Monday, November 08, 2010

మంచివాడు--1974














సంగీత::K.V.మహదేవన్
రచన::ఆత్రేయ
గానం::రామారావు
తారాగణం::నాగేశ్వరరావు,వాణిశ్రీ,కాంచన,రాజబాబు,రమాప్రభ,హలాం,సత్యనారాయణ,పద్మనాభం.

పల్లవి::

చూస్తా బాగా చూస్తా..చేయి చూస్తా
చూసి చెబుతా చూస్తా..బాగా చూస్తా 
చేయి చూస్తా..చూసి చెబుతా
ముందు వెనక..యేముందో
యెక్కడుందో యెవరికెవరి..కెంతుందో చూచి చెబుతా
ముందు వెనక..యేముందో
యెక్కడుందో యెవరికెవరి కెంతుందో..చూచి చెబుతా
హేయ్ చూస్తా బాగా చూస్తా చేయి చూస్తా..చూసి చెబుతా

చరణం::1

కోట్లు కోట్లు గా గడించి..కూడబెట్టకు 
వజ్రాలుగా బంగారుగా..మార్చి దాచకు
కోట్లు కోట్లు గా గడించి..కూడబెట్టకు 
వజ్రాలుగా బంగారుగా..మార్చి దాచకు
రాశి లగ్నమందు నేడు..రాహువున్నాడే  
రాశి లగ్నమందు నేడు..రాహువున్నాడే 
రాత్రి రాత్రి కొచ్చి మొత్తం..మింగిపోతాడు
ఏ ఎన్ ఆర్,ఎన్ టి ఆర్..ఏలుతారన్నాను 
వాణిశ్రీ సావిత్రికి..వారసని చెప్పాను
జగ్గయ్య,జయలలిత..శోభన్ బాబు 
కృష్ణకి పద్మనాభం..రమాప్రభ, రాజబాబుకి
దసరాబుల్లోడికి..ప్రేమనగర్ నాయుడికి 
ఆత్రేయ ఆదుర్తి..మహాదేవనందరికి 
ఆనాడు చెప్పింది..ఈనాడు జరుగుతుంది 
ఈనాడు చెప్పేది..రేపు జరగబోతుంది
చూస్తా బాగా చూస్తా చేయి చూస్తా..చూసి చెబుతా
ముందు వెనక యేముందో..యెక్కడుందో 
యెవరికెవరి కెంతుందో..చూచి చెబుతా
హేయ్ చూస్తా బాగా చూస్తా..చేయి చూస్తా..చూసి చెబుతా

చరణం::2

వేలు వేలు ఎకరాలకు..గోలుమాలు 
తాతల యెట్టేట్టుకైన..చెప్పాలి టాటాలు
వేలు వేలు ఎకరాలకు..గోలుమాలు 
తాతల యెట్టేట్టుకైన..చెప్పాలి టాటాలు
దిగమింగే నాయకులకు..దిన గండాలు 
దిగమింగే నాయకులకు..దిన గండాలు 
పన్నెగ వేసే పెద్దలకు..వెలక్కాయలు
తాతయ్య పేరులో..మనవళ్ళు పెరిగారు
మనవళ్ళు దోచింది ముని మనవళ్ళడిగారు 
అడుగునున్న వాళ్ళింద అణిగి మణిగి వుండరు
ఆడోళ్ళే ఇక మీదట అందలాన వుంటారు 
మగవాళ్ళ ఆటకట్టి మరమ్మత్తు చేస్తారు 
అందుకే చిట్టి నిర్మల చేతిలో సేటు రాత రాశాడు 
ఓ పండిట్ జీ మేరా హత్ భీ దేఖియేనా..దేకుతా దేకుతా
ఈనాడు చెప్పేది రేపు జరగబోతుంది 
ఏమోలే అనుకుంటే మీ ఖర్మలే పొండి
చూస్తా బాగా చూస్తా చేయి చూస్తా..చూసి చెబుతా
ముందు వెనక యేముందో..యెక్కడుందో 
యెవరికెవరి కెంతుందో చూచి చెబుతా
హేయ్ చూస్తా బాగా చూస్తా చేయి చూస్తా..చూసి చెబుతా

మంచివాడు--1974
















సంగీత::K.V.మహదేవన్
రచన::ఆత్రేయ
గానం::P.సుశీల
తారాగణం::నాగేశ్వరరావు,వాణిశ్రీ,కాంచన,రాజబాబు,రమాప్రభ,హలాం,సత్యనారాయణ,పద్మనాభం.

పల్లవి::

అబ్బాయే..ఏ..పుట్టాడు 
అచ్చం నాన్నలాగే..ఏ..వున్నాడు 
అబ్బాయే..ఏ..పుట్టాడు
అచ్చం నాన్నలాగే..ఏ..వున్నాడు
నాన్నలాగే..ఏఏఏ..వున్నాడు

చరణం::1

దోబూచులాడు..కళ్ళు ఇంకలేవని 
తీయ తీయన్ని..బంధాలు తీరెననీ
దోబూచులాడు..కళ్ళు ఇంకలేవని 
తీయ తీయన్ని..బంధాలు తీరెననీ
తల్లిగా నను చేసి..తాను తప్పుకున్నాడు 
తల్లిగా నను చేసి..తాను తప్పుకున్నాడు 
ఆ కన్న తండ్రి పోలికతో కడుపుకోసి పోయాడు 
అబ్బాయే పుట్టాడు..అచ్చం నాన్నలాగే వున్నాడు 
అబ్బాయే పుట్టాడు..అచ్చం నాన్నలాగే వున్నాడు 
నాన్నలాగే వున్నాడు