Sunday, March 29, 2015

భక్త కన్నప్ప--1976


http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=4017
సంగీతం::సత్యం
రచన::ఆరుద్ర
గానం::V.రామకృష్ణ,P.సుశీల
తారాగణం::కృష్ణంరాజు,వాణిశ్రీ,శ్రీధర్,జయమాలిని,రావు గోపాలరావు,బాలయ్య,ప్రభాకరరెడ్డి

పల్లవి::

కండ గెలిచింది..కన్నె దొరికింది
గుండె పొంగిందిరా..ఆఆ..హోయ్‌
మాత పలికింది మనువు కలిపింది
మనసు గెలిచిందిరా..ఆఆఆ   
హైరా మా దొరగారికి..వీరగంధాలు
సైరా మా దొరసానికి..పారిజాతాలు
హైరా మా దొరగారికి..వీరగంధాలు
సైరా మా దొరసానికి..పారిజాతాలు
తప్పెట్లో తాళాలో..బాజాలో జేజేలో                        
హైరా మా దొరగారికి..వీరగంధాలు
సైరా మా దొరసానికి..పారిజాతాలు

చరణం::1

హ్హ హ్హ హ్హ హహహ హ్హ హ్హ హ్హ హహహ 
ఆ ఆ ఆ ఆ ఉయ్ ఉయ్ ఉయ్
ఆ ఆ ఆ ఆ ఉయ్ ఉయ్ ఉయ్ ఊయ్య్   

ధిమిం ధిమిం..ధిమి భేరీ ధ్వనులు
తెలిపెనురా...నా గెలుపునే..ఏఏఏఏఏ 
ఘలం ఘలల..చిరుగజ్జెల మోతలు
పలికెనురా...నా నా వలపునే..ఏఏఏ
ధిమిం ధిమిం..ధిమి భేరీ ధ్వనులు
తెలిపెనురా...నా గెలుపునే..ఏఏ
ఘలం ఘలల చిరుగజ్జెల మోతలు
పలికెనురా నా వలపునే..ఏఏ 
అల్లె తాళ్ళ ఠంకారాలే..ఏఏ 
అల్లె తాళ్ళ ఠంకారాలే..ఏఏ 
జయందొరా..అని పడెనులే
నల్లత్రాచు..వాలు జడలే
ఆ పాటకూ..సయ్యడెనులే   
    
హోయ్..కండ గెలిచింది...కన్నె దొరికింది
గుండె పొంగిందిరా..ఓఓఓ..హోయ్‌
మాత పలికింది..మనువు కలిపింది
మనసు...గెలిచిందిరా..ఆఆఅ 
హైరా మా దొరగారికి..వీరగంధాలు
సైరా మా దొరసానికి..పారిజాతాలు 

చరణం::2

నేరేడు చెట్టుకాడ నాఱేడు మాటేసి..ఉయ్ 
రేడు చెట్టుకాడ..నాఱేడు మాటేసి..హా హా   
చారెడేసి కళ్ళతోటి..బారెడేసి బాణమేసి
చారెడేసి కళ్ళతోటి..బారెడేసి బాణమేసి
బాణమేసి నా ప్రాణం..తోడేస్తుంటే..ఏఏఏఏ
బాణమేసి నా ప్రాణం..తోడేస్తుంటే
ఓయమ్మో...ఓలమ్మో ఓయబ్బో 
ఓయమ్మో..నీ ప్రాణం తోడేస్తుంటే

ఎంతా చక్కని కన్నూ..ఊ..ఎంతా చల్లని చూపూ..ఊ
ఎంతా చక్కని కన్నూ..ఎంతా చల్లని చూపూ
ఇంతకన్న...ఇంకేమి కావాలి  
నా బతుకంతా..ఇలా వుండిపోవాలి
  
హైరా మా దొరగారికి..వీరగంధాలు
సైరా మా దొరసానికి..పారిజాతాలు
తప్పెట్లో తాళాలో..బాజాలో..జేజేలో                        
హైరా మా దొరగారికి..వీరగంధాలు
సైరా మా దొరసానికి..పారిజాతాలు

Friday, March 27, 2015

సంబరాల రాంబాబు--1970::ఖమాస్::రాగం


సంగీతం::V.కుమార్ 
రచన::రాజశ్రీ
గానం::S.P.బాలు,P.సుశీల 
తారాగణం::చలం,శారద,S.V. రంగారావు,గీతాంజలి,రేలంగి,సూర్యకాంతం,పద్మనాభం    
ఖమాస్::రాగం  పల్లవి::

మామా..ఆ..చందమామా..ఆ..వినరావా నా కథ

మామా చందమామా..వినరావా నా కథ
వింటే మనసు ఉంటే..కలిసేవూ నా జత..ఆఆఆ 
మామా..చందమామా..ఆ 

చరణం::1

నీ రూపము ఒక దీపము..గతిలేని పేదకు 
నీ రూపము ఒక దీపము..గతిలేని పేదకు 

నీ కళలే సాటిలేని..పాఠాలు ప్రేమకు
నువు లేక నువు రాక..విడలేవు కలువలు 
జాబిల్లి నీ హాయి..పాపలకు జోలలు 

మామా చందమామా..వినరావా నా కథ
వింటే మనసు ఉంటే..కలిసేవూ నా జత..ఆఆఆ 
మామా..చందమామా..ఆ

చరణం::2

మింటిపైన నీవు ఓంటిగాడివై..అందరికీ వెన్నెల పంచ
రేయంత తిరగాలి
ఇంటిలోన నేను ఒంటిగాడినై..అందరికీ సేవలు చేయ
రేయి పవలు తిరగాలి

లేరు మనకు బంధువులు..లేరు తల్లిదండ్రులు
లేరు మనకు బంధువులు..లేరు తల్లిదండ్రులు
మనను చూసి అయ్యోపాపం..అనేవారు ఎవ్వరు
అనేవారు...ఎవ్వరు

మామా చందమామా..వినరావా నా కథ
వింటే మనసు ఉంటే..కలిసేవూ నా జత..ఆఆఆ 
మామా..చందమామా..ఆ

సంబరాల రాంబాబు--1970
సంగీతం::V.కుమార్ 
రచన::రాజశ్రీ
గానం::పిఠాపురం,P.సుశీల 
తారాగణం::చలం,శారద,S.V. రంగారావు,గీతాంజలి,రేలంగి,సూర్యకాంతం,పద్మనాభం    

పల్లవి::

పొరుగింటి మీనాక్షమ్మను..చూసారా
వాళ్ళ ఆయన చేసే ముద్దు ముచ్చట విన్నారా 
మిమ్మల్నే 
పొరుగింటి మీనాక్షమ్మను..చూసారా
వాళ్ళ ఆయన చేసే ముద్దు ముచ్చట విన్నారా 

పగలంతా ఇద్దరకూ..తగవులు ఎన్నున్నా 
పగలంతా ఇద్దరకూ..తగవులు ఎన్నున్నా 
చీకటి పడితే పక్కకి చేరి..రాజీ కొస్తాడు
కోరిన చీరలు ఇస్తాడు 

పొరుగింటి మీనాక్షమ్మను..చూసారా
వాళ్ళ ఆయన చేసే ముద్దు ముచ్చట విన్నారా 


పొరుగింటి పుల్లయ్య గొడవ..ఎందుకు లేవే 
వాడికి జీతం కంటే గీతం ఎక్కువ..తెలుసుకోవే 
ఆండాళ్ళూ 
పొరుగింటి పుల్లయ్య గొడవ..ఎందుకు లేవే 
వాడికి జీతం కంటే గీతం ఎక్కువ..తెలుసుకోవే 

తప్పని సరిగా ప్రతి సినిమాకు..వెళతావూ ముందే 
తప్పని సరిగా ప్రతి సినిమాకు..వెళతావూ ముందే 
జీతం కాస్తా సినిమాకైతే..మిగిలిదేముందే?
చీరకు..మిగిలేదేముందే  

పొరుగింటి పుల్లయ్య గొడవ..ఎందుకు లేవే 
వాడికి జీతం కంటే గీతం ఎక్కువ..తెలుసుకోవే 

చరణం::1

పెళ్ళై మూడు ఏళ్ళు గడిచినా పొందిందేమిటి ఆండాళ్ళు 
పెళ్ళై మూడు ఏళ్ళు గడిచినా పొందిందేమిటి ఆండాళ్ళు 
తల్లీ తండ్రీ ప్రేమ గుర్తు గా పుట్టెను బుల్లి నామాలు
తల్లీ తండ్రీ ప్రేమ గుర్తు గా పుట్టెను బుల్లి నామాలు
వగలను చూపిస్తారే గాని నగలెపుడైనా పెట్టారా
వగలను చూపిస్తారే గాని నగలెపుడైనా పెట్టారా
ఓ ముత్యాల బేసరి ఇచ్చి ముక్కుకి అందం తెచ్చారా 
నా ముక్కుకి అందం తెచ్చారా 
ఉద్యోగం ఒక మెట్టు దాటనీ కోరినదిస్తా నీకూ
ఇష్టం లేదని చెప్ప కూడదా ఎందుకు లెండి సాకు..హూ..హూ    

పొరుగింటి మీనాక్షమ్మను చూసారా
వాళ్ళ ఆయన చేసే ముద్దు ముచ్చట విన్నారా 

చరణం::2 

మాటలతోటీ రెచ్చ గొట్టకే నన్నూ..ఊ
బెదిరింపులకు లొంగే దాన్ని కానూ..ఊ
కోపం వస్తే మనిషిని కాను నేనూ..ఊ

ఏం చేస్తారు..?
చెవులు మెలేస్తా....ఇంకేంచేస్తారు?
దుంప తెంపేస్తా....ఆ తరువాతా!! 
తాట వొలుస్తా....హా హ హ హా  

పొరుగింటి మీనాక్షమ్మను..చూసారా
వాళ్ళ ఆయన చేసే..ముద్దు ముచ్చట విన్నారా
హా హ హ హా

సి ఐ డి (C I D )--1965


సంగీతం::ఘంటసాల 
రచన::పింగళి
గానం::P.సుశీల 
తారాగణం::N.T. రామారావు, జమున, గుమ్మడి,పండరీబాయి,రాజనాల,
మిక్కిలినేని,హేమలత, రమణారెడ్డి,    

పల్లవి::

యువతులు చూసి చూడక ముందే
ఐసవుతావా అబ్బాయి..ఐసవుతావా అబ్బాయి
యువతులు చూసి చూడక ముందే
ఐసవుతావా అబ్బాయి..ఐసవుతావా అబ్బాయి

విరహమె నీకు శీతలమైతే..ఆ
విరహమె నీకు శీతలమైతే..వెచ్చని కౌగిట ఊచెదనోయి
యువతులు చూసి చూడక ముందే
ఐసవుతావా అబ్బాయి..ఐసవుతావా అబ్బాయి 

చరణం::1 

కనుచూపులతో పలుకరింపగ..కందిపోతివా పాపాయి
కనుచూపులతో పలుకరింపగ..కందిపోతివా పాపాయి
ఉగ్గుపోసి నీ సిగ్గు..వదలగా  
ఉగ్గుపోసి నీ నీ సిగ్గు వదలగ..తమలపాకుతో విసిరెదనోయి 

యువతులు చూసి చూడక ముందే
ఐసవుతావా అబ్బాయి..ఐసవుతావా అబ్బాయి 

చరణం::2

పెదవి కదపకే ప్రేమ గీతమును మొదలు పెడితివా బుజ్జాయి..ఓ ఓ  
పెదవి కదపకే ప్రేమ గీతమును మొదలు పెడితివా బుజ్జాయి

మూగమనసె నీ మోజైతే  
మూగమనసె నీ మోజైతే..మాటాడక జరిగేరెదనోయి 
యువతులు చూసి చూడక ముందే
ఐసవుతావా అబ్బాయి  
విరహమె నీకు శీతలమైతే వెచ్చని కౌగిట ఊచెదనోయి
యువతులు చూసి చూడక ముందే
ఐసవుతావా అబ్బాయి..ఐసవుతావా అబ్బాయి

మగమహారాజు--1983సంగీతం::చక్రవర్తి  
రచన::వీటూరి 
గానం::S.P.బాలు
తారాగణం::సుహాసిని,చిరంజీవి, రావుగోపాల్‌రావు .

