Sunday, August 05, 2007

గోపాలుడు భూపాలుడు--1969


సంగీతం:: M.S.P.కోదండపాణి
రచన:: ఆరుద్ర
గానం:: ఘంటసాల,S. జానకి

గొల్ల గోపన్న …. ఒకసారి కలలోకి రావయ్యా
ఒకసారి కలలోకి రావయ్యా
నా ఉవ్విళ్ళు కవ్వించి పోవయ్యా
ఓ గొల్ల గోపయ్యా …

ఒకసారి రాగానే ఏమౌనులే ..
నీ హృదయాన శయనించి ఉంటానులే ..
ఏలుకుంటానులే …
ఒకసారి రాగానే ఏమౌనులే

పగడాల నా మోవి చిగురించెరా ..
మోము చెమరించెరా .. మేను పులకించెరా
సొగసు వేణువు చేసి పలికించరా
సొగసు వేణువు చేసి పలికించరా

కెమ్మోవి పై తేనె ఒలికించనా …
కెమ్మోవి పై తేనె ఒలికించనా
తనివి కలిగించనా .. మనసు కరిగించనా
కేరింతలాడించి సోలించనా … కేరింతలాడించి సోలించనా
ఒకసారి కలలోకి రావయ్యా

ఒంపుసొంపుల మెరుపు మెరిపించవే
వగలు కురిపించవే … మేను మరపించవే
మరపులో మధుకీల రగిలించవే ..
మరపులో మధుకీల రగిలించవే

చిలిపి చూపుల సిగ్గు కలిగిందిరా ..
చిలిపి చూపుల సిగ్గు కలిగిందిరా
మొగ్గ తొడిగిందిరా .. మురిసి విరిసిందిరా
పదును తేలిన వలపు పండించరా
పదును తేలిన వలపు పండించరా

ఒకసారి కలలోకి రావయ్యా
నా ఉవ్విళ్ళు కవ్వించి పోవయ్యా
ఓ గొల్ల గోపయ్యా …
ఒకసారి రాగానే ఏమౌనులే ..

గోపాలుడూ భూపాలుడూ--1969



సంగీతం::SP.కోదండపాణి
రచన::C.నారాయణ రెడ్డి
గానం::ఘంటసాల,P.సుశీల

కోటలోని మొనగాడా....
కోటలోని మొనగాడా.....
వేటకు వచ్చావా
వేటకు వచ్చావా
జింకపిల్ల కోసమో ఇంక దేనికోసమో
జింకపిల్ల కోసమో ఇంక దేనికోసమో

కోటలోని చినదాన....
కోటలోని చినదాన
వేటకు వచ్చనే
వేటకు వచ్చనే
జింకపిల్ల కన్నులున్న చిన్నదాని కోసమ
జింకపిల్ల కన్నులున్న చిన్నదాని కోసమే

ఎలాటి పిల్ల అది ఏపాటి అందమది
ఎలాటి పిల్ల అది ఏపాటి అందమది
ఏ వూరు చిన్నది ఏ కోన వున్నది
ఏ వూరు చిన్నది ఏ కోన వున్నది
చారడు కన్నులది చామంతి వన్నెలది
చారడు కన్నులది చామంతి వన్నెలది
ఏ వూరు ఏమో నా ఎదురుగనే ఉన్నది

కోటలోని మొనగాడా....
కోటలోని మొనగాడా
వేటకు వచ్చావా
వేటకు వచ్చావా
జింకపిల్ల కోసమో ఇంక దేనికోసమో
జింకపిల్ల కోసమో ఇంక దేనికోసమో

కత్తుల వీరునికి కన్నె వలపెందుకో....
జిత్తుల సిపాయికి చెలి వలపెందుకో ....
కత్తుల వీరునికి కన్నె వలపెందుకో
జిత్తుల సిపాయికి చెలి వలపెందుకో
కత్తులు ఒకచేత గుత్తులు ఒకచేత
కత్తులు ఒకచేత గుత్తులు ఒకచేత
నిలిచే బంటునే నీకు తగిన జంటన
నిలిచే బంటునే నీకు తగిన జంటనే

