Thursday, March 24, 2011

ఏదిపాపం - ఏది పుణ్యం--1979

































సంగీతం::సత్యం
రచన::
గానం::S.P.బాలు , P.సుశీల 
తారాగణం::చంద్రమోహన్,మాధవి 

పల్లవి::

ఎయ్యేళ్ళుగ వెతుకు తున్నది ఎవ్వరికోసం 
నా పైనే సూపు నిలిపే ఒక్కరి కోసం

వెయ్యేళ్ళుగ వెతుకు తున్నది..ఆ ఆ
ఎయ్యేళ్ళుగ ఎవ్వరి కోసం..ఆ..
నా పైనే సూపు నిలిపే ఒక్కరి కోసం
మనిషిగ బ్రతికేది ఎవ్వరి కోసం
మనిషిగ బ్రతికేది ఎవ్వరి కోసం
కడదాక తోడు నడిపే..నీడ కోసం

ఎయ్యేళ్ళుగ వెతుకు తున్నది ఎవ్వరికోసం 
నా పైనే సూపు నిలిపే ఒక్కరి కోసం

ఆ ఆ ఆ ఆ ఆహా..ఆహా..ఆ ఆ ఆ
ఓ ఓ ఓ ఓ హో..ఆ ఆ ఆ ఆహా..

చరణం::1

సెలఏటి కౌగిటిలో..పడవ ఇమిడిపోతాది
పడవ తనను చేరంగా..ఏరు పొంగి పోతాదీ

సెలఏటి కౌగిటిలో..పడవ ఇమిడిపోతాది
పడవ తనను చేరంగా..ఏరు పొంగి పోతాదీ

మరుజన్మకు నేను నీవు..ఏరు పడవ కావాలా
మరుజన్మకు నువ్వు నేను..ఏరు పడవ కావాలా 
ఎరంతా చేరుకోనీ..తీరానికి చేరాలా

ఎయ్యేళ్ళుగ వెతుకు తున్నది ఎవ్వరికోసం 
నా పైనే సూపు నిలిపే ఒక్కరి కోసం

చరణం::2

ఒకరి కొకరు ఊ కొడుతూ..కథలు సెప్పుకోవాలా
ఒకరి నొకరు జో కొడుతూ..ఆదమరచి పోవాలా

ఒకరి కొకరు ఊ కొడుతూ..కథలు సెప్పుకోవాలా
ఒకరి నొకరు జో కొడుతూ..ఆదమరచి పోవాలా

పెదవైన విప్పకుండ..మనసు తెలుపుకోవాలా
పెదవైన విప్పకుండ..మనసు తెలుపుకోవాలా

మనల్ని చూసి లోకమంతా..వలపు నేరుచుకోవాలా

ఎయ్యేళ్ళుగ వెతుకు తున్నది ఎవ్వరికోసం 
నా పైనే సూపు నిలిపే ఒక్కరి కోసం
మనిషిగ బ్రతికేది ఎవ్వరి కోసం
కడదాక తోడు నడిపే..నీడ కోసం

ఎయ్యేళ్ళుగ వెతుకు తున్నది ఎవ్వరికోసం 
నా పైనే సూపు నిలిపే ఒక్కరి కోసం 
ఆ ఆ ఆ ఆ ఆహా..ఆహా..ఆ ఆ ఆ
ఓ ఓ ఓ ఓ హో..ఆ ఆ ఆ ఆహా..మ్మ్ మ్మ్ మ్మ్ 



Edi paapam Edi punyam--1979
Music::Satyam
Singer's::baalu suSeela 
Cast::chandramOhan,maadhavi 

::1

eyyELLuga vetuku tunnadi evvarikOsam 
naa painE soopu nilipE okkari kOsam

veyyELLuga vetuku tunnadi..aa aa
eyyELLuga evvari kOsam..aa..
naa painE soopu nilipE okkari kOsam
manishiga bratikEdi evvari kOsam
manishiga bratikEdi evvari kOsam
kaDadaaka tODu naDipE..neeDa kOsam

eyyELLuga vetuku tunnadi evvarikOsam 
naa painE soopu nilipE okkari kOsam

aa aa aa aa aahaa..aahaa..aa aa aa
O O O O hO..aa aa aa aahaa..