పల్లవి::

నీ దారి పూల దారి..పోవోయి బాట సారి
నీ ఆశలే ఫలించగా..ధ్వనించు విజయ భేరి 

నీ దారి పూల దారి..పోవోయి బాట సారి
నీ ఆశలే ఫలించగా..ధ్వనించు విజయ భేరి 
నీ ఆశలే ఫలించగా..ధ్వనించు విజయ భేరీ 

ఆశయాలు గురిగా..సాహసాలు సిరిగా 
సాగాలి జైత్ర రథం..వడి వడిగా  
మలుపులేన్ని ఉన్నా..గెలుపు నీదిరన్నా 
సాధించు మనోరథం..మనిషిగా 
నరుడివై హరుడివై నారాయణుడే నీవై  
నీ బాసలే ఫలించగా వరించు విజయ లక్ష్మి

నీ దారి పూల దారి..పోవోయి బాట సారి 
నీ ఆశలే ఫలించగా..ధ్వనించు విజయ భేరి  
నీ ఆశలే ఫలించగా..ధ్వనించు విజయ భేరీ  

అయ్యప్పా స్వామియే శరణం అయ్యప్పా 
అయ్యప్పా స్వామియే శరణం అయ్యప్పా 

కాళరాత్రి ముగిసే..కాంతి రేఖ మెరిసే 
నీ మండిన గుండెల..నిట్టుర్పులలో 
చల్ల గాలి విసిరే..తల్లి చేయి తగిలే
నీకోసం విండిన ఒడారుపులతో 
విజయమో..విలయమో..విదివిలాసమేదైనా  
నీ రక్తమే జ్వలిచగా..జయించు ఆత్మా శక్తి 

నీ దారి పూల దారి..పోవోయి బాట సారి 
నీ ఆశలే ఫలించగా..ధ్వనించు విజయ భేరి 
నీ ఆశలే ఫలించగా..ధ్వనించు విజయ భేరీ 

అయ్యప్పా స్వామియే శరణం అయ్యప్పా 
అయ్యప్పా స్వామియే శరణం అయ్యప్పా 

దిక్కులన్ని కలిసే..దైవమొకటి కలిసే
నీ రక్తం అభిషేకం..చేస్తుంటే 
మతములన్ని కరిగే..మమత దివ్వె వెలిగే
నీ ప్రాణం నైవేద్యం..పెడుతుంటే 
ధీరుడివై వీరుడివై విక్రమార్కుడివే నీవై  
నీ లక్ష్యమే సిద్దించగా దీవించు దైవ శక్తి  
నీ లక్ష్యమే సిద్దించగా దీవించు దైవ శక్తి  

నీ దారి పూల దారి ..పోవోయి బాట సారి.
నీ ఆశలే ఫలించగా ...ధ్వనించు విజయ భేరి

కృష్ణ ప్రేమ--1943సంగీతం::గాలిపెంచెల నరసింహారావు
రచన::తాపీ ధర్మారావు,బలిజేపల్లి లక్ష్మీకాంతం
గానం::శాంత కుమారి
Film Directed By::H.V.Baabu
తారాగణం::P.భానుమతి,P.శాంతకుమారి,T.సూర్యకుమారి,G.V.రావు,హైమవతి,అద్దంకి శ్రీరామమూర్తి,జయగౌరి.

పల్లవి::

కృష్ణా కృష్ణా..నీ ప్రేమ మహిమా
తెలియని వారై..ఏమో అందురు..ఊ
వారికి జ్ఞానోదయము అందించ
రారా..కృష్ణా..ఆఆఆ
ఊదుము కృష్ణా మోహన మురళిని
ఊదుము కృష్ణా పావన మురళిని
ఊదుము కృష్ణా మోహన మురళిని
ఊదుము కృష్ణా పావన మురళిని
మోహ జలధిలో ఈదగ రారా 
మోహ జలధిలో ఈదగ రారా 
ఊదుము కృష్ణా పావన మురళిని
కృష్ణా కృష్ణా కృష్ణా కృష్ణా

చరణము::1

నీ దయను మోహమును తెలిసికొని
నీ దయను మోహమును తెలిసికొని
మేల్కొనగా దయాపయోనిధి
మేల్కొనగా దయాపయోనిధి
ఊదుము కృష్ణా మోహన మురళిని
ఊదుము కృష్ణా
కృష్ణా కృష్ణా కృష్ణా

చరణం::2

నీ చరణములు సేవించుటయే 
నా చరితార్థము
నీ చరణములు సేవించుటయే 
నా చరితార్థము
నీ నామార్చన గానామృతమే 
గానామృతమే గానామృతమే
నీ నామార్చన గానామృతమే 
జీవన భాగ్యమహ జీవన భాగ్యమహ
నీ ప్రేమయే జగదాధారము 
నీ ప్రేమయే జగదాధారము
నిఖిలము..నీవే నీవే దేవా 
నిఖిలము..నీవే నీవే దేవా
ఊదుము కృష్ణా పావన మురళిని
మోహన మురళిని
ఊదుము కృష్ణా కృష్ణా..కృష్ణా..కృష్ణా

Thursday, March 26, 2015

శ్రీ కృష్ణ సత్య--1971
సంగీతం::పెండ్యాల నాగేశ్వరరావు
రచన::సముద్రాల 
గానం::S.జానకి 
తారాగణం::N.T.రామారావు,కాంతారావు,S.V.రంగారావు,జమున,జయలలిత,పద్మనాభం

పల్లవి::

మాట మీరగలడా..నేగీచిన గీటు 
దాటగలడా..సత్యాపతి
మాట మీరగలడా..ఆ..మాట మీరగలడా..ఆ
మాట మీరగలడా..ఆ..మాట మీరగలడా

చరణం::1

పతివలపంతా..నా వంతేనని 
సవతుల వంతు..రవంత లేదనీ
పతివలపంతా..నా వంతేనని   
సవతుల వంతు..రవంత లేదనీ
రాగ సరాగ..వైభోగ లీలలా  
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
రాగ సరాగ..వైభోగ లీలలా 
సరస కేళి..తేల్చే సాత్రాజితి 
మాట మీరగలడా..నేగీచిన గీటు 
దాటగలడా సత్యాపతి..మాట మీరగలడా..ఆ

చరణం::2

నారీ లోకము ఔరా..ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ  
నారీ లోకము ఔరా..ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ   
నారీ లోకము ఔరా..ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ  
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
నారీ లోకము..ఔరా యనగా 
నా సవతులు గని తలలు వంచగా
వ్రతము నెరపు దానా ఆ మీదట మాట మీరగలడా 
మాట మీరగలడా..నేగీచిన గీటు 
దాటగలడా..సత్యాపతి..మాట మీరగలడా..ఆ

శ్రీకృష్ణవిజయము--1971
సంగీతం::పెండ్యాల నాగేశ్వరరావు
రచన::పింగళి నాగేంద్రరావు
గానం::ఘంటసాల,జయలలిత
తారాగణం::N.T.రామారావు,కాంతారావు,S.V.రంగారావు,జమున,జయలలిత

పల్లవి::

అనరాదే బాలా..కాదనరాదే బేలా
ఆ.ఆ..అనరాదే బాలా..కాదనరాదే బేలా
కొమ్ములు తిరిగిన మగరాయుడు 
నిన్ను కోరి కోరి పెళ్ళాడెదనంటే
అనరాదే బాలా..కాదనరాదే బేలా..ఆ
ఏమ్..అంటే..ఏమ్ 

చరణం::1

అంటే ఏమనబోకు..తగు జంట కుదిరినది మనకు
అంటే ఏమనబోకు..తగు జంట కుదిరినది మనకు
ఇక నీవాడింది ఆట..పాడింది పాట సరిసరిగ తీరు ఉబలాట
అనరాదే బాలా..కాదనరాదే బేలా..ఆఆఆ 

చరణం::2

మరీ..వాడో  
వాడి భయము నీకేలా..నేనున్నాగా నీ మ్రోల
వాడి భయము నీకేలా..నేనున్నాగా నీ మ్రోల
నా మాట విని..అవుననుము
ఆ పైని వేడుక..కనుగొనుమూ 
అనరాదే బాలా..కాదనరాదే బేలా..ఆఆఆ

చరణం::3

అహ..హ హ హ హ ఓ ఓ ఓ హో.. 
ఆగుము..ఇది అంగ రంగ వైభోగము  
అనుమానమింక విడనాడుము..ఇటు చూడుము 
మురిపాలు మీర సరదాలు తీర
జిగిగా బిగిగా నగుమా..పక పక పక
హ హ హ హ హ హ హ హ హ
అనరాదే బాలా..కాదనరాదే బేలా
కొమ్ములు తిరిగిన మగరాయుడుని
నిను కోరి కోరి..పెళ్ళాడెదనంటే
అనరాదే బాలా..కాదనరాదే బేలా..ఆఆఆ   

సెక్రేటరి -1976సంగీతం::K.V.మహదేవన్
రచన::ఆచార్య ఆత్రేయ
గానం::V.రామకృష్ణ 
తారాగణం::అక్కినేని,వాణిశ్రీ,చంద్రమోహన్,రంగనాథ్,రాజబాబు,కాంచన,రమాప్రభ,సూర్యకాంతం

పల్లవి::

మనసులేని బ్రతుకొక నరకం
మరువలేని మనసొక నరకం
మనసులేని బ్రతుకొక నరకం
మరువలేని మనసొక నరకం

మనిషికెక్కడ వున్నది స్వర్గం
మరణమేనా దానికి మార్గం
మనసులేని బ్రతుకొక నరకం 

చరణం::1

మనసనేది ఒకరికొకరు ఇచ్చినపుడే తెలిసేది
దాచుకుంటే ఎవరికీ అది దక్కకుండా పోతుంది
ప్రేమనేది నీకు నీవే పెంచుకుంటే పెరిగేది
పంచుకునే ఒక మనసుంటేనే బంధమై అది నిలిచేది
మనసులేని బ్రతుకొక నరకం 

చరణం::2

మరువలేనిది మాసిపోదు..మాసిపోనిది మరలి రాదు
మరువలేనిది మాసిపోదు..మాసిపోనిది మరలి రాదు
రానిదానికై కన్నీళ్లు..రానిదానికై కన్నీళ్లు
రాతి బొమ్మకు నైవేద్యాలు 
మనసులేని బ్రతుకొక నరకం

చరణం::3

తరుముకొచ్చే జ్ఞాపకాలు..ఎదను గుచ్చే గులాబి ముళ్ళు
గురుతు తెచ్చే అందాలు..కూలిపోయిన శిల్పాలు

కన్ను నీదని..వేలు నీదని..పొడుచుకుంటే రాదా రక్తం
రక్తమెంతగా ధారపోసినా దొరుకుతుందా మళ్ళీ హృదయం
మనసులేని బ్రతుకొక నరకం..మరువలేని మనసొక నరకం
మనిషికెక్కడ వున్నది స్వర్గం..మరణమేనా దానికి మార్గం
మనసులేని బ్రతుకొక నరకం..మ్మ్ మ్మ్ 

Wednesday, March 25, 2015

కొత్త జీవితాలు--1980సంగీతం::ఇళయరాజ 
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::S.P.బాలు,S.జానకి 
తారాగణం::హరిప్రసాద్,నూతన్ ప్రసాద్,గుమ్మడి,సుహాసిని, రాజలక్ష్మి,పూర్ణిమ

పల్లవి::

పొంగిపొరలే అందాలెన్నో పొంగి పొరలే 
కన్నె మదిలో అందాలెన్నో పొంగిపొరలే 

కన్నె మదిలో అందాలెన్నో పొంగిపొరలే
కన్నె మదిలో అందాలెన్నో పొంగిపొరలే
కోనల్లోన లోయల్లోన నేలపైన నీ కదలే 
వన్నెకాడు నన్ను కలిసే

