Wednesday, July 28, 2010

శుభోదయం--1980




సంగీతం::K.V.మహాదేవన్
రచన::త్యాగరాజ స్వామి::కీర్తన
గానం::S.P.బాలు,P.సుశీల

తారాగణం::చంద్రమోహన్, సులక్షణ ,చారుహాసన్

పల్లవి::

గంధము పుయ్యరుగా పన్నీరు
గంధము పుయ్యరుగా

అను పల్లవి::

అందమయిన యదునందనుపై
కుందరదన లిరవొందగ పరిమళ గంధము పుయ్యరుగా

తిలకము దిద్దరుగా..కస్తూరి తిలకము దిద్దరుగా
కలకలమను ముఖకళగని సొక్కుచు
బలుకుల నమృతము లొలికెడు స్వామికి 

గంధము పుయ్యరుగా పన్నీరు
గంధము పుయ్యరుగా

చరణం::1

చేలము గట్టరుగా బంగారు చేలము గట్టరుగా
మాలిమితో గోపాలబాలులతో
నాల మేపిన విశాలనయనునికి 

గంధము పుయ్యరుగా పన్నీరు
గంధము పుయ్యరుగా

చరణం::2

పూజలు సేయరుగా..మనసార పూజలు సేయరుగా
జాజులు మరి విరజాజులు దవనము
రాజిత త్యాగరాజ నుతునికి 

గంధము పుయ్యరుగా పన్నీరు
గంధము పుయ్యరుగా

తిలకము దిద్దరుగా..కస్తూరి తిలకము దిద్దరుగా
చేలము గట్టరుగా బంగారు చేలము గట్టరుగా
పూజలు సేయరుగా..మనసార పూజలు సేయరుగా

గంధము పుయ్యరుగా పన్నీరు గంధము పుయ్యరుగా

శుభోదయం--1980::అమృతవర్షిణి::రాగం




సంగీతం::K.V.మహాదేవన్
రచన::వేటూరి
గానం::S.P.బాలు,P.సుశీల
తారాగణం::చంద్రమోహన్, సులక్షణ ,చారుహాసన్
అమృతవర్షిణి::రాగం 

పల్లవి::

తాతకజం తకజం తరికిటతక
తత్తకజం తకజం తరికిటతక
తాతకజం తరికిటతక తత్తకజం తరికిటతక తాతకజం తత్తకజం
తజం తజం తరికిట తక
తాతత్తకజం తజం తజం తరికిటతక
తాతకజం తకజం తకజం తరికిటతక
[అతడు] తత్తరిత్తధిమితద్దిమ తక్కిట
తక్కిట తఝుణు తరిగిడ తరిగిడ తోం
తత్తరిత్తధిమితద్దిమి తక్కిట తక్కిట
తఝుణు తరిగిడ తరిగిడతోం
తకతరిత్తధిమి తరిగిడ తరిగిడతోం
తరిగిడ తరిగిడతోం తరిగిడ తరిగిడ
తరిగిటతక తరిగిటతక - తత్తరికిట
తత్తరి తఝుణు తళాంగుతోంకిట తరిగిటతోం
తత్తరి తఝణు తళాంగుతోం కిట తరిగిట తోం

నటనం ఆడేనే..ఏ..ఏ..ఏ..
నటనం ఆడేనే భవ తిమిరహంసుడా
ఆ పరమశివుడు నటకావతంశుడై
తకధిమి తక యని 

నటనం ఆడేనే..ఏ..
నటనం ఆడేనే భవ తిమిరహంసుడా
ఆ పరమశివుడు నటకావతంశుడై
తకధిమి తక యని 
నటనం ఆడేనే..ఏ..

ఎనిమిది దిక్కులు ఒక్కటైనటుల
ఎండ వెన్నెలై వెల్లువైనటుల
నిటాలాక్షుడే తుషారాద్రి విడి 
విశాలాక్షితో తాళ లయగతుల

నటనం ఆడేనే..

