Tuesday, February 08, 2011

దొరలు దొంగలు--1976


http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=4785
సంగీతం::సత్యం
రచన::మల్లెమాల
గానం::S.జానకి 
తారాగణం::రామకృష్ణ,రంగనాద్,శ్రీధర్,చంద్రమోహన్,వాణిశ్రీ,S.వరలక్ష్మి

పల్లవి::

ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ 
మందార మకరందమూ..ఊ..మందార మకరందమూ 
యెల తేటికె సొంతమూ..ఊ..మందార మకరందమూ
పగడాల నా అధరమూ..ఊ..పగడాల నా అధరమూ
పస గల ప్రతివాడికీ సొంతమూ..ఊ..మందార మకరందమూ..ఊఊఊఊ  

చరణం::1

ముసిరిన విరహం తోలగాలంటే..ముచ్చట నాతో నెరపండి
ముదిమికి పరువం రావాలంటే..ముద్దులు నావే కోసరండి
చెలిమి కోరితిని చెంత చేరితిని..చెలిమి కోరితిని చెంత చేరితిని
వలమికేల రవితేజా..ఆఆఆఆ  
మందార మకరందమూ..ఊ..మందార మకరందమూ..ఊ

చరణం::2

ముసిముసి నగవులు విసిరానంటే..మునులే ముందుకు ఉరకాలి
కసిగొని ఒకచూపు చూశానంటే..ఘనులే దాసులు  కావాలి
మదన సముడవని...హృదయ మొసగితిని
మదన సముడవని...హృదయ మొసగితిని
వదల నింక నిను రాజా..మందార మకరందమూ 
యెల తేటికె సొంతమూ..ఊ..మందార మకరందమూ
పగడాల నా అధరమూ..ఊ..పగడాల నా అధరమూ
పస గల ప్రతివాడికీ సొంతమూ..ఊ..మందార మకరందమూ..ఊ
వదలనురా అదునిదిరా..అదునిదిరా వదలనురా
వదలనురా నిను..వదలనురా వదలనురా