చరణం::1

పూలే రమ్మనగా పరువాలే జుమ్మనగా
పూలే రమ్మనగా పరువాలే జుమ్మనగా 
పవనాలే చింతనగా..హృదయాలే జల్లనగా 

పొంగిపొరలే అందాలెన్నో పొంగి పొరలే..ఏ
కోనల్లోన లోయల్లోన నేలపైన నీ కదలే
వన్నెకాడు నన్ను కలిసే

చరణం::2

కుకుకుకూ..కుకుకుకూ..కుకుకుకూ
కుకుకుకూ..కుకుకుకూ..కుకుకుకూ
కుకుకుకూ..కుకుకుకూ..కుకుకుకూ
కోయిల పాటలలోనా..ఆ కోవెల గంటలలోనా 
కోయిల పాటల లోనా..ఆ కోవెల గంటలలోనా 
మ్రోగిందీ..ఈఈఇ..మ్రోగిందీ..రాగం 
ఆడిందీ తాళం..అది నీ కోసం..మ్మ్ మ్మ్ మ్మ్ 
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ 

కన్నె మదిలో అందాలెన్నో పొంగిపొరలే
కోనల్లోన లోయల్లోన నేలపైన నీ కదలే 
వన్నెకాడు నన్ను కలిసే

చరణం::3

పాటను నేర్చే భామా..తొలి పాటల్లే మన ప్రేమా 
పాటను నేర్చే భామా..తొలి పాటల్లే మన ప్రేమా 
కన్నుల్లో..ఓఓఓఓ..మౌనం..కన్నుల్లో..ఓ..మౌనం
నవ్వుల్లో గానం..అది నా కోసం..మ్మ్ మ్మ్ మ్మ్
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ 

పొంగిపొరలే..ఏ..అందాలెన్నో పొంగి పొరలే 
కోనల్లోన లోయల్లోన నేలపైన నీ కదలే
వన్నెకాడు నన్ను కలిసే..ఏఏఏ 

Tuesday, March 24, 2015

మంత్రిగారి వియ్యంకుడు--1983


సంగీతం::ఇళయరాజా
రచన::వీటూరి 
గానం::S.P.బాలు,S. జానకి
తారాగణం::చిరంజీవి,తులసి,సుధాకర్,పూర్ణిమాజయరా,అల్లురామలింగయ్య,నిర్మల,రావికొండలరావ్ 

పల్లవి::

సలసల నను కవ్వించనేల
గిలగిల నను బంధించనేల

సాయంకాల సందేశాలు నాకే పంపనేల
ఓ మై లవ్..లల..లల..లల
సలసల నను కవ్వించనేల
గిలగిల నను బంధించనేల

చరణం::1

L O V E..అనే పల్లవి
K I S S..అనుపల్లవి

నీ చలి గిలి సందేళ కొత్త సంధి చెయ్యగా
మల్లెలే ఇలా మన్నించి వచ్చి గంధమివ్వగా
నాకు నీవు..నీకు నేను..లోకమవ్వగా చిలిపిగా

సలసల నను కవ్వించనేల
గిలగిల నను బంధించనేల
సాయంకాల సందేశాలు నాకే పంపనేల
ఓ మై లవ్..లల..లల..లల

చరణం::2

sweety beauty అనే పిలుపులు
మాటీ చోటీ అనే వలపులు
కౌగిళింతలే ఈ వేళ జంట కాపురాలుగా
పాడుకో చెలి ఈ నాటి ప్రేమ రాగమాలికా
కోకిలమ్మ తుమ్మెదయ్య..వంత పాడగా..చిలిపిగా


గిలగిల నను బంధించనేల
సలసల నను కవ్వించనేల
సాయంకాల సందేశాలు నాకే పంపనేల
ఓ మై లవ్..లల..లల..లల
సలసల నను కవ్వించనేల
గిలగిల నను బంధించనేల

Monday, March 23, 2015

రాక్షసుడు--1991

సంగీతం::ఇళయరాజా
రచన::వేటూరి
గానం::S.P.బాలు, S.జానకి

పల్లవి::

గిలిగా గిలిగిలిగా గిలిగింతగా
కసిగా కసికసిగా కవ్వింతగా
ఒళ్లంత తుళ్లింతలై
వాటేసుకున్నంతలై
జపించి నీ పేరే నే తపించిపోతున్నా 
తెలుసా హే పురుషోత్తమా
గిలిగా గిలిగిలిగా గిలిగింతగా
కసిగా కసికసిగా కవ్వింతగా

చరణం::1

వయసే నడినెత్తికెక్కింది ఈ పూట 
పైటే చలిపుట్టి జారిందయ్యో
వలపే కుడికన్ను కొట్టింది రమ్మంటా
పెదవే తడిచేసుకుందామమ్మో
ఒదిగీ ఒకటైతే ఒకటే గొడవైతే 
ఇంకా ప్రేమకథా ముదిరేనయ్యా

పసుపు చెక్కిళ్లో ఎరుపు దుమారం
చిలిపి చూపులకే వణికే వయ్యారం
పగలే కోరికలు పడుచు అల్లికలు
ముదిరి ముదిరి మనువు కుదిరి
మనసు మనసు కలిసిన సిరిలో 
గిలిగా గిలిగిలిగా గిలిగింతగా
కసిగా కసికసిగా కవ్వింతగా
ఒళ్లంతతుళ్లింతలై..వాటేసుకున్నంతలై

జపించి నీ పేరే నే తపించిపోతున్నా
తెలుసా హే పురుషోత్తమా
గిలిగా గిలిగిలిగా గిలిగింతగా
కసిగా కసికసిగా కవ్వింతగా

చరణం::2

ఎండా వానల్లో నీళ్లాడే అందాలు  
ఎదలో చప్పట్లే వేసేనమ్మా
మసక చీకట్లో చిగురేసే పరువాలు 
మతినే పోగొడితే ఎట్టాగయ్యో
నిదరే కరువైతే కలలే బరువైతే 
వయసు గుప్పిళ్లే తెరవాలమ్మో

సొగసు తోటల్లో పడుచు వయారం  
వడిసి పట్టగనే ఎంత సుతారం
అడిగే కానుకలు కరిగే కాటుకలు 
చిలిపి చిలిపి వలపు లిపిని  
కలికి చిలుక గిలికిన సడిలో

గిలిగా గిలిగిలిగా గిలిగింతగా 
కసిగా కసికసిగా కవ్వింతగా
ఒళ్లంతతుళ్లింతలై..వాటేసుకున్నంతలై

జపించి నీ పేరే నే తపించిపోతున్నా
తెలుసా హే పురుషోత్తమా
గిలిగా గిలిగిలిగా గిలిగింతగా 
కసిగా కసికసిగా కవ్వింతగా

రాక్షసుడు--1991


సంగీతం::ఇళయరాజా
రచన::వేటూరి
గానం::S.P.బాలు, S.జానకి

పల్లవి::

హెయ్ నాటీ లవ్ బాయ్..ఈ బ్యూటీ నీదోయ్
నీ ప్రేమలేఖ నేనందుకున్నా..ఆ నింగి దాగా నే పొంగుతున్న
నేడో రేపో పెళ్ళి

నీ రూపే రూబీ..ఐ లవ్ యూ బేబీ
నీ రూపే రూబీ..ఐ లవ్ యూ బేబీ

చరణం::1

ప్రేమల్లో అ ఆ లు..సిగ్గుల్లో ఛీ పో లు ఈనాడే నే నేర్చాను
చీరమ్మ అందాలు..సిరిమల్లె గంధాలు ఈనాడే నే చూశాను
హే..ప్రేమల్లో అ ఆ లు..సిగ్గుల్లో ఛీ పో లు ఈనాడే నే నేర్చాను
చీరమ్మ అందాలు..సిరిమల్లె గంధాలు ఈనాడే నే చూశాను

వరించి వస్తున్నా..వయ్యారమింక
తపించిపోతున్నా చెలాకి పిల్లా
కలగా మెరిసి కథలే తెలిసి సొదలే విరిసే

నీ రూపే రూబీ..ఐ లవ్ యూ బేబీ
నీ ప్రేమలేఖ నేనందుకున్నా..ఆ నింగి దాగా నే పొంగుతున్న
నేడో రేపో పెళ్ళి
హెయ్ నాటీ లవ్ బాయ్..ఈ బ్యూటీ నీదోయ్
హెయ్ నాటీ లవ్ బాయ్..ఈ బ్యూటీ నీదోయ్

చరణం::2

కళ్ళల్లో నాట్యాలు గుండెల్లో చేవ్రాలు ఏనాడో నువు చేశావు
పరువాల పత్యాలు బరువైన పాఠాలు ఏనాడో నాకు నేర్పావు
కళ్ళల్లో నాట్యాలు గుండెల్లో చేవ్రాలు ఏనాడో నువు చేశావు
పరువాల పత్యాలు బరువైన పాఠాలు ఏనాడో నాకు నేర్పావు

వయస్సు నీతోనే వసంతమాడే
సుగంధరాగాల ఉగాది నేడే
ఎదలో మెదిలే సొదలే కథలే ముదిరి మనసే కుదిరే

హెయ్ నాటీ లవ్ బాయ్..ఐ లవ్ యూ బేబీ
నీ ప్రేమలేఖ నేనందుకున్నా..ఆ నింగి దాగా నే పొంగుతున్న
నేడో రేపో పెళ్ళి
హెయ్ నాటీ లవ్ బాయ్..ఈ బ్యూటీ నీదోయ్
నీ రూపే రూబీ..ఐ లవ్ యూ బేబీ

కొండవీటి సింహం--1981


సంగీతం::చక్రవర్తి
రచన::వీటూరి
గానం::S.P.బాలు,P.సుశీల  

పల్లవి:: 

పిల్ల ఉంది పిల్లమీద కోరికుంది చెప్పబోతే జారుకుంది 
దానికెట్టా పంపేది గుట్టు కబురు దానికెట్టా తెలిపేది గుండే గుబులు 
పూతపట్టి కూతకొచ్చె పిట్ట వగలు 

హోయ్..వేటాగాడు పేటాకంతా నీటుగాడు వాటమైన వన్నెకాడు 
వాడికెట్టా పంపేది గాలి కబురు పంపలేక వేగింది 
చింత చిగురు పాడు ఈడు గోడదిగే పట్టపగలు 
పిల్లఉంది పిల్లమీద కోరికుంది చెప్పబోతే జారుకుంది 

చరణం::1

నిబ్బరంగ ఉన్నాది కన్నె చుక్క 
ఉబ్బరాల మీదుంది జున్ను ముక్క 
నిబ్బరంగ ఉన్నాది కన్నె చుక్క
ఉబ్బరాల మీదుంది జున్ను ముక్క 
దాన్ని చూసి..దాని సోకు చూసి 
దాన్ని చూసి..దాని సోకు చూసి 
చిటుకుమంటు కొట్టుకుంది చిలిపి కన్ను 
చిటుకుమంటు కొట్టుకుంది చిలిపి కన్ను 
పుటక దాటి పట్టుకుంది వలపు నన్ను..అర్రర్రే 

ఒంటిగున్న ఒంటిబాధ ఓపలేను..అయ్యో 
ఓపరాల ఈడునింక ఆపలేను 
ఒంటిగున్న ఒంటిబాధ ఓపలేను..ఆహ 
ఓపరాల ఈడునింక ఆపలేను 
వాడికెట్ట చెప్పేది ఒంటి గుట్టు వాడికెట్ట చెప్పేది ఒంటి గుట్టు 
ఎట్ట నేను ఆపేది ఇంత పట్టు 

పిల్లఉంది పిల్లమీద కోరికుంది చెప్పబోతే జారుకుంది 
వేటాగాడు పేటాకంతా నీటుగాడు వాటమైన వన్నెకాడు 

జంట లేని ఇంటి పట్టునుండలేను..అయ్యో 
కొంటె టేనే తీపరాలు టాపలేను..పాపం 
జంటా లేని ఇంటి పట్టునుండలేను..అహా
కొటె టేనే తీపరాలు టాపలేను..చొచ్చో 
డికెట్ట సెప్పేది గుండె గుట్టు  
వాడికెట్ట సెప్పేది గుండె గుట్టు
ఏట్టా నాకు తప్పేది గుట్టుమట్టు

