Saturday, December 18, 2010

దొరికితే దొంగలు--1965























సంగీతం::సాలూరి రాజేశ్వర రావు
రచన::C.నారాయణ రెడ్డి
గానం::ఘంటసాల,P.సుశీల

పల్లవి::

ఎగురుతున్నది..యవ్వనమూ
సొగసులొలికెను..జీవనమూ
కలలు పిలిచే..కనులు పలికే
కదలే వలపు..వాహనమూ

ఎగురుతున్నది..యవ్వనమూ
సొగసులొలికెను..జీవనమూ
కలలు పిలిచే..కనులు పలికే
కదలే వలపు..వాహనమూ

చరణం::1

నగర వీధులు..దాటితిమీ
గగన వీణలు..మీటితిమీ
నగర వీధులు..దాటితిమీ
గగన వీణలు..మీటితిమీ

సగము నీవై..సగము నేనై
బిగువుగా..జతగూడితిమి

ఎగురుతున్నది..యవ్వనమూ
సొగసులొలికెను..జీవనమూ
కలలు పిలిచే..కనులు పలికే
కదలే వలపు..వాహనమూ

చరణం::2

మబ్బుతెరలే..పానుపులూ
మంచుపొదలే..షాలువలూ
మబ్బుతెరలే..పానుపులూ
మంచుపొదలే..షాలువలూ 

తళుకు లొలికీ..తారలే నీ
కులుకు జడలో మల్లియలు

ఎగురుతున్నది..యవ్వనమూ
సొగసులొలికెను..జీవనమూ
కలలు పిలిచే..కనులు పలికే
కదలే వలపు..వాహనమూ

చరణం::3

ఇంద్రధనువును..వంచెదమూ
అహ..హా..ఆ..
చందమామను..దించెదమూ
అహ..హా..ఆ..
ఇంద్రధనువును..వంచెదమూ
చందమామను..దించెదమూ

నేల నుండీ..ఓహో..
నింగిదాకా..ఆహా..
పూలవంతెన..వేసేదమూ

ఎగురుతున్నది..యవ్వనమూ
సొగసులొలికెను..జీవనమూ
కలలు పిలిచే..కనులు పలికే
కదలే వలపు..వాహనమూ
అహహహా..ఆహహా..

Dorikithe Dongalu--1965
Music::Saluri Rajeswara Rao
Lyricis::C.Narayana Reddy
Singer::Ghantasala,Suseela 

:::

:::

egurutunnadi..yavvanamoo
sogasulolikenu..jeevanamoo
kalalu pilichE..kanulu palikE
kadalE valapu..vaahanamoo

egurutunnadi..yavvanamoo
sogasulolikenu..jeevanamoo
kalalu pilichE..kanulu palikE
kadalE valapu..vaahanamoo

:::1

nagara veedhulu..daaTitimii
gagana veeNalu..meeTitimii
nagara veedhulu..daaTitimii
gagana veeNalu..meeTitimii

sagamu neevai..sagamu nEnai
biguvugaa..jatagooDitimi

egurutunnadi..yavvanamoo
sogasulolikenu..jeevanamoo
kalalu pilichE..kanulu palikE
kadalE valapu..vaahanamoo

:::2

mabbuteralE..paanupuloo
manchupodalE..shaaluvaloo
mabbuteralE..paanupuloo
manchupodalE..shaaluvaloo 

taLuku lolikii..taaralE nee
kuluku jaDalO malliyalu

egurutunnadi..yavvanamoo
sogasulolikenu..jeevanamoo
kalalu pilichE..kanulu palikE
kadalE valapu..vaahanamoo

:::3

indradhanuvunu..vanchedamoo
aha..haa..aa..
chandamaamanu..dinchedamoo
aha..haa..aa..
indradhanuvunu..vanchedamoo
chandamaamanu..dinchedamoo

nEla nunDii..OhO..
ningidaakaa..aahaa..
poolavantena..vEsEdamoo

egurutunnadi..yavvanamoo
sogasulolikenu..jeevanamoo
kalalu pilichE..kanulu palikE
kadalE valapu..vaahanamoo
ahahahaa..aahahaa..

