Tuesday, October 18, 2011

భక్త తుకారాం--1973


























సంగీత::P. ఆదినారాయణరావు
రచన::వేటూరి
గానం::P. సుశీల
తారాగణం::A.N.R.శివాజీ గణేషన్,అంజలిదేవి,కాంచన,నాగభూషణం,ధూళిపాళ,సాక్షి రంగారావు.

పల్లవి::

ధాన్యలక్ష్మి వచ్చింది..మాయింటికి
మా కరువు తీరింది..ఈనాటికీ 
మా లక్ష్మి వచ్చిం..మాయింటికి
మా కరువు తీరింది..ఈనాటికీ
పాలసంద్రములోన పుట్టిన..నాతల్లి
పాలసంద్రములోన పుట్టిన..నాతల్లి
భాగ్యాలు కరుణించు..ఓ కల్పవల్లి
ధాన్యలక్ష్మి వచ్చింది..మాయింటికి
మా కరువు తీరింది..ఈనాటికీ 

చరణం::1

సువ్వి సువ్వన్నాలె సువ్వన్ననాలె..ఓయమ్మా 
సూరమ్మ మావారు ఎప్పుడొస్తారే..ఆఊ..ఆఊ
ఎన్ని భోగాలున్న ఎంతో భాగ్యమున్న..ఓయమ్మా 
మగనికన్న ఘనము కాదమ్మా..ఆఊ..ఆఊ
పిల్లల ఆకలి తల్లి ఎరుగును కాని..ఓయమ్మా
అడవుల్ల తిరిగే అయ్య ఏమెరుగూ
ఆ అయ్య ఏమెరుగూ..ఆఊ..ఆఊ

చరణం::2

జాజిరి జాజిరి జాజిరి..నీ ఇల్లే కస్తూరి లాహిరి
మా ఇల్లే కస్తూరి లాహిరి 
జాజిరి జాజిరి జాజిరి..నీ ఇల్లే కస్తూరి లాహిరి
మా ఇల్లే కస్తూరి లాహిరి 
చూడబోతే తాను సుందరీ..ఆడమంటే చాలు అల్లరీ
చూడబోతే తాను సుందరీ..ఆడమంటే చాలు అల్లరీ 
కట్టుకున్నవాడు నంగిరీ..సంతానమే బీర పందిరీ
కట్టుకున్నవాడు నంగిరీ..సంతానమే బీర పందిరీ

వండుకున్న అమ్మకు ఆయాసం
దండుకున్నమ్మకు పాయసం
వండుకున్న అమ్మకు ఆయాసం
దండుకున్నమ్మకు పాయసం 
జాజిరి జాజిరి జాజిరి..నీ ఇల్లే కస్తూరి లాహిరి
మా ఇల్లే కస్తూరి లాహిరి

డబ్బుకు లోకం దాసోహం--1973




















సంగీత::K.V.మహదేవన్
రచన::కొసరాజు రాఘవయ్య
గానం::పిఠాపురం నాగేశ్వరరావు,L.R.ఈశ్వరి
తారాగణం::N.T. రామారావు, జమున, S.V. రంగారావు,పద్మనాభం,రేలంగి,రమాప్రభ. 

పల్లవి::

చెప్పాలని ఉన్నది..నీకొక్క మాట
నవ్వు సిగ్గుపడక వింటావా..ముద్దులమూట         
చెప్పాలని ఉన్నది..నీకొక్క మాట
నవ్వు సిగ్గుపడక వింటావా..ముద్దులమూట
హ్హా..చెప్పాలనుకున్నదంత..చెప్పేసెయ్యీ
నువ్వు చెయ్యాలనుకున్నదంతా చేసెసెయ్యీ..సై సై పిల్లా   
ఆహా..చెప్పాలనుకున్నదంత..చెప్పేసెయ్యీ
నువ్వు చెయ్యాలనుకున్నదంతా..చేసెసెయ్యీ   

చరణం::1

వయ్యారిభామ రావె..వగలమరి బుల్లీ రావె
చక్కలిగింతలు పెట్టుకు..సరసమడుకుందామే
వయ్యారిభామ రావె..వగలమరి బుల్లీ రావె
చక్కలిగింతలు పెట్టుకు..సరసమడుకుందామే
ఇద్దరమూ ముచ్చటగ..ముద్దులాడుకుందామే
ఇద్దరమూ ముచ్చటగ..ముద్దులాడుకుందామే
లడ్డులాంటి ముద్దొచ్చే పాపాయిని..కందామె..ఓపిల్లా..ఆ     
చెప్పాలని ఉన్నది..నీకొక్క మాట
నవ్వు సిగ్గుపడక వింటావా..ముద్దులమూట

చరణం::2

లాటరీ బుల్లోడా..లక్కపిడత ముఖమోడ  
నువ్వు చెప్పేదంతగూడ..చిత్రంగ వుంది చూడ
ఓ..హో హో హో హో.. 
లాటరీ బుల్లోడా..లక్కపిడత ముఖమోడ
నువ్వు చెప్పేదంతగూడ..చిత్రంగ వుంది చూడ 
ఇంతలోనె పాపాయిని..ఎక్కణ్ణుంచి తెస్తావు
వివరంగ నాకు చెప్పు..ఏంచేస్తావు
ఇంతలోనె పాపాయిని..ఎక్కణ్ణుంచి తెస్తావు
వివరంగ నాకు చెప్పు..ఏంచేస్తావు
నువ్వేం చేస్తావు..ఓ హో బుల్లోడా 
చెప్పాలనుకున్నదంత..చెప్పేసెయ్యీ
నువ్వు చెయ్యాలనుకున్నదంతా..చేసెసెయ్యీ

చరణం::3

గొపెమ్మవు నీవనుకో..కృష్ణయ్యను నేననుకో
గొపెమ్మవు నీవనుకో..కృష్ణయ్యను నేననుకో
చల్లంగ చెయ్యివేసి..కౌగిట్లో అదుముకో
అబ్బబ్బో నాకేమొ..అంతుబట్టకున్నదీ
చెప్పబోతె నోరురాక..చెప్పబోతె నోరురాక  
చెడ్డ సిగ్గుగున్నదీ..
ఆటల్లో గమ్మత్తులు అన్నీ నీకు..చూపిస్తా
ఆటల్లో గమ్మత్తులు అన్నీ నీకు..చూపిస్తా
మాటల్తో పని ఎందుకు చూస్కో..గుమ్మెత్తిస్తా 
ఆ..హ్హా..ఆఆ          
చెప్పాలని ఉన్నది..నీకొక్క మాట
నవ్వు సిగ్గుపడక వింటావా..ముద్దులమూట
ఆహ్హా..చెప్పాలనుకున్నదంత..చెప్పేసెయ్యీ
నువ్వు చెయ్యాలనుకున్నదంతా..చేసెసెయ్యీ