ఎనిమిది దిక్కులు ఒక్కటైనటుల
ఎండ వెన్నెలై వెల్లువైనటుల

ఎనిమిది దిక్కులు ఒక్కటైనటుల
ఎండ వెన్నెలై వెల్లువైనటుల

నిటాలాక్షుడే తుషారాద్రి విడి 
విశాలాక్షితో తాళ లయగతుల
నటనం ఆడేనే..ఏ..

శివగంగ శివమమెత్తి పొంగగా
నెలవంక సిగపువ్వు నవ్వగా
హరిహరాత్మకమగుచు అఖిలా ప్రపంచమ్ము
గరుడా నాదానంద కావ్యమై వరలగా
నటనం ఆడేనే..ఆడేనే..ఆడేనే..

శివగంగ శివమమెత్తి పొంగగా
నెలవంక సిగపువ్వు నవ్వగా

ఆఆఆ..శివగంగ శివమమెత్తి పొంగగా
నెలవంక సిగపువ్వు నవ్వగా

హరిహరాత్మకమగుచు అఖిలా ప్రపంచమ్ము
హరిహరాత్మకమగుచు అఖిలా ప్రపంచమ్ము

గరుడా నాదానంద కావ్యమై వరలగా
నటనం ఆడేనే..ఆడేనే..

వసుధ వసంతాలు ఆలపించగా
సురలు సుధను ధరలో కురిపించగా

వసుధ వసంతాలు ఆలపించగా
సురలు సుధను ధరలో కురిపించగా

రతీ మన్మధులు కుమార సంభవ
శుభోదయానికి నాంది పలుకగా

రతీ మన్మధులు కుమార సంభవ
శుభోదయానికి నాంది పలుకగా

నటనం ఆడేనే భవ తిమిరహంసుడా
ఆ పరమశివుడు నటకావతంశుడై
తకధిమి తక యని 
నటనం ఆడేనే..ఏ..

భవతిమిరహంసుడా
ఈ పరమశివుడు నటకావతంశుడై
తకధిమి తక యని 
నటనం ఆడేనే..ఏ..

తత్తరిత ధిమితద్దిమితక్కిట తక్కిట
తఝుణు తరిగిడ తరిగిడతా
తత్తరిధిమి తధిమి తక్కిట తక్కిట
తఝుణు తక తరిగిట తకతా
తత్తరి తధిమి తక తరిగిట తా తక్కిట
తఝుణుతక తరిగిటతకతా
తకతరికిటతకతా తక తరిగిటతకతా
తకటతా తకిటతా తకిటతా తకిటతా
తత్తరి తకజంతాతకజం
తత్తకజం తత్తకజం తాతకజం
తరికిట తరికిటతో తత్తత్తకజం
తత్తరి తఝుణు తరిగిడతోంతోం 

శుభోదయం--1980






















సంగీతం::K.V.మహాదేవన్
రచన::వేటూరి
గానం::S.P.బాలు,P.సుశీల
తారాగణం::చంద్రమోహన్, సులక్షణ ,చారుహాసన్

పల్లవి::

కంచికి పోతావా కృష్ణమ్మా..ఆ
ఆ కంచి వార్తలేమి కృష్ణమ్మా..ఆ
కంచిలో ఉన్నది బొమ్మా
అది బొమ్మకాదు ముద్దుగుమ్మా

కంచికి పోతావా కృష్ణమ్మా
ఆ కంచి వార్తలేమి కృష్ణమ్మా
కంచిలో ఉన్నది బొమ్మా
అది బొమ్మకాదు ముద్దుగుమ్మా
కంచికి పోతావా కృష్ణమ్మా..ఆ

చరణం::1

మ్మ్.మ్మ్.మ్మ్ మ్మ్ మ్మ్..ఆ..ఆ..ఆహాహా
ఆ..త్యాగరాజ కీర్తనల్లే ఉన్నాది బొమ్మ
రాగమేదో తీసినట్టు ఉందమ్మా..మ్మ్ మ్మ్
త్యాగరాజ కీర్తనల్లే ఉన్నాది బొమ్మ
రాగమేదో తీసినట్టు ఉందమ్మా