శ్రీమంతుడు--1971











విశ్వభారతి ప్రొడక్షన్స్ వారి
శ్రీమంతుడు--1971
నిర్మాత::G. రాధాకృష్ణమూర్తి
దర్శకత్వం::K. ప్రత్యగాత్మ
సంగీతం::T.చలపతిరావ్
రచన::దాశరధి
గానం::P.సుశీల
తారాగణం::అక్కినేని, జమున,గుమ్మడి,సూర్యకాంతం,రాజబాబు

పల్లవి::

చల్లని వెన్నెలలో..నా ఒడిలో నిదురపో
అల్లరి మానుకొని..నా మదిలో ఒదిగిపో

చల్లని వెన్నెలలో..నా ఒడిలో నిదురపో
అల్లరి మానుకొని..నా మదిలో ఒదిగిపో


చరణం::1

కలతలు పోవాలనీ..తొలకరి రావాలనీ
వలపుల జల్లులో..బ్రతుకులు పండాలనీ
వేచిన కన్నులతో..వేసారి ఉన్నాను

చల్లని వెన్నెలలో..నా ఒడిలో నిదురపో
అల్లరి మానుకొని..నా మదిలో ఒదిగిపో

చరణం::2

మమతల ఉయ్యాలలో..మనసులు ఊగాలనీ
మల్లెలపందిరిలో..మనువులు కూడాలనీ
ఒదిగే ఉండనీ..కొంగుచాచి అడిగేను

చల్లని వెన్నెలలో..నా ఒడిలో నిదురపో
అల్లరి మానుకొని..నా మదిలో ఒదిగిపో

చరణం::3

నీ కన్నులరేకులలో..నిండుకలలు పూయాలనీ
వాడని ఆ కలలలో..నా నీడ చూచుకోవాలనీ
ఎన్నెన్నో ఆశలతో..ఇన్నాళ్ళు ఉన్నాన్ను..

చల్లని వెన్నెలలో..నా ఒడిలో నిదురపో
అల్లరి మానుకొని..నా మదిలో ఒదిగిపో

శ్రీమంతుడు--1971











సంగీతం::T.V.చలపతిరావ్
రచన::దాశరధి
గానం::ఘంటసాల 

పల్లవి::


ఆహా ఏమందము..ఓహో ఈ చందము
నీ తీయని పెదవుల..తొణికే మధువులు నావే హ్హే..

ఆహా ఏమందము..ఓహో ఈ చందము
నీ తీయని పెదవుల తొణికే మధువులు నావే..ర్రా..

చరణం::1

చిన్నారి చిలకలెన్నో చేరాయి కోరి నన్ను..హహహా అయితేనేం
అందాల రామ చిలక..అలరించె నేడు నన్ను
ఈ బింకము ఈ పొంకము..ఈ బింకము ఈ పొంకము
ఏనాడు చూడ లేదే..ఏహేహే..                     
ఏమందము..ఓహోహో..ఈ చందము 
నీ తీయని పెదవుల తొణికే మధువులు నావే..హ్హ..

చరణం::2

నీ దారి చూచి చూచి..నిను కోరి వేచి వేచి 
నీ దారి చూచి చూచి..నిను కోరి వేచి వేచి
మనసేలనో చెలరేగెను..మనసేలనో చెలరేగెను
నే నిలువలేను రావే..హ్హాహ్హహ్హా..                     

ఏమందము..ఓహోహో..ఈ చందము 
నీ తీయని పెదవుల తొణికే మధువులు నావే..హ్హ.. 

చరణం::3

అరచాటు పైటలోన..అరమోడ్పు కనులలోన 
అరచాటు పైటలోన..అరమోడ్పు కనులలోన
ఆ వంపులు ఆ సొంపులు..ఆ వంపులు ఆ సొంపులు
నే తాళలేను రావే..ర్రా..