చరణం::2 

చెంప గిల్లి పోతాది వాడి చూపు
చెమ్మగిల్లి పోతాది వేడి నాకు 
చెంప గిల్లి పోతాది వాడి చూపు
చెమ్మగిల్లి పోతాది వేడి నాకు 
వాడ్ని చూసి..వాడి రాక చూసి 
వాడ్ని చూసి..వాడి రాక చూసి 
లటుకుమంటు కొట్టుకొంది చిలక ముక్కు 
లటుకుమంటు కొట్టుకొంది చిలక ముక్కు 
పండు దోచుకోనులేదు నాకు దిక్కు 

గొగ్గిలాల గుమ్మసోకు సూడకుంటే అగ్గిలాంటి ఈడు నాకు భగ్గుమంటే 
గొగ్గిలాల గుమ్మసోకు సూడకుంటే అగ్గిలాంటి ఈడు నాకు భగ్గుమంటే 
దానికెట్టా సెప్పేది లోని గుట్టు  
దానికెట్టా సెప్పేది లోని గుట్టు..ఎట్టా నాకు దక్కేది తేనెపట్టు 

హోయ్..వేటాగాడు పేటాకంతా నీటుగాడు వాటమైన వన్నెకాడు 
వాడికెట్టా పంపేది గాలి కబురు పంపలేక వేగింది 
చింత చిగురు పాడు ఈడు గోడదిగే పట్టపగలు 
పిల్లఉంది పిల్లమీద కోరికుంది చెప్పబోతే జారుకుంది 
దానికెట్టా పంపేది గుట్టు కబురు దానికెట్టా తెలిపేది గుండే గుబులు 
పూతపట్టి కూతకొచ్చె పిట్ట వగలు

అమెరికా అమ్మాయి--1976

http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=5512
సంగీతం::G.K.వెంకటేశ్
రచన::ఆరుద్ర 
గానం::S.P.బాలు,S.జానకి  

పల్లవి:: 

ఓ టెల్ మి..టెల్ మి..టెల్ మి..వాట్
డుయు లవ్ మి..లవ్ మి..లవ్ మి..అఫ్ కోస్
డోంట్ లీవ్ మి..లీవ్ మి..లీవ్ మి
కమాన్..కమాన్..కమాన్..కమాన్..కమాన్ 

ఓ..టెల్ మి..టెల్ మి..టెల్ మి..అస్క్ మి బేబీ
డుయు లవ్ మి.. లవ్ మి.. లవ్ మి..  సర్టె న్లీ స్వీట్ హార్ట్
డోంట్ లీవ్ మి.. లీవ్ మి.. లీవ్ మి
కమాన్.. కమాన్.. కమాన్.. కమాన్.. కమాన్

చరణం::1

చాటు చేయ వద్దు నీ అందాలు..వేస్ట్ చేయ వద్దు నీ సరదాలు
చాటు చేయ వద్దు నీ అందాలు..వేస్ట్ చేయ వద్దు నీ సరదాలు  
చేయి చేయి కలుపు..నీ హయి ఏమొ తెలుపు
నీ మానసంతా..నా మీదే నిలుపు
కలసి చిందు లేద్దా౦..కవ్వించి నవ్వుకుందా౦
ఈ రేయి మనం..ఒళ్ళు మరచిపోదాం

ఓ టెల్ మి..టెల్ మి..టెల్ మి..ఊహు
డుయు లవ్ మి..లవ్ మి..లవ్ మి..నో
డోంట్ లీవ్ మి..లీవ్ మి..లీవ్ మి
కమాన్..కమాన్..కమాన్..కమాన్  బేబి..కమాన్

చరణం::2

వేయలేవు గాలికేమొ సంకేళ్ళు..ఆపలేవు పడుచుదనం పరువళ్ళు 
వేయలేవు గాలికేమొ సంకేళ్ళు..ఆపలేవు పడుచుదనం పరువళ్ళు 
ఈ సిగ్గు నీకు వాద్దు..అహ లేదు మనకు హద్దు
ప్రతి వలపు జంట..లోకానికి ముద్దు
ఈ వయసు మరల రాదు..ఈ సుఖము తప్పుకాదు
ఈ సరదాలకు సరిసాటే లేదు

ఓ..టెల్ మి..టెల్ మి..టెల్ మి
డుయు లవ్ మి..లవ్ మి..లవ్ మి..విత్ ప్లెషర్
డోంట్ లీవ్ మి..లీవ్ మి..లీవ్ మి
కమాన్..కమాన్..కమాన్..కమాన్..కమాన్

ఓ..టెల్ మి..టెల్ మి..టెల్ మి
డుయు లవ్ మి..లవ్ మి..లవ్ మి 
డోంట్ లీవ్ మి..లీవ్ మి..లీవ్ మి
కమాన్..కమాన్..కమాన్..కమాన్..కమాన్

Sunday, March 22, 2015

సంఘర్షణ--1983


సంగీతం::చక్రవర్తి
రచన::వేటూరి  
గానం::S.P.బాలు,P.సుశీల
తారాగణం::చిరంజీవి,నళిని,విజయశాంతి.

పల్లవి::

లలలలలలలా..లలలలలలలా
నిద్దురపోరా..ఓ..వయసా..బుద్ధిగ ఈ వేళ
నిద్దురపోరా..ఓ..వయసా..బుద్ధిగ ఈ వేళ
ఎంతని ఊపను ఉయ్యాల..ఎంతని ఊపను ఉయ్యాల

జోజోజోజో లాలీ..జోజో..ఓ..ఓ 
ఓజోజోజో లాలీ..జోజో..ఓ..ఓ 

నిద్దురపోరా..ఓ..వయసా..బుద్ధిగ ఈ వేళ
నిద్దురపోరా..ఓ..వయసా..బుద్ధిగ ఈ వేళ
ఎంతని ఓపను నీ గోల..ఎంతని ఓపను నీ గోల
ఏమని పాడను..వెచ్చని జోలా

జోజోజోజో లాలీ..జోజో..ఓ..ఓ 
ఓజోజోజో లాలీ..జోజో..ఓ..ఓ

చరణం::1

మసకైన పడనీవూ..మల్లె విచ్చుకోనీవూ
హవ్వ..హవ్వ..హవ్వా..
వేళాపాళా లేదాయే..పాలకి ఒకటే గోలాయే
చెపితేనేమో వినవాయే..చెప్పకపోతే గొడవాయే 
బజ్జోమంటే తంటాలా..ఎప్పుడు పడితే అపుడేనా

జోజోజోజో లాలీ..జోజో..ఓ..ఓ 
ఓజోజోజో లాలీ..జోజో..ఓ..ఓ

నిద్దురపోవే ఓ వయసా..బుద్ధిగ ఈ వేళ
నిద్దురపోరా ఓ వయసా..బుద్ధిగ ఈ వేల

చరణం::2

మనసైన పడనీవూ ఊ..మాట చెప్పుకోనీవూ
హవ్వ..హవ్వ..హవ్వా..ఆ
లాల పోసుకోనీవూ..పూలు ముడుచుకోనీవూ
హవ్వ..హ వ్వ..హవ్వా..ఆ
వెడి గిన్నె తేవాయే వెన్నెల బువ్వే కరువాయే
చలిగాలేస్తే సలుపాయే..వెచ్చని గాలికి వలపాయే
తాకంగానే తాపాలా..ఆనక అంటే అల్లరేనా

జోజోజోజో లాలీ..జోజో..ఓ..ఓ 
ఓజోజోజో లాలీ..జోజో..ఓ..ఓ

నిద్దురపోరా ఓ వయసా..బుద్ధిగ ఈ వేల
నిద్దురపోవే ఓ వయసా..బుద్ధిగ ఈ వేళ

ఎంతని ఊపను ఉయ్యలా..ఎంతని ఓపను నీ గోల
ఏమని పాడను..ముద్దుల జోలా..ఆ

జోజోజోజో లాలీ..జోజో..ఓ..ఓ 
ఓజోజోజో లాలీ..జోజో..ఓ..ఓ

Sangharshana--1983
Music::Chakravarti
Lyrics::Veetuuri 
Singer's::S.P.Baalu,P.Suseela
Cast::Chiranjeevi,Nalini,VijayaSaanti.

::::

lalalalalalalaa..lalalalalalalaa
niddurapOraa..O..vayasaa..buddhiga ii vELa
niddurapOraa..O..vayasaa..buddhiga ii vELa
entani Upanu uyyaala..entani Upanu uyyaala

jOjOjOjO laalii..jOjO..O..O 
OjOjOjO laalii..jOjO..O..O 

niddurapOraa..O..vayasaa..buddhiga ii vELa
niddurapOraa..O..vayasaa..buddhiga ii vELa
entani Opanu nee gOla..entani Opanu nee gOla
Emani paaDanu..vechchani jOlaa

jOjOjOjO laalii..jOjO..O..O 
OjOjOjO laalii..jOjO..O..O

::::1

masakaina paDaneevU..malle vichchukOneevU
havva..havva..havvaa..
vELaapaaLaa lEdaayE..paalaki okaTE gOlaayE
chepitEnEmO vinavaayE..cheppakapOtE goDavaayE 
bajjOmanTE tanTaalaa..eppuDu paDitE apuDEnaa

jOjOjOjO laalii..jOjO..O..O 
OjOjOjO laalii..jOjO..O..O

niddurapOvE O vayasaa..buddhiga ii vELa
niddurapOraa O vayasaa..buddhiga ii VEla

::::2

manasaina paDaneev uu..maaTa cheppukOneevuu
havva..havva..havvaa..aa
laala pOsukOneevuu..poolu muDuchukOneevuu
havva..ha vva..havvaa..aa
veDi ginne tEvaayE vennela buvvE karuvaayE
chaligaalEstE salupaayE..vechchani gaaliki valapaayE
taakangaanE taapaalaa..Anaka anTE allarEnaa

jOjOjOjO laalii..jOjO..O..O 
OjOjOjO laalii..jOjO..O..O

niddurapOraa O vayasaa..buddhiga ii VEla
niddurapOvE O vayasaa..buddhiga ii vELa

entani Upanu uyyalaa..entani Opanu nee gOla
Emani paaDanu..muddula jOlaa..aa

jOjOjOjO laalii..jOjO..O..O 

OjOjOjO laalii..jOjO..O..O

కొదమ సింహం--1990సంగీతం::రాజ్-కోటి 
రచన::వేటూరి  
గానం::S.P.బాలు,K.S.చిత్ర 

పల్లవి::

చక్కిలి గింతల రాగం
ఓ ముద్దిస్తుంటే మురిపిస్తుంటే
చెక్కిలి గుంటల గీతం
ఓ ప్రియ యా యా యా యా

ఎక్కడ దాచను అందం
నీ కన్నేస్తుంటే కాటేస్తుంటే
చుక్కలు చూడని ప్రాయం
ఓ ప్రియ యా యా యా 

సాయంత్ర వేళ..సంపంగి బాల
శృంగార మాల..మెళ్ళోన వేసి 
ఒళ్ళోన చెరగా..య యా యా 

చక్కిలి గింతల రాగం 
ఓ ముద్దిస్తుంటే మురిపిస్తుంటే 
చుక్కలు చూడని ప్రాయం
ఓ ప్రియ యా యా యా యా యా

చరణం::1

కౌగిట్లో ఆ కళ్ళు..కవ్వించే పోకళ్ళు
మొత్తంగ కోరిందమ్మ..మోజు
పాలల్లో మీగడ్లు..పరువాల ఎంగిళ్ళు 
మెత్తంగ దోచాడమ్మ..లౌజు
వచ్చాక వయసు..వద్దంటే ఓ యస్సు 
బుచ్చెత్తి పిచ్చెక్కించే గుమ్మ సొగసు
ఊ..అంటే తంట..ఊపందుకుంటా
నీ ఎండ కన్నేసి..నా గుండె దున్నేసి
నీ ముద్దు నాటెయ్యాలీరోజు
యా..యా..యా
ఎక్కడ దాచను అందం
నీ కన్నేస్తుంటే కాటేస్తుంటే
చెక్కిలిగుంటల..గీతం
ఓ ప్రియ యా యా యా యా యా

