సంగీతం::K.V.మహాదేవన్
రచన:: కొసరాజు రాఘవయ్య
గానం::S.P.బాలు,P.సుశీల
నాయుడోళ్ళింటికాడ
నల్లతుమ్మచెట్టుకింద
నాయుడేమన్నాడె పిల్లా
అబ్భా గుండె ఝల్లుమన్నాదె బుల్లా
నాయుడోళ్ళింటికాడ
నల్లతుమ్మచెట్టుకింద
నాయుడేమన్నాడె పిల్లా
అబ్భా గుండె ఝల్లుమన్నాదె బుల్లా
నాయుడోళ్ళింటుకాడ
నల్లతుమ్మచెట్టుకింద
గుట్టుబైట పెట్టాడే అప్పుడూ
అబ్భా గుండె ఝల్లుమన్నాదే ఇప్పుడూ
నాయుడోళ్ళింటుకాడ
నల్లతుమ్మచెట్టుకింద
గుట్టుబైట పెట్టాడే అప్పుడూ
అబ్భా గుండె ఝల్లుమన్నాదే ఇప్పుడూ
ఎలా ఎలా అన్నాడు
ఏమిచేయమన్నాడూ
మల్లెమొగ్గలాంటిపిల్ల
ఒళ్ళోన వాలుతుంటే
జారులో మన్నాడా
జూరుకోమన్నాడా
జారులో మన్నాడా
జూరుకోమన్నాడా
నాయుడేమన్నాడె పిల్లా
అబ్భా గుండె ఝల్లుమన్నాదె బుల్లా
అబ్భా గుండె ఝల్లుమన్నాదె బుల్లా
వాలుకన్నుల చినదాన్ని
వదలకూడదు అన్నాడు
ఇంతకన్నా మంచిరోజు
ఎప్పుడూ రాదన్నాడు
చెయ్యివేయమన్నాడూ
అయ్యాయ్యో చెప్పకూడదన్నాడూ
చెయ్యివేయమన్నాడూ
చెప్పకూడదన్నాడూ
నాయుడోళ్ళింటుకాడ
నల్లతుమ్మచెట్టుకింద
గుట్టుబైట పెట్టాడే అప్పుడూ
అబ్భా గుండె ఝల్లుమన్నాదే ఇప్పుడూ
కల్లి బొల్లి సాకులన్ని
కట్టిపెట్టమన్నాడా
కంటి సైగ తెలుసుకొని
కలుసుకోమన్నాడా
పిట్ట పడతదన్నాడా
వీపు చిడతదన్నాడా
పిట్ట పడతదన్నాడా
వీపు చిడతదన్నాడా
నాయుడే మన్నాడే పిల్లా
అబ్భా గుండెఝల్లుమన్నాదే బుల్లా
సందెపొద్దుదాక నీతో సరసమాడి
సద్దుచేయకుండ వుండమన్నాడు
మనసుతీర నీతో మాటలాడి
తొందరేమి చేయకుండ ఆగమన్నాడు
దారిచూదమాన్నాడూ...
అమ్మమ్మ్మమ్మో దౌడుతీయమన్నాడు
దారిచూదమనాడు
దౌడుతీయమన్నాడు
నాయుడోళ్ళింటికాడ
నల్లతుమ్మచెట్టుకింద
నాయుడేమన్నాడె పిల్లా
అబ్భా గుండె ఝల్లుమన్నాదె బుల్లా
నాయుడోళ్ళింటుకాడ
నల్లతుమ్మచెట్టుకింద
గుట్టుబైట పెట్టాడే అప్పుడూ
అబ్భా గుండె ఝల్లుమన్నాదే ఇప్పుడూ
లల్లాల్లల్లాల్లా
ఆ..హా..హా...ఊ..హో...హో..