Tuesday, December 23, 2014

పొరుగింటి పుల్లకూర--1976


సంగీతం::చక్రవర్తి
రచన::శ్రీశ్రీ 
గానం::V.రామకృష్ణ,బృందం.  
Film Directed By::V.Madhusoodhan Rao
తారాగణం::రామకృష్ణ,కాంచన,మురళీమోహన్,జయచిత్ర,రాజబాబు,మమత,నిర్మల,కాకరాల

పల్లవి::

ఉన్నదానితో..పోరాటం
లేనిదానికై...ఆరాటం
ఉన్నదానితో..పోరాటం
లేనిదానికై...ఆరాటం
ఉన్నది ఒద్దు..లేనిది ముద్దు
ఏదీ ఆశకు...హద్దు

చరణం::1

ఎండమావిలో..నీరు దొరుకునా
గాలిమేడలో..బ్రతుకు సాగునా
ఈవలి గట్టున..మేసే ఆవుకు
ఆవలి గట్టే..ఎంతో పచ్చన
తీరిందా...నీ భ్రమ ఇది
ఫలితం...లేని శ్రమ        
ఉన్నదానితో..పోరాటం
లేనిదానికై...ఆరాటం
ఉన్నది ఒద్దు..లేనిది ముద్దు
ఏదీ ఆశకు...హద్దు

చరణం::2

దూరపు కొండలు..నునుపని తలచి
దగ్గర వారికి..దూరమైతివి
కోరిన సిరులే..ఉరులై పోయెను
చివరకి మిగిలెను..పరితాపం
స్వయంకృతం..నీ అపరాధం
స్వయంకృతం..నీ అపరాధం  
ఉన్నదానితో...పోరాటం
లేనిదానికై...ఆరాటం
ఉన్నది ఒద్దు..లేనిది ముద్దు
ఏదీ ఆశకు...హద్దు

Poruginti Pullakoora--1976
Music::Chakravarti
Lyrics::Sree Sree
Singer's::V.Ramakrishna,Brundam
Film Directed By::V.Madhusoodhan Rao
Cast::Ramakrishna,Kanchana.Muralimohan,Jayachitra,Rajababu,Mamata,Nirmala,Kakaraala.

:::::::::

unnadaanitO..pOraaTam
lEnidaanikai...aaraaTam
unnadaanitO..pOraaTam
lEnidaanikai...aaraaTam
unnadi oddu..lEnidi muddu
Edii aaSaku...haddu

::::1

enDamaavilO..neeru dorukunaa
gaalimEDalO..bratuku saagunaa
eevali gaTTuna..mEsE aavuku
aavali gaTTE..entO pachchana
teerindaa...nee bhrama idi
phalitam...lEni Srama        
unnadaanitO..pOraaTam
lEnidaanikai...aaraaTam
unnadi oddu..lEnidi muddu
Edee aaSaku...haddu

::::2

doorapu konDalu..nunupani talachi
daggara vaariki..dooramaitivi
kOrina sirulE..urulai pOyenu
chivaraki migilenu..paritaapam
swayamkRtam..nee aparaadham
swayamkRtam..nee aparaadham  
unnadaanitO...pOraaTam
lEnidaanikai...aaraaTam
unnadi oddu..lEnidi muddu
Edee aaSaku...haddu

పొరుగింటి పుల్లకూర--1976



సంగీతం::చక్రవర్తి
రచన::వేటూరిసుందరరామమూర్తి
గానం::P.సుశీల
Film Directed By::V.Madhusoodhan Rao
తారాగణం::రామకృష్ణ,కాంచన,మురళీమోహన్,జయచిత్ర,రాజబాబు,మమత,నిర్మల,కాకరాల

పల్లవి::

చుక్కలలో దిక్కులలో..ఈ రేయి
పాడింది మా పెళ్ళి..సన్నాయి
చుక్కలలో దిక్కులలో..ఈ రేయి
పాడింది మా పెళ్ళి..సన్నాయి
చెలరేగెను తీయని..పులకింత
వెన్నెలకూడా...వేడివేడిగా
వెన్నెలకూడా...వేడివేడిగా
ఆరడిపెట్టి...గారడిచేస్తే 
ఏమైపోనమ్మా..నేనేమైపోనమ్మా
చుక్కలలో దిక్కులలో..ఈ రేయి
పాడింది మా పెళ్ళి..సన్నాయి

