సంగీత::అశ్వద్థామ
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::P.సుశీల
తారాగణం::శోభన్ బాబు,గుమ్మడి,రాజబాబు,సావిత్రి,విజయనిర్మల,విజయలలిత,మీనాకుమారి
పల్లవి::
పండిత నెహ్రూ...పుట్టినరోజూ
పాపలందరికి...పుట్టినరోజూ
మమతా సమతా..పుట్టినరోజూ
మంచికి కోవెల కట్టిన..రోజూ
పండిత నెహ్రూ..పుట్టినరోజూ
పాపలందరికి...పుట్టినరోజూ
చరణం::1
ముత్యంలాంటి మొతీలాలుకు..రత్నంలా జన్మించాడూ
జాతిరత్నమై వెలిగీ..ఇంకొక జాతి రత్నమును కన్నాడూ
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
అతడే జవహర్ లాలూ..అతనికి మన జేజేలూ
అతడే జవహర్ లాలూ..అతనికి మన జేజేలూ
పండిత నెహ్రూ పుట్టినరోజూ..పాపలందరికి పుట్టినరోజూ
చరణం::2
తలపై తెల్లని టోపీ..ఎదపై ఎర్ర గులాబీ
తలపై తెల్లని టోపీ..ఎదపై ఎర్ర గులాబీ
పెదవులపై చిరునవ్వూ..మదిలో పున్నవి పువ్వూ
చేతిలో పావురం..మన జాతికి అతడే గొపురం
చేతిలో పావురం..మన జాతికి అతడే గొపురం
పండిత నెహ్రూ...పుట్టినరోజూ
పాపలందరికి...పుట్టినరోజూ
చరణం::3
మహాత్మ గాంధీ...అడుగుజాడలో
స్వరాజ్య సమరం...నడిపాడూ
రణ దాహంతో...రగిలే జగతిని
శాంతి సుధలు...కురిపించాడూ
కన్ను మూసినా..జవహర్ లాల్కం
కంటి పాపగా...ఉన్నాడూ
ఇంటింట జ్యోతిగా...ఉన్నాడూ
చాచా నెహ్రూ...అమర్ రహే
చాచా నెహ్రూ అమర్ రహే..అమర్ రహే
No comments:
Post a Comment