Friday, April 24, 2015

అమెరికా అల్లుడు--1985


సంగీతం::చక్రవర్తి 
రచన::వీటూరి  
గానం::P.సుశీల 

పల్లవి::

నా వాలుజడ కృష్ణవేణి
నా పూలజడ వెన్నెల గోదారి
నా ఒళ్లు గంగమ్మ పరవళ్లుగా 
నర్తన చేసిన రతిని భారతిని
కూచిపూడి భారతికి హారతిని..భారతిని

చరణం::1

ఏ జన్మలో మల్లెపూ
పూజ చేశానో కుంద రదనైనాను
ఏనాటి కార్తీక దీపాల వెలుగో
ఇందువదననైనాను
అమరావతి బౌద్ధ ఆరామ శిల్పాల
వైరాగ్య భావాల దీకావిరంగు
ఈ చీర చెంగు
మమత సమత మతమై వెలసిన
మధుర భారతి వీణను నెరజాణను నేను

చరణం::2

ఈ నాల్గువేదాల పాఠాలు
విన్నానో హంసగమననైనాను
ఏ నాసికత్వాల వాదాలు విన్నానో
గగన జఘననైనాను
క్షేత్రయ్య పదకీర్తనావేశ నాట్యాల
రాజ్యాలలో చిందు నా కాలి చిందు
మీ కళ్లవిందు
శ్రుతికి లయకి సుతనై పుట్టిన
మధుర భారతి వీణను నెరజాణను నేను

నాలుగు స్తంబాలాట--1982


సంగీతం::రాజన్-నాగేద్ర 
రచన::వీటూరి  
గానం::P.సుశీల 

పల్లవి::

దొరల నీకు కనుల నీరు 
దొరలదీ..లోకం 
మగదొరలదీ..లోకం
కనులలోనే దాచుకోవే కడలిలా శోకం 
కన్నె పడుచులా శోకం

చరణం::1

నాల్గు దిక్కులా నడుమ పుట్టి నలిగిపోయే జగతిలో 
నాల్గు దిక్కులా నడుమ పుట్టి నలిగిపోయే జగతిలో
నాలుగు పాదాల ధర్మం..నడువలేని ప్రగతిలో 
నాలుగు స్తంభాలాట..ఆడ బ్రతుకు తెలుసుకో
దొరల నీకు కనుల నీరు 
దొరలదీ..లోకం 
మగదొరలదీ..లోకం
కనులలోనే దాచుకోవే కడలిలా శోకం 

చరణం::2

వెన్నెలే కరువైన నాడు నింగి నిండా చుక్కలే 
వెన్నెలే కరువైన నాడు నింగి నిండా చుక్కలే
కన్నెగానే తల్లివైతే..కంటి నిండా చుక్కలే 
నాల్గు మొగముల బ్రహ్మ రాసిన 
ఖర్మ...నీకిది తెలుసుకో
దొరల నీకు కనుల నీరు 
దొరలదీ..లోకం 
మగదొరలదీ..లోకం
కనులలోనే దాచుకోవే కడలిలా శోకం 

చరణం::3

కలవని తీరాల నడుమ గంగాలాగా కదిలిపో 
అమ్మగా ఒక జన్మనిచ్చి అవని నీవై మిగిలిపో
నాలుగు వేదాలసారం అనుభవంలో తెలుసుకో
దొరల నీకు కనుల నీరు 
దొరలదీ..లోకం 
మగదొరలదీ..లోకం
కనులలోనే దాచుకోవే కడలిలా శోకం 
మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్