చరణం::2

చూపుల్లో బాణాలు..సుఖమైన గాయలు
కోరింది కోలాటాల..ఈడు
నీ ప్రేమ గానాలు..లేలేత దానాలు
దక్కందే పోనే పోడు..వీడు
గిలిగింత గిచ్చుళ్ళు..పులకింత పుట్టిల్లు
ముంగిట్లో ముగ్గేస్తుంటే..నాకు మనసు
సై..అంటే జంట..చెయ్..అందుకుంట
బుడమేటి పొంగంటి..బిడియాల బెట్టంతా
ఒడిలోనే దులిపేస్తాలే..చూడు
య..యా..య

చక్కిలి గింతల రాగం
ఓ ముద్దిస్తుంటే మురిపిస్తుంటే
చెక్కిలిగుంటల గీతం
ఓ ప్రియ యా యా యా యా యా

ఎక్కడ దాచను అందం
నీ కన్నేస్తుంటే కాటేస్తుంటే
చుక్కలు చూడని ప్రాయం
ఓ ప్రియ యా యా యా  యా

సాయంత్ర వేళ..సంపంగి బాల
శృంగార మాల..మెళ్ళోన వేసి 
ఒళ్ళోన చెరగా..య..యా..య

కొదమ సింహం--1990


సంగీతం::రాజ్-కోటి 
రచన::వేటూరి  
గానం::S.P.బాలు,K.S.చిత్ర

పల్లవి::

star star..ఆఆఆఆ..mega star star
star star..ఆఆఆఆ..mega star starr

star star..ఆఆఆఆ..mega star star
star star..ఆఆఆఆ..mega star star 

జపం జపం జపం కొంగ జపం
తపం తపం తపం దొంగ తపం
జపం జపం జపం కొంగ జపం
తపం తపం తపం దొంగ తపం
నేనే బ్రేకేశా కాలానికి నేనే కాపేశా అందానికి
మగసిరిలో సొగసరితో తదిగిణతోం ఇహం పరం నిరంతరం
star star..ఆఆఆఆ..mega star star
star star..ఆఆఆఆ..mega star star 

చరణం::1

వేయ్ వేయ్ మరో స్టెప్పు వేయ్
ఒకే లిప్పువై జోరుగా నా జోడుగా
చేయ్ చేయ్ ఇలా బ్రేక్ చేయ్
ఎదే షేక్ చేయ్ సోకుగా నాజూకుగా
ఇస్పేటు రాజు అరె కిస్ పెట్టుకుంటే
ఆయ్ డైమండు రాణి డంగౌతు ఉంటే
లవ్వుబాయ్ లబ్జులన్ని చూపనా 
కౌబాయ్ కౌగిలింత గరం గరం గరం గరం
star star..ఆఆఆఆ..mega star star
star star..ఆఆఆఆ..mega star star 

జపం జపం జపం కొంగ జపం
తపం తపం తపం దొంగ తపం

చరణం::2

వేయ్ వేయ్ అలా గాలమేయ్
ఇలా శూలమేయ్ రాజులా నటరాజులా
చేయ్ చేయ్ భలే ట్యాప్ చేయ్
సరే ట్విస్టు చేయ్ మోతగా తొలి మోజుగా
నువ్వేరా కాసు certainly baby 
నీతోనే ఊసు sure my love
అందాల గూసే ఆటీను ఆసు
హార్టు బీటుతోటి తాళమేయనా
అరె వాటమైన బతుకు ఎంత సుఖం సుఖం సుఖం సుఖం 

star star..ఆఆఆఆ..mega star star
star star..ఆఆఆఆ..mega star star 

జపం జపం జపం కొంగ జపం
తపం తపం తపం దొంగ తపం
జపం జపం జపం కొంగ జపం
తపం తపం తపం దొంగ తపం
అరె నేనే బ్రేకేశా కాలానికి నేనే కాపేశా అందానికి
మగసిరిలో సొగసిరితో తదిగిణతో ఇహం పరం నిరంతరం 

star star..ఆఆఆఆ..mega star star
star star..ఆఆఆఆ..mega star star

వీరాభిమన్యు--1965
సంగీతం::K.V.మహదేవన్
రచన::సముద్రాల సీనియర్ (senior)
గానం::S.జానకి,బృందం
Film Directed By::V.Madhusoodhana Rao 
తారాగణం::N.T.రామారావు,కాంతారావు,శోభన్‌బాబు,కాంచన,S.వరలక్ష్మి,G.వరలక్ష్మి

పల్లవి::

కల్లా కపటం రూపై వచ్చే నల్లని వాడా రా 
చల్లానమ్మే పిల్లల వెదకే అల్లరి వాడా రా 
కల్లా కపటం రూపై వచ్చే నల్లని వాడా రా 
చల్లానమ్మే పిల్లల వెదకే అల్లరి వాడా రా 
నల్లని వాడా రారారా అల్లరి వాడా రారారా
నల్లని వాడా రారారా అల్లరి వాడా రారారా

చరణం::1

ద్వారక వీడి నీరధి లోనా దాగిన వీరా రా 
చెఱలో పుట్టీ చెఱలో పెరిగిన మాయలమారీ రా 
ద్వారక వీడి నీరధి లోనా దాగిన వీరా రా 
చెఱలో పుట్టీ చెఱలో పెరిగిన మాయలమారీ రా
గొర్రెలు బర్రెలు మేపే వానికి రాజ్యము ఏలయ్యా
అవనీ పాలన అతివలతోటీ ఆటలు కాదయ్యా 
గొర్రెలు బర్రెలు మేపే వానికి రాజ్యము ఏలయ్యా
అవనీ పాలన అతివలతోటీ ఆటలు కాదయ్యా 

నల్లని వాడా రారారా అల్లరి వాడా రారారా
నల్లని వాడా రారారా అల్లరి వాడా రారారా

చరణం::2

అష్టమి పుట్టినవాడా ముదిపామును కొట్టిన వాడా 
అష్టమి పుట్టినవాడా ముదిపామును కొట్టిన వాడా 
మద్దుల గూల్చిన వాడా ముసలెద్దుని చంపిన వాడా
కొంటె కృష్ణా రారా గోపీ కృష్ణా రా రా అనాథ కృష్ణా 
కృష్ణా రా కృష్ణా రా రారారా 
కన్నెల దొంగ వెన్నల దొంగ దారుల దొంగ చీరల దొంగా 
అల్లరి కృష్ణా అల్లరి కృష్ణా అల్లరి కృష్ణా అల్లరి కృష్ణా 

కల్లాకపటం కానరాని చల్లని స్వామీ రా 
ఎల్లరికీ సుఖము గోరు నల్లని స్వామీ రా
కల్లాకపటం కానరాని చల్లని స్వామీ రా 
ఎల్లరికీ సుఖము గోరు నల్లని స్వామీ రా
చల్లని స్వామీరారారా నల్లని స్వామీ రారారా
చల్లని స్వామీరారారా నల్లని స్వామీ రారారా

చరణం::3

వైరినైన కరుణనేలు పరమాత్మా రా 
సభలో ద్రౌపదిని దయగనిన ప్రభూరా 
వైరినైన కరుణనేలు పరమాత్మా రా 
సభలో ద్రౌపదిని దయగనిన ప్రభూరా 

చల్లని స్వామీరారారా నల్లని స్వామీ రారారా
చల్లని స్వామీరారారా నల్లని స్వామీ రారారా

భ్రమతో నిను గోరే మా కనుల పొరలు తొలగే
భ్రమతో నిను గోరే మా కనుల పొరలు తొలగే
నిందజేయు నోటితోనే పొగడజేతు మీ మహిమ 
నిందజేయు నోటితోనే పొగడజేతు మీ మహిమ 
భ్రమతో నిను గోరే మా కనుల పొరలు తొలగే

చల్లని స్వామీరారారా నల్లని స్వామీ రారారా
చల్లని స్వామీరారారా నల్లని స్వామీ రారారా

కృష్ణా కృష్ణా కృష్ణా కృష్ణా కృష్ణా

Saturday, March 21, 2015

శ్రీనివాస కల్యాణం--1987
సంగీతం::K.V.మహదేవన్
రచన::వీటూరిసుందర్‌రామ్మూర్తి 
గానం::S.P.బాలు,P.సుశీల
Film Directed By:: Kodi Ramakrishna
తారాగణం::వేంకటేష్,భానుప్రియ,గౌతమి,గొల్లపూడి,మోహన్‌బాబు,సుత్తివేలు,Y.విజయ,శుభలేక సుధాకర్,వరలక్ష్మీ.

పల్లవి::

జాబిలి వచ్చి..జామయ్యింది
జాజులు విచ్చి..జామయ్యింది
తాపం పెంచే..ఉడుకు దుడుకు 
ముడిపడి ఉరికే వేళయ్యింది..గోలయ్యింది

జాబిలి వచ్చి..జామయ్యిందా? 
జాజులు విచ్చి..జామయ్యిందా?
తాపం పెంచే..ఉడుకు దుడుకు 
ముడిపడి ఉరికే వేళయిందా? గోలయిందా?
జాబిలి వచ్చి..జామయ్యింది
జాజులు విచ్చి..జామయ్యింది

చరణం::1

పందిరి మంచం..ఒంటరి కంటికి 
కునుకు నివ్వనంది..అహా
వరస కుదరినిదే సరసానికి తెరతీయకూడదంది
హో..ఓ..పందిరిమంచం ఒంటరి కంటికి కునుకునివ్వనంది
హ..హ..వరసకుదరినిదే సరసానికి తెరతీయకూడదంది
వడ్డించిన అందాలన్ని..అడ్డెందుకు అంటున్నాయి
వడ్డించిన అందాలన్ని..అడ్డెందుకు అంటున్నాయి
కళ్యాణం కాకుండానే..కలపడితే తప్పన్నాయి
ఏయ్..ఏయ్..ఏయ్..జాబిలి వచ్చి జామయ్యింది
ఆ..హా..జాజులు విచ్చి...జామయ్యిందా 

చరణం::2

అత్త బిడ్డనా హక్కు..చూపుతు రేచ్చేవబ్బాయి
మరదలివైతె ఏనాడో..గిరి దాటించేద్దునె అమ్మాయి
అత్త బిడ్డనా హక్కు..చూపుతు రేచ్చేవబ్బాయి
మరదలివైతె ఏనాడో..గిరి దాటించేద్దునె అమ్మాయి
హేయ్..కొంగుముళ్ళు పడకుండానే..పొంగుముదిరి పోనీకోయి
కొంగుముళ్ళు పడకుండానే..పొంగుముదిరి పోనీకోయి
దొంగ ముద్దుల తీయదనంలొ..సంగతేదొ తెల్చేయ్యనీయి
ఆ..ఆహా...హ..హ..హా
జాబిలి వచ్చి జామయ్యింది..ఆహా
ఆఆ..జాజులు విచ్చి జామయ్యిందా?..హ..హ
హాహాహా..తాపం పెంచే ఉడుకు దుడుకు 
ముడిపడి ఉరికే వేళయ్యింది..హ..హ..గోలయ్యింది..ఆహా
లలలల..ఆహాఆహా..హా..హా..హా..ఆ
ఆహా..ఆహా..హా..హా..మ్మ్..మ్మ్..మ్మ్..మ్మ్..మ్మ్  

Sreenivaasa Kalyanam--1987
Music::K.V.Mahadevan 
Lyrics::Veetuurisundarrammoorti
Singer::S.P.Baalu,P.Suseela
Film Directed By:: Kodi Ramakrishna
Cast::Venkatesh,Bhanupriya,Goutami,Gollapoodi,Mohanbabu,Suttivelu,Y,Vijaya,Subhaleka Sudhakar,Varalakshmi.

