Friday, July 08, 2011

కళ్యాణి--1979

పాట ఇక్కడ వినండి
సంగీతం::రమేష్‌నాయుడు
రచన::C.నారాయణరెడ్డి
గానం:S.P.బాలు
నటీ,నటులు::మురళీమోహన్,జయసుధ

లలిత కళారాధనలో వెలిగే..చిరు దివ్వెను నేను
లలిత కళారాధనలో వెలిగే..చిరు దివ్వెను నేను
మధుర భారతి..పద సన్నిధిలో
మధుర భారతి..పద సన్నిధిలో
ఒదిగే తొలి పువ్వును నేను
ఒదిగే తొలి పువ్వును నేను
లలిత కళారాధనలో వెలిగే..చిరు దివ్వెను నేను

ఏ ఫలమాశించి మత్తకోకిల..ఎలుగెత్తి పాడును
ఏ ఫలమాశించి మత్తకోకిల..ఎలుగెత్తి పాడును
ఏ వెల ఆశించి పూచే పువ్వు..తావిని విరజిమ్మును
ఏ వెల ఆశించి పూచే పువ్వు..తావిని విరజిమ్మును
అవధి లేని ప్రతి అనుభూతికి..ఆత్మానందమే పరమార్ధం
లలిత కళారాధనలో వెలిగే..చిరు దివ్వెను నేను

ఏ సిరి కోరి పోతన్న..భాగవత సుధలు చిలికించెను
ఏ సిరి కోరి పోతన్న..భాగవత సుధలు చిలికించెను
ఏ నిధి కోరి త్యాగయ్య..రాగ జలనిధులు పొంగించెను
ఏ నిధి కోరి త్యాగయ్య..రాగ జలనిధులు పొంగించెను
రమణీయ కళావిష్కృతికి..రమణీయ కళావిష్కృతికి
రసానందమే పరమార్ధం...

లలిత కళారాధనలో వెలిగే..చిరు దివ్వెను నేను
మధుర భారతి::పద సన్నిధిలో
మధుర భారతి::పద సన్నిధిలో
ఒదిగే తొలి::పువ్వును నేను
ఒదిగే తొలి::పువ్వును నేను
లలిత కళారాధనలో వెలిగే::చిరు దివ్వెను నేను