Saturday, May 09, 2015

జీవిత చక్రం--1971





సంగీతం::శంకర్-జైకిషాన్  
రచన::ఆరుద్ర
గానం::ఘంటసాల
తారాగణం::N.T.రామారావు,వాణిశ్రీ,శారద,నాగయ్య,రేలంగి,పద్మనాభం,హేమలత

పల్లవి:: 

కంటిచూపు చెపుతోంది కొంటెనవ్వు చెపుతోంది 
మూగమనసులో మాట..ఓ పిల్లా
కంటిచూపు చెపుతోంది కొంటెనవ్వు చెపుతోంది 
మూగమనసులో మాట..ఓ పిల్లా
ఆశలూ దాచకూ..ఆశలూ దాచకూ
కంటిచూపు చెపుతోంది కొంటెనవ్వు చెపుతోంది 
మూగమనసులో మాట..ఓ పిల్లా ఓ పిల్లా

చరణం::1

ఆడపిల్లా..పూలతీగె ఒక్కలాగె చక్కనైనవి
ఆడపిల్లా..పూలతీగె ఒక్కలాగె చక్కనైనవి 
ఆడపిల్లా పూలతీగే ఒక్కలాగే అండ కోరుకుంటాయి..ఆహా     
అందమైన మగవాడు..పొందుకోరి వచ్చాడు 
ఎందుకలా చూస్తావు..ఓ పిల్లా
స్నేహమూ చేయవా..స్నేహమూ చేయవా....   
కంటిచూపు చెపుతోంది..కొంటెనవ్వు చెపుతోంది  
మూగమనసులో మాట..ఓ పిల్లా ఓ పిల్లా

చరణం::2

కొమ్మమీద గోరువంక..రామచిలుక జోడు కూడె 
కొమ్మమీద గోరువంక..రామచిలుక జోడు కూడె
కొమ్మమీద గోరువంక రామచిలుక ముద్దుపెట్టుకున్నాయి..ఆహా 
మెత్తనైన మనసు నీది..కొత్త చిగురు వేసింది 
మత్తులోన మునిగింది..ఓ పిల్లా..మైకమూ పెంచుకో 
కంటిచూపు చెపుతోంది..కొంటెనవ్వు చెపుతోంది 
మూగమనసులో మాట..ఓ పిల్లా..ఓ పిల్లా

చరణం::3

చెప్పలేని వింత వింత..అనుభవాలు విరగబూసె
చెప్పలేని వింత వింత..అనుభవాలు విరగబూసె , 
చెప్పలేని వింత వింత అనుభవాలు ఎదురుచూస్తున్నాయి..ఆహా
నువ్వు నన్ను చేరాలి..నేను మనసు యివ్వాలి 
ఎడము లేక వుండాలి..ఓ పిల్లా..ఆ 
కంటిచూపు చెపుతోంది..కొంటెనవ్వు చెపుతోంది 
మూగమనసులో మాట..ఓ పిల్లా..ఓ పిల్లా
వస్తావా..మురిపిస్తావా..వస్తావా..మురిపిస్తావా
కంటిచూపు చెపుతోంది..కొంటెనవ్వు చెపుతోంది
మూగమనసులో మాట..ఓ పిల్లా
వస్తావా..మురిపిస్తావా..వస్తావా..మురిపిస్తావా