శ్రీమంతుడు--1971











సంగీతం::T.V.చలపతిరావ్
రచన::దాశరధి
గానం::ఘంటసాల కోరస్

పల్లవి::

ఎంతో చిన్నది జీవితం..ఇంకా చిన్నది యౌవనం 
ఎంతో చిన్నది జీవితం..ఇంకా చిన్నది యౌవనం
అనుభవించరా..జీవితం
ఆగదు ఆగదు ఆగదు ఆగదు యౌవనం               
ఎంతో చిన్నది జీవితం..ఇంకా చిన్నది యౌవనం

చరణం::1

ప్రతి నిమిశం విలువైనది..ప్రతి మగువ సొగసైనది
రోజొక తాజా రోజాపై..మోజు పడేదే యౌవనం
అనుభవించరా..అనుభవించరా జీవితం
ఆగదు ఆగదు ఆగదు ఆగదు యౌవనం               
ఎంతో చిన్నది జీవితం ఇంకా చిన్నది యౌవనం

చరణం::2

మమతలు నీలో పెంచకు ..బ్రమలో  కాలం గడపకు 
మమతలు నీలో పెంచకు ..బ్రమలో కాలం గడపకు
మమతలు నీలో పెంచకు ..బ్రమలో  కాలం గడపకు 
మమతలు నీలో పెంచకు ..బ్రమలో కాలం గడపకు
ఎవరికి వారే తెలుసుకో..యమునా తీరే కలుసుకో
అనుభవించరా..ఆ..అనుభవించరా జీవితం 
ఆగదు ఆగదు ఆగదు ఆగదు యౌవనం               
ఎంతో చిన్నది జీవితం..ఇంకా చిన్నది యౌవనం

చరణం::3

హాయిగా జీవించేందుకు..వెనకా ముందు ఎందుకు
లలలలలలలలలాలలాఓహో..
మధువులు నిండిన అధరం..అన్నిటిలో అతి మధురము
అనుభవించరా..ఆ..అనుభవించరా జీవితం
ఆగదు ఆగదు ఆగదు ఆగదు యౌవనం

రోజులు మారాయి--1955








సంగీతం::మాస్టర్ వేణు
రచన::తాపీ ధర్మారావు
గానం::ఘంటసాల, జిక్కి

పల్లవి::

ఇదియే హాయి..కలుపుము చేయి..
వేయి మాటలేలనింక..వేయి మాటలేలనింక..ఓఓఓ 
ఇదియే హాయి..కలుపుము చేయి..

ఇదియే హాయి..కలుపుము చేయి..
వేయి మాటలేలనింక..వేయి మాటలేలనింక..ఓఓఓ 
ఇదియే హాయి..కలుపుము చేయి..

చరణం::1

ఓఓఓఓ ఆ చూపులోనే కురియును తేనె 
చిరునగవాహా వెలుగున వాలి
మనసుకు హాయి సోలునే..ఓఓఓ..  
మనసుకు హాయి సోలునే....... 
నీవాడిన మాట..సాటిలేని పూలబాట
సాటిలేని పూలబాట..ఓఓఓఓఓఓ..
ఇదియే హాయి..కలుపుము చేయి..

చరణం::2

అందాలలోన నడివడిలోన
తొలుతను నీవే తెలియగరావే
బ్రతుకున మేలు చూపవే..ఓఓఓఓ..
బ్రతుకున మేలు చూపవే........
నీ చూపే చాలు అదే నాకు వేనవేలు
అదే నాకు వేనవేలు..ఓఓఓఓ..
ఇదియే హాయి..కలుపుము చేయి..

చరణం::3

ఈ లోకమేమో మరో లోకమేమో
మనసులతోనే తనువులు తేలే
బ్రతుకిక తూగుటూయలే..ఓఓఓ
బ్రతుకిక తూగుటూయలే.....
ఈనాటి ప్రేమ..లోటులేని మేటి సీమ
లోటులేని..మేటి సీమ..ఓఓఓఓఓ 

ఇదియే హాయి..కలుపుము చేయి..
వేయి మాటలేలనింక..వేయి మాటలేలనింక..ఓఓఓ 
ఇదియే హాయి..కలుపుము చేయి..

