Tuesday, June 04, 2013

నిప్పులాంటి మనిషి--1974



సంగీతం::చెళ్ళపిళ్ళ సత్యం
రచన::ఆరుద్ర
గానం::S.P.బాలు,S.జానకి
తారాగణం::N.T.రామారావు,సత్యనారాయణ,రాజబాబు,రేలంగి,లత,దేవిక,విజయభాను 

పల్లవి::

ఓరబ్బీ ఓరబ్బీ బంగారు మావా
ఓరంత పొద్దు ఉండంగ రారా
కాసి కాసి కన్నూ వాసెరా 
ఓరి నీయమ్మ కొడక 
కండ్ల నీళ్ళూ రొండ్లాకొచ్చెరా
కండ్ల నీళ్ళూ రొండ్లాకొచ్చెరా  

ఓలమ్మీ ఓలమ్మీ బంగారు చిలక
ఓరంత పొద్దు ఉండంగ వస్తే
ఆ సిగ్గుతో ముడుసుకపోతవే   
ఓ నీయమ్మ కూతుర 
చెంపలే కెంపూలౌతాయే
నీ చెంపలే కెంపూలౌతాయే 

చరణం::1

పొగరుమొతూ వయసు నాదీ 
వగరు వగరు వలపు నాదీ
పొగరుమొతూ వయసు నాదీ 
వగరు వగరు వలపు నాదీ
పొంకమంత పొంగుతుందిరా
నీ పొందులోనా లొంగదీయరా   
నీవారు నీకూ నావారు నాకూ  
నీ వారు నీకు నా వారు నాకు 
లేనే లేరు సై రా సై రా సై రా
ఓరబ్బీ ఓరబ్బీ బంగారు మావా
ఓరంత పొద్దు ఉండంగ రారా
కాసి కాసి కన్నూ వాసెరా 
ఓరి నీయమ్మ కొడక 
కండ్ల నీళ్ళూ రొండ్లాకొచ్చెరా
కండ్ల నీళ్ళూ రొండ్లాకొచ్చెరా  

చరణం::2

జబ్బ మీది పైట జారే 
దబ్బపండు కాయ మెరిసే
జబ్బ మీది పైట జారే 
దబ్బపండు కాయ మెరిసే
అబ్బతోడు మనసు నిలవదే
నా ఆశ దీర ఊసులాడవే  
చిల్లంగి కళ్ళూ చివురాకు ఒళ్ళూ
చిల్లంగి కళ్ళూ చివురాకు ఒళ్ళూ  
సిరిమల్లె శెండు..నీవే నీవే నీవే
ఒలమ్మీ ఒలమ్మీ బంగారు చిలక
ఒరంత పొద్దు ఉండంగ వస్తే
ఆ సిగ్గుతో ముడుసుకపోతవే  
ఓ నీయమ్మ కూతుర 
చెంపలే కెంపూలౌతాయే
నీ చెంపలే కెంపూలౌతాయే 
ఓరబ్బీ ఒరబ్బీ బంగారు మావా
ఒరంత పొద్దు ఉండంగ రారా
కాసి కాసి కన్నూ వాసెరా 
ఓరి నీయమ్మ కొడక 
కండ్ల నీళ్ళూ రొండ్లాకొచ్చెరా
కండ్ల నీళ్ళూ రొండ్లాకొచ్చెరా  

భలే పాప--1971



సంగీతం::R.సుదర్శనం
రచన::అనిశెట్టి 
గానం::P.సుశీల 
తారాగణం::S.V.రంగారావు,K.R.విజయ,బేబి రాణి,జ్యోతిలక్ష్మి,పద్మనాభం,రేలంగి. 

పల్లవి::

చిట్టి పాపా చిరునవ్వుల పాపా
చిట్టి పాపా చిరునవ్వుల పాపా
నా జాబిల్లీ నీవే బంగరు తల్లీ
నా జాబిల్లీ నీవే బంగరు తల్లీ
చిట్టి పాపా చిరునవ్వుల పాపా 

చరణం::1

ముచ్చట తీరా శింగారించేనా
ముచ్చట తీరా శింగారించేనా 
మురిపెం మీరా నిను ముద్దాడేనా 
చిట్టి పాపా చిరునవ్వుల పాపా
చిట్టి పాపా చిరునవ్వుల పాపా

చరణం::2

గోముగ నీకు గోరుముద్దలే తినిపించేనమ్మా
ఒడినే చల్లని ఊయల చేసి లాలించేనమ్మా
గోముగ నీకు గోరుముద్దలే తినిపించేనమ్మా
ఒడినే చల్లని ఊయల చేసి లాలించేనమ్మా
నందనవనమూ నవయవ్వనమూ పువ్వులుగా విరిసే
కలలే చెదిరి కన్న హృదయమే కన్నీరై కురిసే
ఆశలు గొలుపూ ఆ తొలి వలపూ
జీవిత ఫలమూ ఇది ఆ దేవుని వరమూ 
చిట్టి పాపా చిరునవ్వుల పాపా
చిట్టి పాపా చిరునవ్వుల పాపా

చరణం::3

ఆకాశంలో కోటి తారలను భువికే పిలిచేనూ
అనురాగంతో ముద్దు పాపకూ హారతులొసగేనూ
ఆకాశంలో కోటి తారలను భువికే పిలిచేనూ
అనురాగంతో ముద్దు పాపకూ హారతులొసగేనూ
తల్లి దీవెనే కన్నబిడ్డకూ వీడని నీడౌనూ
కల్లా కపటం ఎరుగని వారికి దేవుడే తోడౌనూ
చిట్టి పాపా చిరునవ్వుల పాపా
నా జాబిల్లీ నీవే బంగరు తల్లీ
చిట్టి పాపా చిరునవ్వుల పాపా