Saturday, August 10, 2013

డబ్బు డబ్బు డబ్బు--1981



సంగీతం::శ్యామ్
రచన::వీటూరి
గానం::S.జానకి
తారాగణం::మురళిమోహన్,రాధిక,మోహన్‌బాబు,ప్రతాప్‌పోతన్,ప్రభ,రాజసులోచన,నిర్మల,నూతన్‌ప్రసాద్, 

పల్లవి::

కుహు కుహూ..ఊఊఊఊఊఊఊ
కూసే..కోయిల నాతో నీవు వచ్చావని
నీతో వసంతాలు తెచ్చావని 
బాగుందట జంటా బాగుందట
పండాలట మన ప్రేమే పండాలట
కుహు కుహూ..ఊఊఊఊఊఊఊ
కుహు కుహూ..ఊఊఊఊఊఊఊ

చరణం::1

నీడగ నీ వెంట నే జీవించాలంట..ఓఓఓఓ..బావా
నీడగ నీ వెంట నే జీవించాలంట..ఓఓఓఓ..బావా
నీ హృదయంలోన మరుమల్లెల వాన
నీ హృదయంలోన మరుమల్లెల వాన
కురిసి మురిసి పులకించాలంటా
కురిసి మురిసి పులకించాలంటా
కుహు కుహూ..ఊఊఊఊఊఊఊ
కుహు కుహూ..ఊఊఊఊఊఊఊ

చరణం::2

గుండెల గుడిలోన..నా దైవం నీవంటా..ఓఓఓ..బావా
గుండెల గుడిలోన..నా దైవం నీవంటా..ఓఓఓ..బావా
నీ కన్నుల వెలిగే..హారతి నేనంటా
నీ కన్నుల వెలిగే..హారతి నేనంటా
కలసి మెలసి తరియించాలంటా
కలసి మెలసి తరియించాలంటా
కుహు కుహూ..ఊఊఊఊఊఊఊ
కూసే కోయిల..నాతో నీవు వచ్చావని
నీతో వసంతాలు తెచ్చావని
బాగుందట జంటా బాగుందట
పండాలట మన ప్రేమే పండాలటా
కుహు కుహూ..ఊఊఊఊఊఊఊ
కుహు కుహూ..ఊఊఊఊఊఊఊ
కుహు కుహూ..ఊఊఊఊఊఊఊ