చే వసంతకాలం..విచ్చే సుమాలగంధం
నీకై తపించి..నిన్నే జపించే అందం
కవ్వించు తేనెదీపం..కౌగిళ్ళ ప్రేమశీతం
నేనై చలించి..నిన్నే వరించే బంధం
కొండ అరటిపండు ముద్దంట..నా కొండమల్లి నువ్వంట
రసాల నవరసాల..యమమసాల వేడిలో
లవ్ బాయ్ లా లాలించవా..కౌ బాయ్ లా కవ్వించనా

వీరవిక్రమ ధీరదిగ్గజ..నీకే స్వాగతాలు
వాలుచుపుల వన్నెలాడికి..వయసే అంకితాలు
లలలలల్లాలాలాలల్లాలా

చరణం::2

లలలలల్లాలలాలలల
లల..లల..లల
వాటేయ్యకుంటే పాపం..వయ్యరమెంత శాపం
పూచేటి సోకు..దాచేసుకోకు..నేరం
వలపన్నది ఎంత వేగం..వలవేసి పట్టే మొహం
తీరేది కాదు నురేళ్ల తీపి దాహం

నీ రూపు నాకు చుక్కంట..నా లేత బుగ్గకిమ్మంట
పెట్టించు లగ్గం..ఎట్టించు..ముద్దు పుట్టించే వేళలో
జాంపండుల దొరికవులే..జేమ్స్ బండులా కలిశావులే

వీరవిక్రమ ధీరదిగ్గజ..నీకే స్వాగతాలు
వాలుచుపుల వన్నెలాడికి..వయసే అంకితాలు

చరణం::3

లలలలలలలలలలలలలలలల
లల్లాల..లల్లాల..లలలల
లల్లాల..లల్లాల..లలలల
కౌగిళ్ళు నీకు పంచి..కసి ఈడు కాస్త పెంచే
కవ్వింతలోనే ఒల్లంతా దోచిపోరా
మల్లెల్లో ఇల్లు కట్టో..మసకల్లో కన్ను కొట్టీ
దీపల వేళ తాపలు తీర్చిపోవే
చిలకంటిదాన్ని నేనంట..అలకల్లో ఉంది సోకంతా
తందాన తన తందాన..జత తాళలే సాగనీ
హీరోలకే హీరోవిరా..హీమాన్ లా ప్రేమించనా

వీరవిక్రమ ధీరదిగ్గజ..నీకే స్వాగతాలు
వాలుచుపుల వన్నెలాడికి..వయసే అంకితాలు
మహరాజులా మనసేలుకో..మహరాణిలా మనువాడుకో