కోటలోని మొనగాడా....
కోటలోని మొనగాడా
వేటకు వచ్చావా
వేటకు వచ్చావా
జింకపిల్ల కోసమో ఇంక దేనికోసమో
జింకపిల్ల కోసమో ఇంక దేనికోసమో
కోటలోని చినదాన...
వేటకు వచ్చనే...వేటకు వచ్చనే
జింకపిల్ల కన్నులున్న చిన్నదాని కోసమే
జింకపిల్ల కన్నులున్న చిన్నదాని కోసమే
!!!!!

శ్రీ కాళహస్తి మహాత్యం--1954



సంగీతం::సుదర్శనం,గోవర్ధనం
రచన::తోలేటి వెంకటరెడ్డి
గానం::ఘంటసాల

Film Director::H.L.N.Simha, 
తారాగణం::రాజ్‌కుమార్(కన్నడ నటుడు),కె.మాలతి,కుమారి,లింగమూర్తి,పద్మనాభం,
రాజసులోచన,ఋష్యేంద్రమణి

రాగములు::అభేరి..హిందోళం..

పల్లవి::

జయ జయ మహాదేవ శంభో హరా శంకరా
సత్య శివ సుందరా నిత్య గంగాధరా

బ్రహ్మ విష్ణుల్ సురల్ తాపసుల్
నిన్ను వర్ణించలేరన్న నేనెంత వాడం దయాసాగరా

భీకరారణ్య మధ్యంబునం బోయనై పుట్టి
పశు పక్షి సంతానముల్ కూల్చి
భక్షించు పాపాత్ముడం

దివ్య జపహోమ తపమంత్ర కృషిలేని జ్ఞానాంధుడం
దేవుడే లేడు లేడంచు దూషించు దుష్టాత్ముడం
దుష్టాత్ముడం
విశ్వరూపా మహామేరుచాపా
జగత్ సృష్టి సంరక్ష సంహార కార్యత్ కలాపా
మహిం పంచ భూతాత్మ వీవే కదా
దేవ దేవా శివా..
పృథ్వి జలవాయు రాకాశ తేజో విలాసా మహేశా ప్రభో..

రంగు బంగారు గంగాతరంగాల రాజిల్లు
కాశీ పురాధీశవిశ్వేశ్వరా
కాశీ పురాధీశవిశ్వేశ్వరా

నీలి మేఘాల కేళీ వినోదాలలో తేలు
శ్రీశైల మల్లేశ్వరా..శ్రీశైల మల్లేశ్వరా

కోటి నదులందు సుస్నానముల్ చేయు
ఫలమిచ్చు క్షేత్రాన నివసించు
శ్రీరామలింగేశ్వరా..శ్రీరామలింగేశ్వరా

నిత్య గోదావరి నృత్య సంగీత నీరాజనాలందు
దాక్షారమావాసభీమేశ్వరా..భీమేశ్వరా..భీమేశ్వరా

దివ్య ఫలపుష్ప సందోహ బృందార్చితానంద
భూలోక కైలాస..శైలాన వసియించు
శ్రీకాళహస్తీశ్వరా..శ్రీకాళహస్తీశ్వరా..
దేవ దేవా..ఆ..నమస్తే నమస్తే నమస్తే నమః

శ్రీ కాళహస్తి మహాత్యం--1954



సంగీతం::R.సుదర్శనం,గోవర్ధనం
రచన::తోలేటి వెంకటరెడ్డి
గానం::ఘంటసాల

ఓం నమ శివాయ..నవనీత హృదయా..సమఃప్రకాశ
తరుణేందు భూషా నమో శంకరా దేవ దేవా

మహేశా పాపవినాశా
కైలాసవాసా ఈశా
నిన్ను నమ్మినాను రావా
నీలకంధరా దేవా

మహేశా పాపవినాశా
కైలాసవాసా ఈశా
నిన్ను నమ్మినాను రావా
నీలకంధరా దేవా

భక్తియేదో పూజలేవో తెలియనైతినే
భక్తియేదో పూజలేవో తెలియనైతినే
పాపమేదో పుణ్యమేదో కాననైతినే దేవా
పాపమేదో పుణ్యమేదో కాననైతినే దేవా