నమ్మినబంటు--1960







సంగీతం::S.రాజేశ్వరరావు
రచన::కోసరాజు
గానం::ఘంటసాల , P.సుశీల

పల్లవి::
ఆఆఆఆఆఆఆఆఆఆఆఆ 
ఎంత మంచి వాడవురా 
ఎన్ని నోళ్ళ పొగడుదురా
ఎంత మంచి వాడవురా 
ఎన్ని నోళ్ళ పొగడుదురా

ఎంత మంచి వాడవురా
ఎన్ని నోళ్ళ పొగడుదురా
ఎటుల నిన్ను వీడుదురా
ఎటుల నిన్ను వీడుదురా
ఎంత మంచి వాడవురా 
ఎన్ని నోళ్ళ పొగడుదురా


ఎంత మంచిదానవే
పొరపాటు గ్రహించితివే
ఎంత మంచిదానవే
పొరపాటు గ్రహించితివే
నా ప్రేమ హరించితివే 
నా ప్రేమ హరించితివే
ఎంత మంచిదానవే
పొరపాటు గ్రహించితివే
ఆఆఆఆఆఆఆఆఆఆఆఆ 

చరణం::1

ఆ...
మనసులోన కోవెలగట్టి
మల్లెపూల అంజలిబట్టి 
మనసులోన కోవెలగట్టి
మల్లెపూల అంజలిబట్టి
నిను నిత్యము పూజింతునురా 
నీ కథలే స్మరియింతునురా 
నిను నిత్యము పూజింతునురా 
నీ కథలే స్మరియింతునురా
ఎంత మంచి వాడవురా 
ఎన్ని నోళ్ళ పొగడుదురా
ఆఆఆఆఆఆఆఆఆఆఆఆ

చరణం::2

నీ పూజా సుమములు బెట్టి
రకరకాల దండలు గట్టి
నీ మెడలో వేసెదనే
నాదానిగ జేసేదనే

ఎంత మంచిదానవే
పొరపాటు గ్రహించితివే

కలలే నిజమాయెనులే
జీవితమే మారెనులే
ఇద్దరము చూపులు కలిపి
ఏకంగా పోదములే 
ఇద్దరము చూపులు కలిపి
ఏకంగా పోదములే
ఆఆఆఆఆఆఆఆఆఆఆఆ

చక్రపాణి--1954


సంగీతం::P.భానుమతి
రచన::రావూరి సత్యనారాయణ 
గానం::A.M.రాజా

పల్లవి::

ఓ..ప్రియురాల..ఓ..జవరాల..పలుకవేల నాతో
ఓ..ప్రియురాల..ఓ..జవరాల
ఓ..ప్రియురాల..ఓ..జవరాల..పలుకవేలనే నాతో
ఓ..ప్రియురాల..ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ

చరణం::1

వెన్నెల సెలయేరున విరబూసిన
వెన్నెల సెలయేరున విరబూసిన 
కలువవు నీవేనే జవరాల
కలువవు నీవేనే జవరాల
నా మదిలో డోలలూగరావే..ఓ ప్రియురాల

చరణం::2

మిన్నుల పువుదోటల..విహరించే
మిన్నుల పువుదోటల..విహరించే 
కిన్నెర నీవేనే..జవరాల
కిన్నెర నీవేనే..జవరాల
నా..మదిలో.....
నా..మదిలో..వీణ మీటరావే
నా..మదిలో వీణ మీటరావే..ఓ ప్రియురాల

చరణం::3

పొన్నల నీడలలో..నడయాడెడి
పొన్నల నీడలలో..నడయాడెడి 
నెమలివి నీవేనే..జవరాల
నెమలివి నీవేనే..జవరాల
నా..మదిలో.....
నా..మదిలో..నాట్యమాడరావే
నా..మదిలో..నాట్యమాడరావే
ఓ..ప్రియురాల..ఓ..జవరాల..పలుకవేల నాతో..ఓ..ప్రియురాల..