చరణం::1

వెళ్ళొస్తానన్నది..కన్నెతనం
వచ్చేశానన్నది..కలికితనం
వెళ్ళొస్తానన్నది..కన్నెతనం
వచ్చేశానన్నది..కలికితనం 
వెళ్ళు మరీ..ఊ వెళ్ళుమరి
అన్నదమ్మా..పడుచుతనం
వెళ్ళలేక...ఉండలేక
వెళ్ళలేక...ఉండలేక
ఉన్నచోట..నిలువలేక
తుళ్ళి తుళ్ళి..పడిందీ ఆడతనం 
చుక్కలలో దిక్కులలో..ఈ రేయి
పాడింది మా పెళ్ళి..సన్నాయి

చరణం::2

వయసొచ్చిన పిల్లకీ..వలపే అందం
వలపు కానుకే...బంధం
మనసిచ్చిన వేళ మాటే మంత్రం
అదే..మంగళ సూత్రం
కలలుగనీ...మనసుపడీ
కలలుగనీ...మనసుపడీ 
కౌగిలిలో....కరగాలని
ఎదురు చూచీ..నిదురకాచీ
ఎదురు చూచీ..నిదురకాచీ 
ఆ రూపే మది..నిలిపిన
కన్నె మనసే..కళ్యాణ మంటపం  
    
చుక్కలలో దిక్కులలో..ఈ రేయి
పాడింది మా పెళ్ళి..సన్నాయి
చెలరేగెను తీయని..పులకింత
వెన్నెలకూడా...వేడివేడిగా
వెన్నెలకూడా...వేడివేడిగా
ఆరడిపెట్టి....గారడిచేస్తే 
ఏమైపోనమ్మా..నేనేమైపోనమ్మా

Poruginti Pullakoora--1976
Music::Chakravarti
Lyrics::Veturisundararammoorti
Singer's::P.Suseela
Film Directed By::V.Madhusoodhan Rao
Cast::Ramakrishna,Kanchana.Muralimohan,Jayachitra,Rajababu,Mamata,Nirmala,Kakaraala.

:::::::::

chukkalalO dikkulalO..ii rEyi
paaDindi maa peLLi..sannaayi
chukkalalO dikkulalO..ii rEyi
paaDindi maa peLLi..sannaayi
chelarEgenu teeyani..pulakinta
vennelakooDaa...vEDivEDigaa
vennelakooDaa...vEDivEDigaa
aaraDipeTTi...gaaraDichEstE 
EmaipOnammaa..nEnEmaipOnammaa
chukkalalO dikkulalO..ii rEyi
paaDindi maa peLLi..sannaayi

::::1

veLLostaanannadi..kannetanam
vachchESaanannadi..kalikitanam
veLLostaanannadi..kannetanam
vachchESaanannadi..kalikitanam 
veLLu marii..uu veLLumari
annadammaa..paDuchutanam
veLLalEka...unDalEka
veLLalEka...unDalEka
unnachOTa..niluvalEka
tuLLi tuLLi..paDindee aaDatanam 
chukkalalO dikkulalO..ii rEyi
paaDindi maa peLLi..sannaayi

::::2

vayasochchina pillakii..valapE andam
valapu kaanukE...bandham
manasichchina vELa maaTE mantram
adE..mangaLa sootram
kalaluganii...manasupaDii
kalaluganii...manasupaDii 
kaugililO....karagaalanii
eduru choochii..nidurakaachii
eduru choochii..nidurakaachii 
aa roopE madi..nilipina
kanne manasE..kaLyaaNa manTapam 
    
chukkalalO dikkulalO..ii rEyi
paaDindi maa peLLi..sannaayi
chelarEgenu teeyani..pulakinta
vennelakooDaa...vEDivEDigaa
vennelakooDaa...vEDivEDigaa
aaraDipeTTi....gaaraDichEstE 
EmaipOnammaa..nEnEmaipOnammaa