::2

selaETi kougiTilO..paDava imiDipOtaadi
paDava tananu chErangaa..Eru pongi pOtaadii

selaETi kougiTilO..paDava imiDipOtaadi
paDava tananu chErangaa..Eru pongi pOtaadii

marujanmaku nEnu neevu..Eru paDava kaavaalaa
marujanmaku nuvvu nEnu..Eru paDava kaavaalaa 
erantaa chErukOnii..teeraaniki chEraalaa

eyyELLuga vetuku tunnadi evvarikOsam 
naa painE soopu nilipE okkari kOsam

::3

okari kokaru U koDutU..kathalu seppukOvaalaa
okari nokaru jO koDutU..aadamarachi pOvaalaa

okari kokaru U koDutU..kathalu seppukOvaalaa
okari nokaru jO koDutU..aadamarachi pOvaalaa

pedavaina vippakunDa..manasu telupukOvaalaa
pedavaina vippakunDa..manasu telupukOvaalaa

manalni chUsi lOkamantaa..valapu nEruchukOvaalaa

eyyELLuga vetuku tunnadi evvarikOsam 
naa painE soopu nilipE okkari kOsam
manishiga bratikEdi evvari kOsam
kaDadaaka tODu naDipE..neeDa kOsam

eyyELLuga vetuku tunnadi evvarikOsam 
naa painE soopu nilipE okkari kOsam 
aa aa aa aa aahaa..aahaa..aa aa aa
O O O O hO..aa aa aa aahaa..mm mm mm 

నిండు మనిషి--1978


















సంగీతం::సత్యం
రచన::D.C.నారాయణరెడ్డి 
గానం::S.P.బాలు,P.సుశీల 
తారాగణం::శోభన్ బాబు, జయచిత్ర

పల్లవి:: 

ఇంతటి సొగసే..ఎదురగ ఉంటే
తుంటరి మనసే..ఏ..తొందర పెడితే
ఏమీ అనుకోకు..ఆ హా..ఏమీ అనుకోకు

ఇంతటి సొగసే ఎదురగ ఉంటే
ఇరువురు నడుమా..ఏ..తెరలే ఉంటే
ఏమీ అనుకోకు..హాయ్..ఏమీ అనుకోకు
  
చరణం::1

లేత లేత పొంగులేమో..లేనిపోని అల్లరి చేస్తే
ఏపులోన ఉన్న నేను..ఎలా ఊరుకోను
ఆ..ఆ..లేత లేత పొంగులేమో..లేనిపోని అల్లరి చేస్తే
ఏపులోన ఉన్న నేను..ఎలా ఊరుకోను

వద్దు వద్దు..ఇప్పుడొద్దు
ముందు ముందూ..ఉందీ విందు..ఊ..
ఏమీ అనుకోకు..ఏమీ అనుకోకు

ఇంతటి సొగసే..ఏ..ఎదురగ ఉంటే..ఏ
ఇరువురు నడుమా..తెరలే ఉంటే..ఏ
ఏమీ అనుకోకు..హాయ్..ఏమీ అనుకోకు
  
చరణం::2

చిన్నవాని కౌగిలిలోనా..కన్నె వయసుకాగుతుంటే
ఎన్ని ఎన్ని తెరలో ఉన్నా..ఎలా ఆగిపోను..ఆ హా
చిన్నవాని కౌగిలిలోనా..కన్నె వయసు కాగుతుంటే
ఎన్ని ఎన్ని తెరలో ఉన్నా..ఎలా ఆగిపోను..ఊ

వద్దు వద్దు..ఆగవద్దు
ఇచ్చుకోవా..ఆ..ఒక్క ముద్దు
ఏమీ అనుకోకు..హా..ఆ..ఏమీ అనుకోకు

ఇంతటి సొగసే..ఏ..ఎదురగ ఉంటే..ఏ ఏ 
తుంటరి మనసే..ఏ..తొందర పెడితే..ఏ ఏ 
హహహా..ఏమీ అనుకోకు..ఏమీ అనుకోకు
ఏమీ అనుకోకు..హ్హా..ఏమీ అనుకోకు 

Nindu Manishi--1978
Music::Satyam
Lyrics::sinaare
Singer's::S.P.Baalu,P.Suseela
CAST::Sobhan Babu, Jayachithra

:::

intaTi sogasE..E..eduraga unTE
tunTari manasE..E..tondara peDitE
eemee anukOku..aa haa..eemee anukOku

intaTi sogasE..E..eduraga unTE
iruvuru naDumaa..E..teralE unTE
eemee anukOku..haay..eemee anukOku
  