::::::::::::::

jaabili vachchi..jaamayyindi
jaajulu vichchi..jaamayyindi
taapam penchE..uDuku duDuku 
muDipaDi urikE vELayyindi..gOlayyindi

jaabili vachchi..jaamayyindaa? 
jaajulu vichchi..jaamayyindaa?
taapam penchE..uDuku duDuku 
muDipaDi urikE vELayindaa? gOlayindaa?
jaabili vachchi..jaamayyindi
jaajulu vichchi..jaamayyindi

::::1

pandiri mancham..onTari kanTiki kunuku nivvanandi..ahaa
varasa kudarinidE sarasaaniki terateeyakooDadandi
hO..O..pandiri mancham..onTari kanTiki kunuku nivvanandi..ahaa
ha..ha..varasa kudarinidE sarasaaniki terateeyakooDadandi
vaDDinchina andaalanni..aDDenduku anTunnaayi
vaDDinchina andaalanni..aDDenduku anTunnaayi
kaLyaaNam kaakunDaanE..kalapaDitE tappannaayi
Ey..Ey..Ey..jaabili vachchi jaamayyiNdi
aa..haa..jaajulu vichchi...jaamayyiNdaa 

::::2

atta biDDanaa hakku..chooputu rEchchEvabbaayi
maradalivaite EnaaDO..giri daaTinchEddune ammaayi
atta biDDanaa hakku..chooputu rEchchEvabbaayi
maradalivaite EnaaDO..giri daaTinchEddune ammaayi
hEy..kongumuLLu paDakunDaanE..pongumudiri pOneekOyi
kongumuLLu paDakunDaanE..pongumudiri pOneekOyi
donga muddula teeyadanamlo..sangatEdo telchEyyaneeyi

aa..aahaa...ha..ha..haa
jaabili vachchi jaamayyindi..aahaa
aaaa..jaajulu vichchi jaamayyindaa?..ha..ha
haahaahaa..taapam penchE uDuku duDuku 
muDipaDi urikE vELayyindi..ha..ha..gOlayyindi..aahaa
lalalala..aahaaaahaa..haa..haa..haa..aa
aahaa..aahaa..haa..haa..mm..mm..mm..mm..mm 

పల్లె సీమ--1977
సంగీతం::K.V.మహదేవన్
రచన::జాలాది
గానం::P.సుశీల
Film Directed By::P.Chandrasekhar Reddi
తారాగణం::రంగనాథ్,శ్రీధర్,శరత్ బాబు,అల్లురామలింగయ్య,జయసుధ,అపర్ణ,సత్యప్రియ.
పల్లవి::

సూరట్టుకు జారతాదీ సితుక్కు సితుక్కు వానచుక్కా
సూరట్టుకు జారతాదీ సితుక్కు సితుక్కు వానసుక్క
గుండెల్నే కుదిపేత్తాదీ గతుక్కు గతుక్కు ఏందేలక్కా

సూరట్టుకు జారతాదీ సితుక్కు సితుక్కు వానసుక్క
గుండెల్నే కుదిపేత్తాదీ గతుక్కు గతుక్కు ఏందేలక్కా
సూరట్టుకు జారతాదీ సితుక్కు సితుక్కు వానసుక్క

చరణం::1

కిటికీలో ఏదో మెరిసి ఇటుకంటా రమ్మంటాదీ
తొంగి సూడబోతే జల్లు ఒళ్ళంతా తడిమేత్తాదీ
కిటికీలో ఏదో మెరిసి ఇటుకంటా రమ్మంటాదీ
తొంగి సూడబోతే జల్లు ఒళ్ళంతా తడిమేత్తాదీ
తడిసిపోయానారేతిరీ...ఆడి జిమ్మడిపోనూ
కుదిపి సుట్టేశాడమ్మా గాలి సచ్చినోడూ..గాలివాన గాడూ

సూరట్టుకు జారతాదీ సితుక్కు సితుక్కు వానసుక్క
గుండెల్నే కుదిపేత్తాదీ గతుక్కు గతుక్కు ఏందేలక్కా
సూరట్టుకు జారతాదీ సితుక్కు సితుక్కు వానసుక్క

చరణం::2

పొగసూరిన ఆకాశంలో..పోకిరోడూ మెరిశాడూ
ఊరవతల సేలల్లో నను ఉరిమి ఉరిమి చూశాడూ
పొగసూరిన ఆకాశంలో..పోకిరోడూ మెరిశాడూ
ఊరవతల సేలల్లో నను ఉరిమి ఉరిమి చూశాడూ
సందెకాడ ఊరంతా..సద్దుమణిగి నిదరోతుంటే
సల్లంగా ఎపుడొచ్చాడో ఇల్లు ఒళ్ళు తడిపేశాడూ
తడిసిపోయానారేతిరీ...ఆడి జిమ్మడిపోనూ
కుదిపి సుట్టేశాడమ్మా గాలి సచ్చినోడూ..గాలివాన గాడూ

సూరట్టుకు జారతాదీ సితుక్కు సితుక్కు వానసుక్క
గుండెల్నే కుదిపేత్తాదీ గతుక్కు గతుక్కు ఏందేలక్కా
సూరట్టుకు జారతాదీ సితుక్కు సితుక్కు వానసుక్క

చరణం::3 

సూరుకింద ఖాళీ సూసి..సొరవ చేసి నను చుట్టేసీ
పదును పదును సలికోరల్తో..ఉరిమి ఉరిమి ఉడికించీ
సూరుకింద ఖాళీ సూసి..సొరవ చేసి నను చుట్టేసీ
పదును పదును సలికోరల్తో..ఉరిమి ఉరిమి ఉడికించీ
రెపరెపలాడించేశాడూ...దీపం దిగమింగేశాడూ
నడి ఝామున లేపేశాడూ..నట్టింటో కురిసెల్లాడూ
తడిసిపోయానారేతిరీ...ఆడి జిమ్మడిపోనూ
కుదిపి సుట్టేశాడమ్మా గాలి సచ్చినోడూ..గాలివాన గాడూ

సూరట్టుకు జారతాదీ సితుక్కు సితుక్కు వానసుక్క
గుండెల్నే కుదిపేత్తాదీ గతుక్కు గతుక్కు ఏందేలక్కా 
సూరట్టుకు జారతాదీ సితుక్కు సితుక్కు వానసుక్క

Palle seema--1976
Music::K.V.Mahadevan 
Lyrics::Jaalaadi
Singer::P.Suseela
Film Directed By::P.Chandrasekhar Reddi
Cast::Ranganaath,Sreedhar,Saratbaabu,Alluraamalingayya,Jayasudha,Aparna,Satyapriya.

::::::::::::::

sooraTTuku jaarataadii situkku situkku vaanachukkaa
sooraTTuku jaarataadii situkku situkku vaanasukka
gunDelnE kudipEttaadii gatukku gatukku EndElakkaa

sooraTTuku jaarataadii situkku situkku vaanasukka
gunDelnE kudipEttaadii gatukku gatukku EndElakkaa
sooraTTuku jaarataadii situkku situkku vaanasukka


::::1

kiTikeelO EdO merisi iTukanTaa rammanTaadii
tongi sooDabOtE jallu oLLantaa taDimEttaadii
kiTikeelO EdO merisi iTukanTaa rammanTaadii
tongi sooDabOtE jallu oLLantaa taDimEttaadii
taDisipOyaanaarEtirii...aaDi jimmaDipOnoo
kudipi suTTESaaDammaa gaali sachchinODoo..gaalivaana gaaDoo

sooraTTuku jaarataadii situkku situkku vaanasukka
gunDelnE kudipEttaadii gatukku gatukku EndElakkaa
sooraTTuku jaarataadii situkku situkku vaanasukka

::::2

pogasoorina aakaaSamlO..pOkirODoo meriSaaDoo
ooravatala sElallO nanu urimi urimi chooSaaDoo
pogasoorina aakaaSamlO..pOkirODoo meriSaaDoo
ooravatala sElallO nanu urimi urimi chooSaaDoo
sandekaaDa oorantaa..saddumaNigi nidarOtunTE
sallangaa epuDochchaaDO illu oLLu taDipESaaDoo
taDisipOyaanaarEtirii...aaDi jimmaDipOnoo
kudipi suTTESaaDammaa gaali sachchinODoo..gaalivaana gaaDoo

sooraTTuku jaarataadii situkku situkku vaanasukka
gunDelnE kudipEttaadii gatukku gatukku EndElakkaa
sooraTTuku jaarataadii situkku situkku vaanasukka

::::3 

soorukinda khaaLii soosi..sorava chEsi nanu chuTTEsii
padunu padunu salikOraltO..urimi urimi uDikinchii
soorukinda khaaLii soosi..sorava chEsi nanu chuTTEsii
padunu padunu salikOraltO..urimi urimi uDikinchii
reparepalaaDinchESaaDoo...deepam digamingESaaDoo
naDi jhaamuna lEpESaaDoo..naTTinTO kurisellaaDoo
taDisipOyaanaarEtirii...aaDi jimmaDipOnoo
kudipi suTTESaaDammaa gaali sachchinODoo..gaalivaana gaaDoo

sooraTTuku jaarataadii situkku situkku vaanasukka
gunDelnE kudipEttaadii gatukku gatukku EndElakkaa
sooraTTuku jaarataadii situkku situkku vaanasukka

Sunday, March 15, 2015

చల్లని నీడ--1968సంగీతం::T.చలపతి
రచన::దాశరతి
గానం::S.జానకి
Film Directed By::Tatineni Ramarao
తారాగణం::హరనాధ్,జమున,గుమ్మడి,అంజలి,రేలంగి,సూర్యకాంతం,గీతాంజలి,రాజబాబు,ప్రభకర్ రెడ్డి.

పల్లవి::

మల్లెల కన్నా జాబిల్లి కన్నా..మల్లెల కన్నా జాబిల్లి కన్నా
చల్లని పాపాయి లాలిజో..చల్లని పాపాయి లాలిజో 

చరణం::1

లోకాలు నిదురుంచు వేళాయెరా..కలలందు విహరించ రావేలరా
లోకాలు నిదురుంచు వేళాయెరా..కలలందు విహరించ రావేలరా
తారలతో ఆడుకోవాలిరా..మేఘాలలో తేలిపోవాలిరా..ఆ
మల్లెల కన్నా జాబిల్లి కన్నా..మల్లెల కన్నా జాబిల్లి కన్నా
చల్లని పాపాయి లాలిజో.. చల్లని పాపాయి లాలిజో

చరణం::2

అందాలు చిందించు నీ మోమున..కస్తూరి తిలకమ్ము తీర్చేనురా
అందాలు చిందించు నీ మోమున..కస్తూరి తిలకమ్ము తీర్చేనురా
నీ మీద ఏ నీడ పడబోదురా..ఏ గాలి ఏ ధూళి రాబోదురా
మల్లెల కన్నా జాబిల్లి కన్నా..మల్లెల కన్నా జాబిల్లి కన్నా
చల్లని పాపాయి రావోయి..చల్లని పాపాయి రావోయి

చరణం::3

నీ వారు లేరన్న భయమేలరా..నేనుండగా నీకు లోటేమిరా
నీ వారు లేరన్న భయమేలరా..నేనుండగా నీకు లోటేమిరా
కన్నులలో దాచుకుంటానురా..కనుపాపలా చూచుకుంటానురా
మల్లెల కన్నా జాబిల్లి కన్నా..మల్లెల కన్నా జాబిల్లి కన్నా
చల్లని పాపాయి రావోయి .. చల్లని పాపాయి రావోయి

Saturday, March 14, 2015

అక్కా చెల్లెలు--1970
సంగీతం::K.V.మహాదేవన్
రచన::ఆచార్య-ఆత్రేయ
గానం::ఘంటసాల 
Film Directed By::Akkineni SAnjeevi 
తారాగణం::అక్కినేని,జానకి,కృష్ణ,విజయనిర్మల,గుమ్మడి,పద్మనాభం,రమాప్రభ,శాంతకుమారి,విజయలలిత,అల్లురామలింగయ్య,ప్రభాకర్ రెడ్డి,చిత్తూర్‌నాగయ్య

సాకీ:: 

న్యాయానికి బంధిగా..న్యాయమూర్తి వెళుతున్నాడమ్మా..ఆ
నీ మాంగల్యానికి..ఈ మానవ న్యాయం సవాలు చేసిందమ్మా