ముసిముసినవ్వుల పువ్వులు పూసిందీ కొమ్మ
మువ్వగోపాలా..మువ్వగోపాలా
మువ్వగోపాలా..అన్నట్టుందమ్మా
అడుగుల సవ్వళ్ళు..కావమ్మా
అవి ఎడదల్లో సందళ్ళు..లేవమ్మా
అడుగుల సవ్వళ్ళు..కావమ్మా
అవి ఎడదల్లో సందళ్ళు..లేవమ్మా

కంచికి పోతావా కృష్ణమ్మా
ఆ కంచి వార్తలేమి కృష్ణమ్మా
కంచిలో ఉన్నది బొమ్మా
అది బొమ్మకాదు ముద్దుగుమ్మా
కంచికి పోతావా కృష్ణమ్మా..ఆ

చరణం::2

రాసలీల సాగినాక రాధ నీవేనమ్మా
రాతిరేళకంత నిదరరాదమ్మా
రాసలీల సాగినాక రాధ నీవేనమ్మా
రాతిరేళకంత నిదరరాదమ్మా
మ్మ్ మ్మ్ మ్మ్
ముసిరిన చీకటి ముంగిట
వేచిందీ కొమ్మా
ముద్దు మురిపాల..మువ్వగోపాల
నీవు రావేలా..అన్నట్టుందమ్మా
మనసు దోచుకున్న ఓయమ్మా
నీ మనసు దాచుకోకు బుల్లెమ్మా
మనసు దోచుకున్న ఓయమ్మా
నీ మనసు దాచుకోకు బుల్లెమ్మా

కంచికి పోతావ కృష్ణమ్మా
ముద్దు మురిపాల
ఆకంచి వార్తలేమి కృష్ణమ్మా
మువ్వగోపాల
కంచిలో ఉన్నది బొమ్మ
అది బొమ్మకాదు ముద్దుగుమ్మా
నీవు రావేలా..ఆ..ఆ..ఆ..ఆ

కంచికి పోతావ కృష్ణమ్మా..ఆ
ఆకంచి వార్తలేమి కృష్ణమ్మా..ఆ
పొంచి వింటున్నావా కృష్ణమ్మా..మ్మ్
అన్నీ మంచి వార్తలే కృష్ణమ్మా..హా

మాధవయ్య గారి మనవడు--1992




రచన::వేటూరి 
సంగీతం::విద్యా సాగర్ 
గానం::S. P.బాలు, చిత్ర
తారాగణం::A.N.R, హరీష్, సుజాత, నందిని

పల్లవి::

నీ చూపు సుప్రభాతం నీ నవ్వు పారిజాతం 
నీ చూపు సుప్రభాతం నీ నవ్వు పారిజాతం 
ఆత్రేయ ప్రేమ గీతం అందానికే వసంతం 
నీ పాట పాడి నే పల్లవైతి 
నీ పదము తప్ప యే పదములు దొరకక 

నేనేమో నీలిమేఘం నీవేమో వాయువేగం 
నేనేమో నీలిమేఘం నీవేమో వాయువేగం 
ఆ ఘంటసాల రాగం పాడిందిలే సరాగం
నీ జంట కోరి నే కీర్తనైతి 
నీ స్వరము తప్ప యే వరములు అడగక

చరణం::1

లలలలలా లలలలలా
లలలాలలలాలాలలాలలాలలలా 
పూతల్లో పురివిడిచిన పులకింత 
చేతల్లో మునుపెరగని చమరింత 
వులికి పడిన నీ నలక నడుములో 
మెలిక పడితినే వీణలో తీగనై 
తగిలిందే తాళం రగిలిందే రాగం 
చినుకల్లే నా ఒణుకేతీరా తడికోరేటి తాపాలలో 

నీ చూపు సుప్రభాతం నీ నవ్వు పారిజాతం 
నీ చూపు సుప్రభాతం నీ నవ్వు పారిజాతం
నేనేమో నీలిమేఘం నీవేమో వాయువేగం..మ్మ్ 