మహేశా పాపవినాశా
కైలాసవాసా ఈశా
నిన్ను నమ్మినాను రావా
నీలకంధరా

మంత్రయుక్త పూజసేయ మనసు కరగునా..ఆ
మంత్రయుక్త పూజసేయ మనసు కరగునా
మంత్రమొ తంత్రమొ ఎరుగనైతినే
మంత్రమొ తంత్రమొ ఎరుగనైతినే
నాదమేదో వేదమేదో తెలియనైతినే
నాదమేదో వేదమేదో తెలియనైతినే
వాదమేల..పేదబాధ తీర్చరావయా స్వామీ
వాదమేల..పేదబాధ తీర్చరావయా స్వామీ

మహేశా పాపవినాశా
కైలాసవాసా ఈశా
నిన్ను నమ్మినాను రావా
నీలకంధరా

ఏకచిత్తమున నమ్మిన వారికి శోకము తీర్తువు రుద్రయ్య
ఏకచిత్తమున నమ్మిన వారికి శోకము తీర్తువు రుద్రయ్య
ప్రాకటముగ చిరువేట చూపి నా ఆకలి తీర్పగ రావయ్య
ప్రాకటముగ చిరువేట చూపి నా ఆకలి తీర్పగ రావయ్య
దీటుగ నమ్మితి గనవయ్య..వేట చూపుమా రుద్రయ్యా
దీటుగ నమ్మితి గనవయ్య..వేట చూపుమా రుద్రయ్యా
వేట చూపుమా రుద్రయ్యా..వేట చూపుమా రుద్రయ్యా
వేట చూపుమా రుద్రయ్యా ..వేట చూపుమా రుద్రయ్యా

శ్రీ కాళహస్తి మహాత్యం--1954



సంగీతం::R.సుదర్శనం
రచన::తోలేటి వెంకటరెడ్డి
గానం::P.సుశీల

Film Director::H.L.N.Simha
తారాగణం::రాజ్‌కుమార్(కన్నడ నటుడు),కె.మాలతి,కుమారి,లింగమూర్తి,పద్మనాభం,
రాజసులోచన,ఋష్యేంద్రమణి

పల్లవి::

శ్రీ పార్వతీదేవి చేకోవె శైలకుమారి

మా పూజలే తల్లి గౌరీ శంకరీ
గౌరీ శంకరీ
శ్రీ పార్వతీదేవి చేకోవె శైలకుమారి
మా పూజలే తల్లి గౌరీ శంకరీ
గౌరీ శంకరీ

చరణం::1

ప్రాపు నీవె పాపహారి పద్మపత్రనేత్రి
ప్రాపు నీవె పాపహారి పద్మపత్రనేత్రి
కాపాడరావమ్మా కాత్యాయినీ
కాపాడరావమ్మా కాత్యాయినీ
శ్రీ పార్వతీదేవి చేకోవె శైలకుమారి
మా పూజలే తల్లి గౌరీ శంకరీ
గౌరీ శంకరీ

చరణం::2

నిన్ను నమ్మినాను తల్లి అన్నపూర్ణదేవీ
నిన్ను నమ్మినాను తల్లి అన్నపూర్ణదేవీ
పాలించరావమ్మా పరమేశ్వరీ
పాలించరావమ్మా పరమేశ్వరీ
శ్రీ పార్వతీదేవి చేకోవె శైలకుమారి
మా పూజలే తల్లి గౌరీ శంకరీ
గౌరీ శంకరీ