పల్లవి::

ఇది మతికి మనసుకి..పోరాటం తల్లి..ఈ 
మనిషితో..దేవుని చెలగాటం..చెల్లి

ఇది మతికి మనసుకి..పోరాటం తల్లి..ఈ 
మనిషితో..దేవుని చెలగాటం..చెల్లి

అటు నమ్మిన సత్యం..ఇటు పెంచిన రక్తం
అడకత్తెరలో పడిపోయినది..ధర్మం

అటు నమ్మిన సత్యం..ఇటు పెంచిన రక్తం
అడకత్తెరలో పడిపోయినది..ధర్మం

ఇది మతికి మనసుకి..పోరాటం తల్లి..ఈ 
మనిషితో..దేవుని చెలగాటం..చెల్లి

నీవు నేర్పిన నీతి నియమం..నీకే ఎదురై నిలిచిందా
నీవు నేర్పిన నీతి నియమం..నీకే ఎదురై నిలిచిందా

నీ పసుపు కుంకుమలనే..బలి కోరిందా..ఆ
నీ పసుపు కుంకుమలనే..బలి కోరిందా..
ఇది నీతికి నెలవూ..లేదది నీతికి తావూ..ఊ
కంచే చేనును మేస్తుందా..కన్నతల్లి కడుపునే కోస్తుందా

ది మతికి మనసుకి..పోరాటం తల్లి..ఈ 
మనిషితో..దేవుని చెలగాటం..చెల్లి
మనిషితో..దేవుని చెలగాటం..చెల్లి

Akka Chellelu--1970
Music::K.V.Mahadevan
Lyrics::Kosaraju
Singer's::Ghantasala,P.Suseela
Film Directed By::Akkineni Sanjeevi
Cast::A.N.R.Janaki,Vijayanirmala,Krishna,Gummadi,Alluramalingayya,Ramaprabha,Padmanabham,Prabhakar Reddi,Vijayalalita,Santakumari,Chittooru Nagayya.
   
:::::::::::: 

nyaayaaniki bandhigaa..nyaayamoorti veLutunnaaDammaa..aa
nee maangalyaaniki..ii maanava nyaayam savaalu chEsindammaa

:::::::

idi matiki manasuki..pOraaTam talli..ii 
manishitO..dEvuni chelagaaTam..chelli

idi matiki manasuki..pOraaTam talli..ii 
manishitO..dEvuni chelagaaTam..chelli

aTu nammina satyam..iTu penchina raktam
aDakatteralO paDipOyinadi..dharmam

aTu nammina satyam..iTu penchina raktam
aDakatteralO paDipOyinadi..dharmam

idi matiki manasuki..pOraaTam talli..ii 
manishitO..dEvuni chelagaaTam..chelli

::::::::::

neevu nErpina neeti niyamam..neekE edurai nilichindaa
neevu nErpina neeti niyamam..neekE edurai nilichindaa

nee pasupu kunkumalanE..bali kOrindaa..aa
nee pasupu kunkumalanE..bali kOrindaa..
idi neetiki nelavuu..lEdadi neetiki taavuu..uu
kanchE chEnunu mEstundaa..kannatalli kaDupunE kOstundaa

di matiki manasuki..pOraaTam talli..ii 
manishitO..dEvuni chelagaaTam..chelli
manishitO..dEvuni chelagaaTam..chelli

అక్కా చెల్లెలు--1970
సంగీతం::K.V.మహాదేవన్
రచన::కోసరాజు
గానం::ఘంటసాల,P.సుశీల
Film Directed By::Akkineni SAnjeevi 
తారాగణం::అక్కినేని,జానకి,కృష్ణ,విజయనిర్మల,గుమ్మడి,పద్మనాభం,రమాప్రభ,శాంతకుమారి,విజయలలిత,అల్లురామలింగయ్య,ప్రభాకర్ రెడ్డి,చిత్తూర్‌నాగయ్య

పల్లవి::

ఓ పిల్లా పఠపఠ..లాడిస్తా 
ఓహో..ఓపిల్లా..చకచకలాడిస్తా 
ఓపిల్లా ఓపిల్లా ఓపిల్లా పిల్లపిల్లపిల్లా
ఓ పిల్లా పఠపఠ..లాడిస్తా 
ఓహో..ఓపిల్లా..చకచకలాడిస్తా 
తళుక్కుమనినివ్ మెరుస్తువస్తే..దాగుడుమూతలు ఆడిస్తా
తళుక్కుమనినివ్ మెరుస్తువస్తే..దాగుడుమూతలు ఆడిస్తా
ఓపిల్లా ఓపిల్లా ఓపిల్లా పిల్లపిల్లపిల్లా

బుల్లోడా..చమచమలాడిస్తా
అహా..బుల్లోడా చిమచిమ వదిలిస్తా
అహా..బుల్లోడ బుల్లోడ బుల్లిబుల్లి బుల్లోడా..ఆ
బుల్లోడా..చమచమలాడిస్తా
అహా..బుల్లోడా చిమచిమ వదిలిస్తా
చేతికందితే కదలనీయక కాలికి నిన్ను కట్టేస్తా
చేతికందితే కదలనీయక కాలికి నిన్ను కట్టేస్తా
అహా..బుల్లోడ బుల్లోడ బుల్లిబుల్లి బుల్లోడా..ఆ
బుల్లోడా..చమచమలాడిస్తా
అహా..బుల్లోడా చిమచిమ వదిలిస్తా

చరణం::1

చక్కనైన చుక్కవే..చేతినిండ చిక్కావే..ఏఏఏ
చక్కనైన చుక్కవే..చేతినిండ చిక్కావే
రావాలి పిలవంగానె..రావాలి
నువ్ రావాలి రావాలి..నా కులాస అప్పుడు చూడాలి
ఓపిల్లా ఓపిల్లా ఓపిల్లా పిల్లపిల్లపిల్లా..ఆ

ఓ పిల్లా పఠపఠ..లాడిస్తా 
అహా..బుల్లోడా చిమచిమ వదిలిస్తా

చరణం::2

వలచిందాక వెంటపడుదురు..వలపు తీరితే పలకరు
పలుకరు పలుకరు పలుకరు పలుకరు పిలిచినా పలుకరు
వలచిందాక వెంటపడుదురు..వలపు తీరితే పలకరు
అబ్బాయ్లంతా అంతేలే..అబ్బాయ్లంతా అంతేలే అయ్యచూస్తే పెళ్ళౌతుందిలే
బుల్లోడ బుల్లోడ బుల్లిబుల్లి బుల్లోడా..అయ్యచూస్తే పెళ్ళౌతుందిలే

ఎవడా దృషుడు..చెప్పవే..వాడికి తన్నులు తప్పవే
ఎవడా దృషుడు..చెప్పవే..వాడికి తన్నులు తప్పవే 

ఇప్పుడు ఎదురుగా ఉన్నాడనుకో..ఏమిటీ ఈ కథా అన్నాడనుకో..యాయ్ 
ఇప్పుడు ఎదురుగా ఉన్నాడనుకో..ఏమిటీ ఈ కథా అన్నాడనుకో
హా..మీ అమ్మాయి లవ్ చేసిందయ్యా..ప్రాణం తీస్తుందయ్యా
మీ అమ్మాయి లవ్ చేసిందయ్యా..ప్రాణం తీస్తుందయ్యా
మీ అమ్మాయి లవ్ చేసిందయ్యా..మావయ్యా నీ అల్లుణయ్యా
కళ్ళుపట్టుకొంటానయ్యో..ఓఓఓఓఓ..ఫటాఫట్  
  
Akka Chellelu--1970
Music::K.V.Mahadevan
Lyrics::Kosaraju
Singer's::Ghantasala,P.Suseela
Film Directed By::Akkineni Sanjeevi
Cast::A.N.R.Janaki,Vijayanirmala,Krishna,Gummadi,Alluramalingayya,Ramaprabha,Padmanabham,Prabhakar Reddi,Vijayalalita,Santakumari,Chittooru Nagayya.

::::::::::::::::::::::::::

O pillaa paThapaTha..laaDistaa 
OhO..Opillaa..chakachakalaaDistaa 
Opillaa Opillaa Opillaa pillapillapillaa
O pillaa paThapaTha..laaDistaa 
OhO..Opillaa..chakachakalaaDistaa 
taLukkumaniniv merustuvastE..daaguDumootalu ADistaa
taLukkumaniniv merustuvastE..daaguDumootalu ADistaa
Opillaa Opillaa Opillaa pillapillapillaa

bullODaa..chamachamalaaDistaa
ahaa..bullODaa chimachima vadilistaa
ahaa..bullODa bullODa bullibulli bullODaa..aa
bullODaa..chamachamalaaDistaa
ahaa..bullODaa chimachima vadilistaa
chEtikanditE kadalaneeyaka kaaliki ninnu kaTTEstaa
chEtikanditE kadalaneeyaka kaaliki ninnu kaTTEstaa
ahaa..bullODa bullODa bullibulli bullODaa..aa
bullODaa..chamachamalaaDistaa
ahaa..bullODaa chimachima vadilistaa

::::1

chakkanaina chukkavE..chEtininDa chikkaavE..EEE
chakkanaina chukkavE..chEtininDa chikkaavE
raavaali pilavangaane..raavaali
nuv raavaali raavaali..naa kulaasa appuDu chUDaali
Opillaa Opillaa Opillaa pillapillapillaa..aa

O pillaa paThapaTha..laaDistaa 
ahaa..bullODaa chimachima vadilistaa

::::2

valachindaaka venTapaDuduru..valapu teeritE palakaru
palukaru palukaru palukaru palukaru pilichinaa palukaru
valachindaaka venTapaDuduru..valapu teeritE palakaru
abbaaylantaa antElE..abbaaylantaa antElE ayyachoostE peLLoutundilE
bullODa bullODa bullibulli bullODaa..ayyachoostE peLLoutundilE

evaDaa dRshuDu..cheppavE..vaaDiki tannulu tappavE
evaDaa dRshuDu..cheppavE..vaaDiki tannulu tappavE 

ippuDu edurugaa unnaaDanukO..EmiTii ii kathaa annaaDanukO..yaay 
ippuDu edurugaa unnaaDanukO..EmiTii ii kathaa annaaDanukO
haa..mee ammaayi lav chEsindayyaa..praaNam teestundayyaa
mee ammaayi lav chEsindayyaa..praaNam teestundayyaa
mee ammaayi lav chEsindayyaa..maavayyaa nee alluNayyaa
kaLLupaTTukonTaanayyO..OOOOO..phaTaaphaT 

Friday, March 13, 2015

కీలు బొమ్మలు--1965
సంగీతం::S.P.కోదండపాణి
రచన::ఆరుద్ర 
గానం::P.సుశీల 
Film Directed By::C.S.Rao 

తారాగణం::జమున,జగ్గయ్య,వాసంతి,గుమ్మడి,చలం,సూర్యకాంతం,రమణారెడ్డి,కన్నాంబ

పల్లవి::

బొట్టు కాటుక పెట్టుకొనీ
పూవుల దండలు ముడుచుకొనీ
తూనీగల్లె ఎగిరేదాన..తొందరలోనె వస్తాడు
మొగుడొస్తాడూ..ఊ..హహహహా

చరణం::1

చీటికి మాటికి చెలరేగే..నీ నోటికి తాళం వేస్తాడు
చీటికి మాటికి చెలరేగే..నీ నోటికి తాళం వేస్తాడు
వెక్కిరింతు నీ వెటకారాలకు..టక్కున కళ్ళెం వేస్తాడూ

బొట్టు కాటుక పెట్టుకొనీ
పూవుల దండలు ముడుచుకొనీ
తూనీగల్లె ఎగిరేదాన..తొందరలోనె వస్తాడు
మొగుడొస్తాడూ..ఊ..హాహా

చరణం::2

మిడిసిపాటు ఇంకెన్నాళ్ళులే..నీ మెడలు వంచి ముడివేస్తాడు
చెప్పిన మాటలు వినకుంటే..ఏఏ..చెప్పిన మాటలు వినకుంటే
నీ చెవులు పట్టి ఆడిస్తాడూ

బొట్టు కాటుక పెట్టుకొనీ
పూవుల దండలు ముడుచుకొనీ
తూనీగల్లె ఎగిరేదాన..తొందరలోనె వస్తాడు
మొగుడొస్తాడూ..ఊ..హాహా

చరణం::3

సిగ్గులతో తలవంచుకొనే..నీ బుగ్గమీద చిటికేస్తాడు
జరిగే కొలదీ ఎడమైతే..ఏఏ..జరిగే కొలది ఎడమైతే
నీ జడతో భరతం పడతాడూ

బొట్టు కాటుక పెట్టుకొనీ
పూవుల దండలు ముడుచుకొనీ
తూనీగల్లె ఎగిరేదాన..తొందరలోనె వస్తాడు

మొగుడొస్తాడూ..ఊ..హాహాహా

Keelubommalu--1965
Music::S.P.Kodandapani
Lyrics::Arudra
Singer::P.Suseela
Film Directed By::C.S.Rao 
Cast::Jamuna,Jaggayya,Vasanti,Gummadi,Chalam,Sooryakaantam,Ramanareddi,Kannamba.