చరణం::2

ఆఆఆ ఆఆఆఅ ఆఆఆఅ
మ్మ్ మ్మ్ మ్మ్
  
ఓ కే లే ముద్దెరగని సాయంత్రం 
ఛీ పో లే సిగ్గేరిగిన తాంబూలం 
కధలు తెలిసెలే యదల కనులలో 
పురుడుకడిగిపో పువ్వుకే తేనెతో 
నులిపెట్టే దీపం శీలలోనే శిల్పం 
వలపల్లేరా వయసేతీరా జతలూగేటి జంపాలలో 

నేనేమో నీలిమేఘం నీవేమో వాయువేగం
నీ చూపు సుప్రభాతం నీ నవ్వు పారిజాతం
ఆ ఘంటసాల రాగం పాడిందిలే సరాగం
నీ పాట పాడి నే పల్లవైతి 
నీ పదము తప్ప యే పదములు దొరకక
నేనేమో నీలిమేఘం నీవేమో వాయువేగం
నీ చూపు సుప్రభాతం నీ నవ్వు పారిజాతం

లంబాడోళ్ళ రాందాసు--1978




సంగీతం::S. రాజేశ్వరరావు
రచన::D.C. నారాయణ రెడ్డి
గానం::S. P.బాలు,P.సుశీల,  
తారాగణం::చలం,రోజారమణి, జగ్గయ్య,ప్రభాకర రెడ్డి,పండరీబాయి,రాజబాబు,
రావు గోపాల రావు,జయలక్ష్మి

పల్లవి::

ఈ పాలవెన్నెల్లో నీ జాలి కళ్ళల్లో 
ఈ పాలవెన్నెల్లో నీ జాలి కళ్ళల్లో 
ఇద్దరూ ఉన్నారు ఎవ్వరూ వారెవరూ? 
ఇద్దరూ ఉన్నారు ఎవ్వరూ వారెవరూ? 

ఈ పాలవెన్నెల్లో నా జాలి కళ్ళల్లో 
ఈ పాలవెన్నెల్లో నా జాలి కళ్ళల్లో
ఇద్దరూ ఒకరేలే ఆ ఒక్కరూ నేవేలే 
ఇద్దరూ ఒకరేలే ఆ ఒక్కరూ నేవేలే 

చరణం::1

చుక్కలే నిను మెచ్చీ..పక్కనే దిగివచ్చీ 
చుక్కలే నిను మెచ్చీ..పక్కనే దిగివచ్చీ
మక్కువే చూపితే నన్ను మరచేవో..ఓఓఓ
నన్ను మరచేవో

చుక్కలు వేలు ఉన్నా నా చుక్కి ఒక్కటే కాదా 
చుక్కలు వేలు ఉన్నా నా చుక్కి ఒక్కటే కాదా
లక్షల మగువలు ఉన్నా నా లక్ష్యమొక్కటే కాదా
నా లక్ష్మి ఒక్కటే కాదా..నా లక్ష్మి ఒక్కటే కాదా

ఈ పాలవెన్నెల్లో నీ జాలి కళ్ళల్లో 
ఇద్దరూ ఉన్నారు ఎవ్వరూ వారెవరూ? 
ఇద్దరూ ఒకరేలే ఆ ఒక్కరూ నేవేలే

చరణం::2

తుంటరి చిరుగాలి కొంటెగా..నిను చూసి 
తుంటరి చిరుగాలి కొంటెగా..నిను చూసి
పైటనే కాజేస్తే ఏమి చేస్తావో..ఏమి చేస్తావో

ఐతే ఏమవుతుందీ..నీ చేతిలోన అది ఉంటే 
ఐతే ఏమవుతుందీ..నీ చేతిలోన అది ఉంటే
స్వర్గం దిగి వస్తుందీ..నా సామి తోడుగా ఉంటే
నా రాముని నీడ ఉంటే..

ఈ పాలవెన్నెల్లో నీ జాలి కళ్ళల్లో 
ఇద్దరూ ఉన్నారు ఎవ్వరూ వారెవరూ? 
ఇద్దరూ ఒకరేలే ఆ ఒక్కరూ నీవేలే
ఆఆఆఆ  లాలాలలామ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్