:::1

leta leta pongulemO..lenipOni allari cheste
eepulOna unna nenu..elaa oorukOnu..aa..aa
leta leta pongulemO..lenipOni allari cheste
eepulOna unna nenu..elaa oorukOnu

vaddu vaddu..ippuDoddu
mundu mundoo..undee vindu..U
eemee anukOku..eemee anukOku

intaTi sogasE..E..eduraga uMTE..E
iruvuru naDumaa..teralE unTE..E
eemee anukOku..haay..eemee anukOku
  
:::2

chinnavaani kaugililOnaa..kanne vayasukaagutunTE
enni enni teralO unnaa..elaa aagipOnu..aa haa
chinnavaani kaugililOnaa..kanne vayasu kaagutunTE
enni enni teralO unnaa..elaa aagipOnu..U

vaddu vaddu..aagavaddu
ichchukOvaa..aa..okka muddu
eemee anukOku..haa..aa..eemee anukOku

intaTi sogasE..E..eduraga uMTE..E E 
tunTari manasE..E..tondara peDitE..E E 
hahahaa..eemee anukOku..eemee anukOku
eemee anukOku..hhaa..eemee anukOku 

నేరం నాది కాదు ఆకలిది--1976

























సంగీతం::సత్యం
రచన::సినారె
గానం::S.P.బాలు
తారాగణం::N.T.రామారావు,మంజుల,లత, మురళీమోహన్, గుమ్మడి

పల్లవి::

మంచిని సమాధి చేస్తారా
ఇది మనుషులు చేసే పని యేనా
మనలో పాపం చేయని వాడు..ఎవడో చెప్పండి
ఏ దోషం లేని వాడు..ఎవడో చూపండి

మంచిని సమాధి చేస్తారా..ఇది మనుషులు చేసే పనియేనా
మనలో పాపం చేయని వాడు..ఎవడో చెప్పండి
ఏ దోషం లేని వాడు..ఎవడో చూపండి

చరణం::1

కత్తితో చేధించనిది కరుణతో..చేధించాలి
కక్షతో కానిది క్షమాభిక్షతో..సాధించాలి

తెలిసీ తెలీయక కాలు జారితే..ఏ..ఏ..ఏ..ఏ
తెలిసీ తెలియక కాలు జారితే..చేయూతనిచ్చి నిలపాలీ  

మనలో కాలు జారని వారు..ఎవరో చెప్పండి
లోపాలు లేని వారు..ఎవరో చూపండి
మంచిని సమాధి చేస్తారా..ఇది మనుషులు చేసే పనియేనా
మనలో పాపం చేయని వాడు..ఎవడో చెప్పండి
ఏ దోషం లేని వాడు..ఎవడో చూపండి


చరణం::2

గుడులలో లింగాలను మింగే..బడా భక్తులు కొందరు
ముసుగులో మోసాలు చేసే..మహా వ్యక్తులు కొందరు

ఆకలి తీరక నేరం చేసే..ఏ..ఏ..ఏ..ఏ
ఆకలి తీరక నేరం చేసే..అభాగ్యజీవులు కొందరూ 

మనలో నేరం చేయని వాడూ..ఎవడో చెప్పండి
ఏ దోషం లేని వాడు..ఎవడో చూపండి

మంచిని సమాధి చేస్తారా..ఇది మనుషులు చేసే పనియేనా
మనలో పాపం చేయని వాడు..ఎవడో చెప్పండి
ఏ దోషం లేని వాడు..ఎవడో చూపండి

చరణం::3

తప్పు చేసిన ఈ దోషిని..ఇప్పుడే శిక్షించాలి
మరపురాని గుణపాఠం..పదిమందిలో నేర్పించాలి

హ..హ..హ..ఐతే

ఎన్నడు పాపం చేయని వాడు..ఊ..ఊ..ఊ
ఎన్నడు పాపం చేయని వాడు..ముందుగ రాయి విసరాలి

మీలో పాపం చేయని వాడే..ఆ రాయి విసరాలి
ఏ లోపం లేని వాడే..ఆ శిక్ష విధించాలి

మంచిని సమాధి చేస్తారా..ఇది మనుషులు చేసే పనియేనా
మనలో పాపం చేయని వాడు..ఎవడో చెప్పండి
ఏ దోషం లేని వాడు ఎవడో చూపండి

