Thursday, December 02, 2010

రైతుకుటుంబం--1972




సంగీత::T.చలపతిరావ్ 
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::ఘంటసాల
తారాగణం::అక్కినేని, కాంచన,పద్మనాభం,రామకృష్ణ, అంజలీదేవి,గీతాంజలి,సత్యనారాయణ

పల్లవి::

ఈ మట్టిలోనే పుట్టాము
ఈ మట్టిలోనే పెరిగాము
ఈ మట్టిని మించిన దైవం లేదు
మట్టే మెతుకురా..ఈ మట్టే బతుకురా 

ఈ మట్టిలోనే పుట్టాము
ఈ మట్టిలోనే పెరిగాము
ఈ మట్టిని మించిన దైవం లేదు
మట్టే మెతుకురా..ఈ మట్టే బతుకురా  
మట్టే మెతుకురా..ఈ మట్టే బతుకురా

చరణం::1

బీడుపడ్డ బంజరునేల
మేడిపట్టి రమ్మంటుంది
మేడిపట్టి...రమ్మంటుంది
అర్రుసాచి...కోడెగిత్త
కర్రు మునగ దున్నుతుంది
ఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓ
కర్రు మునగ..దున్నుతుంది
బీడుపడ్డ..బంజరునేల
మేడిపట్టి..రమ్మంటుంది
అర్రుసాచి...కోడెగిత్త
కర్రు మునగ దున్నుతుంది 
నీరుపోసి...నారువేసి
కలుపుతీసి...సాగుచేసి
నీరుపోసి...నారువేసి
కలుపుతీసి...సాగుచేసి
బంగారపు...రాసులు 
యెన్నో...పండించాలిరా
ప్రజలకందించాలిరా    

ఈ మట్టిలోనే...పుట్టాము
ఈ మట్టిలోనే...పెరిగాము
ఈ మట్టిని మించిన దైవం లేదు
మట్టే మెతుకురా..ఈ మట్టే బతుకురా  
మట్టే మెతుకురా..ఈ మట్టే బతుకురా

చరణం::2

ఎంత చెమట...ధారపోస్తే
ఈ పచ్చని పైరు పండెరా
ఆఆ ఆఆ ఆఆ ఆఆ ఆఆ ఆఆ ఆఆ 
ఎంతనెత్తురావిరైతే
ఈ ఫలితం..చేతికందెరా
ఆఆ ఆఆ ఆఆ ఆఆ ఆఆ ఆఆ ఆఆ 
ఎంత చెమట ధారపోస్తే
ఈ పచ్చని పైరు పండెరా
ఎంతనెత్తురావిరైతే
ఈ ఫలితం..చేతికందెరా
గట్టుమీద..కూరుచుంటే
పొట్ట నింపువాడెవడురా
గట్టుమీద..కూరుచుంటే
పొట్ట నింపువాడెవడురా
రాజ్యాలే తలకిందైనా
రైతే....మిగులురా
మన జాతే...వెలుగురా 
               
ఈ మట్టిలోనే...పుట్టాము
ఈ మట్టిలోనే...పెరిగాము
ఈ మట్టిని మించిన దైవం లేదు
మట్టే మెతుకురా..ఈ మట్టే బతుకురా  

చరణం::3

కలిసి మెలిసి..బతికిననాడే
కష్టాలే...తొలగునులేరా
కలలన్నీ...పండునులేరా
పల్లెసీమ...చల్లగవుంటే
ప్రపంచమే..నిలుచునులేరా
ప్రగతి జగతి..నిండునులేరా
ఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓ..హోయ్
కలిసి మెలిసి..బతికిననాడే
కష్టాలే...తొలగునులేరా
పల్లెసీమ...చల్లగవుంటే
ప్రపంచమే...నిలుచునులేరా 
పదుగురికీ..కలిమిని పంచీ
అందరిలో..చెలిమినిపెంచీ
పదుగురికీ..కలిమిని పంచీ
అందరిలో...చెలిమినిపెంచీ 
తన గడ్డను...తీరిచిదిద్దే
మనిషె...మనిషిరా
ఆ మనసే...మనసురా  
                    
ఈ మట్టిలోనే...పుట్టాము
ఈ మట్టిలోనే...పెరిగాము
ఈ మట్టిని మించిన దైవం లేదు
మట్టే మెతుకురా..ఈ మట్టే బతుకురా  
ఈ మట్టే మెతుకురా..ఈ మట్టే బతుకురా
ఈ మట్టే మెతుకురా..ఈ మట్టే బతుకురా 

రైతుకుటుంబం--1972




సంగీత::T.చలపతిరావ్ 
రచన::దాశరథి
గానం::ఘంటసాల,T.R.జయదేవ్,శరావతి.
తారాగణం::అక్కినేని, కాంచన,పద్మనాభం,రామకృష్ణ, అంజలీదేవి,గీతాంజలి,సత్యనారాయణ

పల్లవి::

అమ్మా అమ్మా..చల్లని మా అమ్మా 
ఓ త్యాగమయీ అనురాగమయీ..మా అమ్మా
అమ్మా అమ్మా చల్లని..మా అమ్మా..అమ్మా

చరణం::1

కన్న తల్లినే ఎరుగములే..మే మెరుగములె
మము పెంచిన తల్లివి...నీవేలే
అమ్మను మించిన అమ్మవులే మా అమ్మవులే
ఆ దేవుని మించిన...దేవతవే
అమ్మను మించిన అమ్మవులే మా అమ్మవులే 
ఆ దేవుని మించిన...దేవతవే
ఓ త్యాగమయి అనురాగమయీ..మా అమ్మా  
అమ్మా అమ్మా చల్లని మా అమ్మా..అమ్మా

చరణం::2

ఎవరో దేవుడు ఎందుకులే..మా కెందుకులే
మా పాలిట దైవము...నీవేలే
మమతలు పొంగే...హృదయములో
నీ హృదయములో..మా స్వర్గాలన్నీ ఉన్నవిలే 
మమతలు పొంగే...హృదయములో
నీ హృదయములో..మా స్వర్గాలన్నీ ఉన్నవిలే 
ఓ త్యాగమయీ అనురాగమయి..మా అమ్మా
అమ్మా అమ్మా..చల్లని మా అమ్మా
ఓ త్యాగమయీ అనురాగమయీ..మా అమ్మా
అమ్మా...అమ్మా..ఆఆఅ