Sunday, May 24, 2009

రామయ్య తండ్రి--1975


సంగీతం::సత్యం
రచన::మల్లెమాల
గానం::S.P.బాలు 
తారాగణం::సత్యనారయణ,రంగనాద్,రాజబాబు,ముక్కామల,జయంతి,ప్రభ,
మీనాకుమారి,పండరీబాయి 

పల్లవి::

హోయ్..హోయ్..హోయ్
టిక్కుటక్కుల..చక్కెర బొమ్మా
ఎన్నివగలూ నేర్చావమ్మా
వన్నె చిన్నెల చిలకమ్మా..ఒక్కసారి నవ్వమ్మా
హేయ్..వన్నె చిన్నెల చిలకమ్మా..ఒక్కసారి నవ్వమ్మా

చరణం::1

ఆడే పాడే బంగరు బొమ్మకు..ఈడూ జోడూ కుదిరిందీ
మీనం మేషం లెక్కిస్తుంటే..సమయం జారిపోతుందీ
హారిలో హారి యంటూ..అందాలు జుర్రుకుంటూ 
హారిలో హారి యంటూ..అందాలు జుర్రుకుంటూ
రాత్రంతా శివరాత్రి...చేద్దామే..ఏహేయ్   
టిక్కుటక్కుల చక్కెర బొమ్మా
ఎన్నివగలూ నేర్చావమ్మా
వన్నె చిన్నెల చిలకమ్మా..ఒక్కసారి నవ్వమ్మా
వన్నె చిన్నెల చిలకమ్మా..ఒక్కసారి నవ్వమ్మా

చరణం::2

మొన్న రాతిరి చందమామలో..నిన్నే చూసుకున్నానే
హోయ్..నిన్న రాతిరి నిద్దరలోన..నీకే తాళి కట్టానే
తందాన తానా అంటు..తైతక్కలాడుకుంటూ
తందాన తానా అంటు..తైతక్కలాడుకుంటూ
చక చక్క చక్క చక్క..వుందామే..ఏహేయ్..                
టిక్కుటక్కుల..చక్కెర బొమ్మా
ఎన్నివగలూ..నేర్చావమ్మా
వన్నె చిన్నెల చిలకమ్మా..ఒక్కసారి నవ్వమ్మా
ఓ..వన్నె చిన్నెల చిలకమ్మా..ఒక్కసారి నవ్వమ్మా