Tuesday, June 03, 2014

చక్రవాకం--1974



సంగీతం::K.V.మహాదేవన్
రచన::ఆత్రేయ
గానం::P.సుశీల
తారాగణం::శోభన్‌బాబు,వాణిశ్రీ,S.V.రంగారావు,చంద్రకళ,నాగభూషణం,అంజలీదేవి,పద్మనాభం

పల్లవి::

ఆ..హా..ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ 
వీణలోనా..తీగలోనా..ఎక్కడున్నది అపశృతి
అది ఎలాగైనది..విషాద గీతి    
వీణలోనా..తీగలోనా..ఎక్కడున్నది అపశృతి
అది ఎలాగైనది విషాద గీతి..వీణలోనా..తీగలోనా           

చరణం::1

వెతికి వచ్చిన తీగతో..నా వీణనే ముడివేసుకొంటిని
వెతికి వచ్చిన తీగతో..నా వీణనే ముడివేసుకొంటిని 
వెలితి రాదని కలిసి పాడితిని..వెలితి రాదని కలిసి పాడితిని
నేడే వికల వీణగా..మిగిలిపోతిని
వీణలోనా..తీగలోనా..ఎక్కడున్నది అపశృతి..ఈ  

చరణం::2

రాగమున ఒక స్వరము..మారిన 
వలపు పాటే..కలత పాటగును  
రాగమున ఒక స్వరము..మారిన 
వలపు పాటే..కలత పాటగును
అనురాగమున..అపశృతి పలికిన
అనురాగమున..అపశృతి పలికిన
కన్నీటిలో..కల కరిగిపోవును           
వీణలోనా..తీగలోనా..ఎక్కడున్నది..అపశృతి     

చరణం::3

గాలిలోనా గాలినై..కలసిపోతాను
నీ గానమై నే నందులోనే..నిలిచిపోతాను
మట్టిలోనా మట్టినై..మాసిపోతాను
నీ మనసులోని..మమతగానే బ్రతికి ఉంటాను
వీణలోనా తీగలోనా..ఎక్కడున్నది అపశృతి..