Monday, July 18, 2011

ఈడూ-జోడు--1963




సంగీతం::పెండ్యాల
రచన::ఆరుద్ర
గానం::ఘంటసాల,P.సుశీల

ఇదేమి లాహిరీ..ఇదేమి గారడీ
ఎడారి లోన పూలు పూచి ఎంత సందడి

ఇదేమి లాహిరీ..ఇదేమి గారడీ
ఎడారి లోన పూలు పూచి ఎంత సందడి

కోరుకున్న చిన్నదాని నవ్వూ
కోటి కోటి పరిమళాల పువ్వూ
ఆ..చిన్ననాటి సన్నజాజి చెలిమి..
కన్నులందు దాచుకున్న కలిమి
ఆ నాటి కూరిమీ చలువలోనే వేడిమి
ఆ నాటి కూరిమీ చలువలోనే వేడిమి
అనురాగపు మేలిమీ
ఇదేమి లాహిరీ..ఇదేమి గారడీ
ఎడారి లోన పులు పూచి ఎంత సందడి
ఇదేమి లాహిరీ...

రామచిలక ప్రేమమాట పలికే
రాజహంస లాగ నడిచి కులికే
ఆ..గోరువంక చిలుకచెంత వాలే కొసరి కొసరికన్నెమనసునేలే
కాబోయే శ్రీమతి మది నీకే బహుమతి
కాబోయే శ్రీమతి మది నీకే బహుమతి
అది ఆరని హారతి..
ఇదేమి లాహిరీ..ఇదేమి గారడీ
ఎడారి లోన పులు పూచి ఎంత సందడి
ఇదేమి లాహిరీ...మ్మ్ మ్మ్ మ్మ్ లలాలలాలలాల మ్మ్