:::::::::::::::::::

boTTu kaaTuka peTTukonii
poovula danDalu muDuchukonii
tooniigalle egirEdaana..tondaralOne vastaaDu
moguDostaaDuu..uu..hahahahaa

::::1

chiiTiki maaTiki chelarEgE..nee nOTiki taaLam vEstaaDu
chiiTiki maaTiki chelarEgE..nee nOTiki taaLam vEstaaDu
vekkirintu nee veTakaaraalaku..Takkuna kaLLem vEstaaDuu

boTTu kaaTuka peTTukonii
poovula danDalu muDuchukonii
tooniigalle egirEdaana..tondaralOne vastaaDu
moguDostaaDuu..uu..haahaa

::::2

miDisipaaTu inkennaaLLulE..nee meDalu vanchi muDivEstaaDu
cheppina maaTalu vinakunTE..EE..cheppina maaTalu vinakunTE
nee chevulu paTTi ADistaaDuu

boTTu kaaTuka peTTukonii
poovula danDalu muDuchukonii
tooniigalle egirEdaana..tondaralOne vastaaDu
moguDostaaDuu..uu..haahaa

::::3

siggulatO talavanchukonE..nee buggameeda chiTikEstaaDu
jarigE koladii eDamaitE..EE..jarigE koladi eDamaitE
nee jaDatO bharatam paDataaDuu

boTTu kaaTuka peTTukonii
poovula danDalu muDuchukonii
tooniigalle egirEdaana..tondaralOne vastaaDu

moguDostaaDuu..uu..haahaahaa

Wednesday, March 11, 2015

సింహ స్వప్నం--1989సంగీతం::K.V.మహాదేవన్
రచన::ఆచార్య-ఆత్రేయ
గానం::S.P.బాలు,P.సుశీల
Film Directed By::V.Madhusudhan Rao
తారాగణం::కృష్ణంరాజు,జయసుధ,జగపతిబాబు,వాణివిశ్వనాథ్,శాంతిప్రియ.

పల్లవి::

కళ్ళలోన నీవే గుండెలోన నీవే
ఎదురుగ ఉన్న మరుగున ఉన్న
ప్రేమ జ్యోతి నీవే..నీవే..నీవే..నీవే..ఏ
మమతల గుడిలో దీపమ..మనసున మదిలె రూపమ
చెలిమివి నీవే..కలిమివి నీవే..నా వెలుగువు..నీవే

మమతల గుడిలో దీపమ..మనసున మదిలె రూపమ
చెలిమివి నీవే..ఏఏఏ..కలిమివి నీవే..నీవే..ఏ

చరణం::1

నువ్వు నేనొక లోకము మనమెన్నడు వేరయ్యి ఉండము
నువ్వే ఆరో ప్రాణము..నేనెరిగిన ఒకటే దైవము
పాలు తేనె లాగ..కలిసి కరిగినాము
విడువ లేను నిన్ను..మరువ లేవు నన్ను
ఒకరికి ఒకరై...ఇద్దరం ఒకరై 
ఉన్నాము నేడు ఉంటాము రేపు మనమేనాడు లేము
మమతల గుడిలొ దీపమ..మనసున మదిలె రూపమ
చెలిమివి నీవే..కలిమివి నీవే..నీవే..ఏ

చరణం::2

నిజమై నిలిచిన స్వప్నమ నా బ్రతుకున వెలసిన స్వర్గమ
ఎన్నొ జన్మల బంధమ ఈ జన్మకు మిగిలిన పుణ్యమ
నువ్వే లేని నాడు..లేనే లేను నేను 
ఎంత సంపదైన..నీకు సాటి రాదు
మెలుకువ నైన..నిద్దుర నైన 
ఒకటే ప్రాణం ఒకటే దేహం..మనదొకటే భావం

కళ్ళలోన నీవే...గుండెలోన నీవే
ఎదురుగ ఉన్న...మరుగున ఉన్న
ప్రేమ జ్యోతి నీవే..నీవే..నీవే
మమతల గుడిలో దీపమ..మనసున మదిలె రూపమ
చెలిమివి నీవే..కలిమివి నీవే..నా వెలుగువు నీవే

Simha Swapnam--1989
Music::K.V.Mahadevan
Lyrics::Acharya-Atreya
Singer's::S.P.Baalu.P.Suseela
Film Directed By::V.Madhusudhan Rao
Cast::Krishnamraju,Jayasudha,Jagapatibabu,Vaniviswanath,Saantipriya.

::::::::::

kaLLalOna neevE gunDelOna neevE
eduruga unna maruguna unna
prEma jyOti neevE..neevE..neevE..neevE..E
mamatala guDilO deepama..manasuna madile roopama
chelimivi neevE..kalimivi neevE..naa veluguvu..neevE

mamatala guDilO deepama..manasuna madile roopama
chelimivi neevae..EEE..kalimivi neevae..neevE..E

::::1

nuvvu nEnoka lOkamu manamennaDu vErayyi unDamu
nuvvE aarO praaNamu..nEnerigina okaTE daivamu
paalu tEne laaga..kalisi kariginaamu
viDuva lEnu ninnu..maruva lEvu nannu
okariki okarai...iddaram okarai 
unnaamu nEDu unTaamu rEpu manamEnaaDu lEmu
mamatala guDilo deepama..manasuna madile roopama
chelimivi neevE..kalimivi neevE..neevE..E

::::2

nijamai nilichina swapnama naa bratukuna velasina svargama
enno janmala bandhama ii janmaku migilina puNyama
nuvvE lEni naaDu..lEnE lEnu nEnu 
enta sampadaina..neeku saaTi raadu
melukuva naina..niddura naina 
okaTE praaNam okaTE dEham..manadokaTE bhaavam

kaLLalOna neevE...gunDelOna neevE
eduruga unna...maruguna unna
prEma jyOti neevE..neevE..neevE
mamatala guDilO deepama..manasuna madile roopama
chelimivi neevE..kalimivi neevE..naa veluguvu neevE

Tuesday, March 10, 2015

చిన్ననాటి కలలు--1975సంగీతం::T.చలపతిరావు
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::S.P.బాలు
Film Directed By::T.Lenin,K.Viswanath 
తారాగణం::కృష్ణంరాజు,జయంతి,ప్రమీల,అల్లురామలింగయ్య,రమాప్రభ,రావుగోపాలరావు,కె.వి చలం,గుమ్మడి

పల్లవి::

నీవే నీవే నామదిలో..దాగున్నావు
నీవే నీవే నామదిలో..దాగున్నావు
ఊహల కౌగిలిలో..నీవే ఉన్నావు..ఊఊఊ
నీవే నీవే నామదిలో..దాగున్నావు

చరణం::1

చిరు చిరు చినుకులు పడుతూవుంటే
నీ పలుకులే..అనుకొన్నాను 
అనుకొన్నాను..అనుకొన్నాను
సెలయేటి పిలిపులు వింటూవుంటే 
సెలయేటి పిలిపులు వింటూవుంటే 
నీ పాటలే..అనుకొన్నాను 
అనుకొన్నాను..అనుకొన్నాను

నీవే నీవే నామదిలో..దాగున్నావు
ఊహల కౌగిలిలో..నీవే ఉన్నావు..ఊఊఊ
నీవే నీవే నామదిలో..దాగున్నావు

చరణం::2

పున్నమి వెన్నెల..పువ్వులు చూసి
పున్నమి వెన్నెల..పువ్వులు చూసి
నీ నవ్వులే..ఏఏఏ..అనుకొన్నాను
నీ నవ్వులే...అనుకొన్నాను
అనుకొన్నాను...అనుకొన్నాను
కలువల కన్నుల..కాంతులు చూసి
కలువల కన్నుల..కాంతులు చూసి
నీ చూపులే...అనుకొన్నాను
నీ చూపులే...అనుకొన్నాను
అనుకొన్నాను...అనుకొన్నాను

నీవే నీవే నామదిలో..దాగున్నావు
ఊహల కౌగిలిలో..నీవే ఉన్నావు..ఊఊఊ
నీవే నీవే నామదిలో..దాగున్నావు

చరణం::3

ఏ చిగురాకుల..అలికిడి విన్నా
ఏ చిగురాకుల..అలికిడి విన్నా
నీ అడుగులే..అనుకొన్నాను
నీ అడుగులే..అనుకొన్నాను
అనుకొన్నాను...అనుకొన్నాను
ఏ చిరుగాలి..సోకుతు వున్నా
ఏ చిరుగాలి..సోకుతు వున్నా
నీ కౌగిలే..అనుకొన్నాను
అనుకొన్నాను...అనుకొన్నాను

నీవే నీవే నామదిలో..దాగున్నావు
ఊహల కౌగిలిలో..నీవే ఉన్నావు..ఊఊఊ
నీవే నీవే నామదిలో..దాగున్నావు


Chinnanaati Kalalu--1975
Music::T.Chalapati Rao
Lyrics::D.C.NarayanaReddi
Singer's::S.P.Balu 
Film Directed By::LeninBabu
Cast::Krishnamraju,Jayanti,Prameela,Alluraamalingayya,Ramaprabha,RaogopalRao,K.V.Chalam,Gummadi.

:::::::::::::::

neevE neevE naamadilO..daagunnaavu
neevE neevE naamadilO..daagunnaavu
Uhala kowgililO..neevE unnaavu..UUU
neevE neevE naamadilO..daagunnaavu

::::1

chiru chiru chinukulu paDutuuvunTE
nee palukulE..anukonnaanu 
anukonnaanu..anukonnaanu
selayETi pilipulu vinToovunTE 
selayETi pilipulu vinToovunTE 
nee paaTalE..anukonnaanu 
anukonnaanu..anukonnaanu

neevE neevE naamadilO..daagunnaavu
Uhala kowgililO..neevE unnaavu..UUU
neevE neevE naamadilO..daagunnaavu

::::2

punnami vennela..puvvulu choosi
punnami vennela..puvvulu choosi
nee navvulE..EEE..anukonnaanu
nee navvulE...anukonnaanu
anukonnaanu...anukonnaanu
kaluvala kannula..kaantulu choosi
kaluvala kannula..kaantulu choosi
nee choopulE...anukonnaanu
nee choopulE...anukonnaanu
anukonnaanu...anukonnaanu

neevE neevE naamadilO..daagunnaavu
Uhala kowgililO..neevE unnaavu..UUU
neevE neevE naamadilO..daagunnaavu

::::3

E chiguraakula..alikiDi vinnaa
E chiguraakula..alikiDi vinnaa
nee aDugulE..anukonnaanu
nee aDugulE..anukonnaanu
anukonnaanu...anukonnaanu
E chirugaali..sOkutu vunnaa
E chirugaali..sOkutu vunnaa
nee kowgilE..anukonnaanu
anukonnaanu...anukonnaanu

neevE neevE naamadilO..daagunnaavu
Uhala kowgililO..neevE unnaavu..UUU
neevE neevE naamadilO..daagunnaavu