Neram Naadi Kaadu Akalidi--1976
Music::Satyam
Lyrics::sinaare
Singer's::S.P.Baalu
cast::N.T.RaamaaRao, Manjula,Latha,MuraliMohan,Gummad

:::

manchini samaadhi..chestaaraa
idi manushulu chese..pani yenaa
manalO paapam cheyani vaaDu..evaDO cheppanDi
ee dOsham leni vaaDu..evaDO choopanDi

manchini samaadhi..chestaaraa
idi manushulu chese..pani yenaa
manalO paapam cheyani vaaDu..evaDO cheppanDi
ee dOsham leni vaaDu..evaDO choopanDi

:::1

kattitO chedhinchanidi karunatO..chedhinchaali
kakshatO kaanidi kshamaabhikshatO..saadhinchaali

telisee teleeyaka kaalu jaarite..E..E..E..E
telisee teliyaka kaalu jaaritae..chaeyootanichchi nilapaalee  

manalO kaalu jaarani vaaru..evarO cheppaMDi
lOpaalu laeni vaaru..evarO choopaMDi
manchini samaadhi chEstaaraa..
idi manushulu chaesae paniyaenaa
manalO paapam cheyani vaaDu..evaDO cheppanDi
ee dOsham lEni vaaDu..evaDO choopanDi


:::2

guDulalO lingaalanu minge..baDaa bhaktulu kondaru
musugulO mOsaalu chese..mahaa vyaktulu kondaru

aakali teeraka nEram chese..E..E..E..E
aakali teeraka nEram chese..abhaagyajeevulu kondaroo 

manalO nEram cheyani vaaDoo..evaDO cheppanDi
ee dOsham lEni vaaDu..evaDO choopanDi

manchini samaadhi..chEstaaraa
idi manushulu chese..pani yenaa
manalO paapam cheyani vaaDu..evaDO cheppanDi
ee dOsham lEni vaaDu..evaDO choopanDi

:::3

tappu chesina ee dOshini..ippuDE Sikshinchaali
marapuraani gunapaaTham..padimandilO nerpinchaali

ha..ha..ha..aitE

ennaDu paapam cheyani vaaDu..O..O..O
ennaDu paapam cheyani vaaDu..munduga raayi visaraali

meelO paapam cheyani vaaDe..aa raayi visaraali
ee lOpam leni vaaDe..aa Siksha vidhinchaali

manchini samaadhi..chestaaraa
idi manushulu chese..pani yenaa
manalO paapam cheyani vaaDu..evaDO cheppanDi
ee dOsham leni vaaDu..evaDO choopanDi

ప్రేమలేఖలు--1977
























సంగీతం::సత్యం
రచన::దాశరథి
గానం::రామకృష్ణ, సుశీల
తారాగణం::మరళీమోహన్,అనంతనాగ్,సత్యనారాయణ,జగ్గయ్య,జయసుధ,దీప,
అల్లు రామలింగయ్య

పల్లవి::

ఈనాటి విడరాని బంధం..మనకేనాడో వేశాడు దైవం
ఈనాటి విడరాని బంధం..నేను ఏనాడో చేసిన పుణ్యం
అ..హ..హ..అహ..ఆ..ఆ
ఆ..హా..ఆహ..ఆహ..ఆ

చరణం::1

నీలాలు మెరిసే నీ కళ్ళలోనా నిలిచింది నా రూపమే
నీలాలు మెరిసే నీ కళ్ళలోనా నిలిచింది నా రూపమే
నాలోని ప్రేమ నీ పాద సీమా విరిసింది సిరిమల్లెగా

ఈనాటి విడరాని బంధం..నేను ఏనాడో చేసిన పుణ్యం

చరణం::2

సొగసెంతొ కలిగే సుగుణాల వెలిగే సతి తోడు కుదిరిందిలే
సొగసెంతొ కలిగే సుగుణాల వెలిగే సతి తోడు కుదిరిందిలే
మదిలోన దాచి.. మనసార వలిచి..పతి నీడ దొరికిందిలే

ఈనాటి విడరాని బంధం..నేను ఏనాడో చేసిన పుణ్యం

Prema Lekhalu--1977
Music::Satyam
Lyrics::Dasarathi
Singer's::Ramakrishna,P.Suseela